IPL 2023: Chahal Says Wife Dhanashree Can Predict Where He Will Bowl - Sakshi
Sakshi News home page

ఆట గురించి తెలుసు.. ఎక్కడ బాల్‌ వేస్తానో కూడా అంచనా వేయగలదు: భార్యపై చహల్‌ ప్రశంసలు

Published Tue, Apr 4 2023 3:12 PM | Last Updated on Tue, Apr 4 2023 3:55 PM

IPL 2023 Chahal Says Wife Dhanashree Can Predict Where He Will Bowl - Sakshi

చహల్‌- ధనశ్రీ వర్మ (PC: Rajasthan Royals)

IPL 2023- Yuzvendra Chahal- Dhanashree Verma: ‘‘తను నాతో ఉంటే నా ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మరింత కాన్ఫిడెంట్‌గా ఉంటాను. తనే నా బలం. తన ఉనికి నాలో సానుకూల దృక్పథాన్ని నింపుతుంది. నేను మ్యాచ్‌ ఆడే సమయంలో తను స్టాండ్స్‌లో ఉండటం నాకిష్టం. 

తను నన్ను చూసి చిరునవ్వులు చిందిస్తూనే నా ఆట తీరును నిశితంగా పరిశీలిస్తుంది. నేనెలా బౌలింగ్‌ చేస్తున్నానో గమనిస్తుంది. కొన్నిసార్లు నేను బాల్‌ ఎక్కడ వేస్తానో కూడా ముందే అంచనా వేస్తుంది. గత కొన్ని వారాల క్రితం నాకు ఈ విషయం తెలిసింది.

తను నా పక్కన ఉంటే చాలు. అంతకంటే ఇంకేమీ అవసరం లేదు’’ అంటూ టీమిండియా స్పిన్నర్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ బౌలర్‌ యజువేంద్ర చహల్‌ ఉద్వేగానికి లోనయ్యాడు. తన భార్య ధన శ్రీ వర్మ ఎల్లవేళలా తనకు మద్దతుగా ఉంటుందంటూ ఆమెపై ఇలా ప్రేమను చాటుకున్నాడు.

కాగా యూట్యూబర్‌, కొరియోగ్రాఫర్‌ అయిన ధనశ్రీని చహల్‌ ప్రేమించి పెళ్లాడాడు. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట.. విడిపోతోందంటూ కొన్నాళ్ల క్రితం వార్తలు వచ్చాయి. ధనశ్రీ తన ఇన్‌స్టా అకౌంట్‌ నుంచి చహల్‌ ఇంటిపేరు తొలగించడం, శ్రేయస్‌ అయ్యర్‌తో దిగిన ఫొటోలు వైరల్‌ కావడం ఇందుకు కారణం.

అయితే, వాటన్నిటికీ చెక్‌ పెడుతూ తాము కలిసే ఉన్నామని, కలిసే ఉంటామని ప్రకటించి చహల్‌- ధనశ్రీ దంపతులు అభిమానుల సందేహాలను పటాపంచలు చేశారు. ఇక చహల్‌ ఎప్పుడు మ్యాచ్‌ ఆడినా ధనశ్రీ అతడి వెంటే ఉంటుంది. భర్తను చీర్‌ చేస్తూ అతడి ఘనతలు చూసి పొంగిపోతుంది.

ఐపీఎల్‌-2023లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో రాజస్తాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌ సందర్భంగా కూడా ధనశ్రీ ఉప్పల్‌ స్టేడియానికి విచ్చేసింది. అతడి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో చప్పట్లు కొడుతూ అభినందనలు తెలిపింది. ఈ క్రమంలో భార్య సపోర్టు గురించి చహల్‌ మాట్లాడిన వీడియోను రాజస్తాన్‌ తమ ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేసింది. కపుల్‌ గోల్స్‌ సెట్‌ చేస్తున్నారని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement