ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్) అధికారిక ట్విటర్ ఖాతా నుంచి పోస్టైన ఓ ట్వీట్ క్రికెట్ ఫాలోవర్స్‌ను తికమక పెట్టింది. క్యాష్ రిచ్ లీగ్ ప్రారంభానికి పట్టుమని 10 రోజుల సమయం కూడా లేని తరుణంలో కెప్టెన్‌ను మార్చేసామని, సంజూ శాంసన్‌పై వేటు వేసి, కొత్త కెప్టెన్‌గా యుజ్వేంద్ర చహల్‌ను నియమించామని ఆర్‌ఆర్ బుధవారం ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం కాదని తేలింది.
Meet RR new captain @yuzi_chahal 🎉 🎉 pic.twitter.com/ygpXQnK9Cv
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
విచిత్ర ప్రవర్తనతో నిత్యం వార్తల్లో నిలిచే చహల్.. అభిమానులను ఫూల్స్ చేసేందుకు జట్టు ట్విటర్ హ్యాండిల్‌ను హ్యాక్ చేసి తనను తాను కెప్టెన్‌గా ప్రకటించుకున్నాడని, జట్టు యాజమాన్యానికి తెలిసే చహల్ ఈ పని చేశాడని అతని తదుపరి ట్వీట్లను బట్టి స్పష్టమవుతుంది. చహల్ సరదాగా చేసిన ఈ పని ఆర్‌ఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తుంది. లీగ్ ప్రారంభానికి ముందు ఇలాంటి మతిలేని పనులేంటని నెటిజన్లు చహల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆర్‌ఆర్ నిజంగానే ఈ నిర్ణయం తీసుకుందని కొందరు అభిమానులు షాక్‌కు గురి కాగా, మరికొందరేమో యాజమాన్యం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను పోస్ట్ చేశారు.
RR me twitter account me in login kar Diya hai … bola tha admin job pange mat Lena 🤣🤣 https://t.co/k3yNd6VsEx
— Rajasthan Royals (@rajasthanroyals) March 16, 2022
కాగా, చహల్.. ఆర్‌ఆర్ అధికారిక ట్విటర్‌ను ఆపరేట్ చేసే వ్యక్తి (జేక్ లష్ మెక్‌క్రమ్) నుంచి పాస్‌వర్డ్ తీసుకున్నాడని, ఇందుకు గాను అతనికి ధన్యవాదాలు కూడా తెలిపాడని, ఈ తంతు మొత్తం యాజమాన్యం కనుసన్నల్లోనే జరిగిందని తెలిసి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. ఇలాంటి మెంటల్ పని చేసినందుకు గాను చహల్‌తో పాటు ఆర్‌ఆర్ యాజమాన్యంపై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇదిలా ఉంటే, గత సీజన్ వరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడిన చహల్‌ను ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
చదవండి: ఉలిక్కిపడ్డ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు.. బస్సుపై దాడికి పాల్పడ్డ దుండగులు
Comments
Please login to add a commentAdd a comment