World Cup 2023- Sourav Ganguly Picks His Squad: వన్డే వరల్డ్‌కప్-2023 నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తన జట్టును ప్రకటించాడు. ఈ ఐసీసీ ఈవెంట్‌కు తన అభిప్రాయాలకు అనుగుణంగా 15 మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకున్నాడు.
ఆసియా వన్డే టోర్నీకి బీసీసీఐ ప్రకటించిన జట్టులో రెండు మార్పులతో దాదా ముందుకు వచ్చాడు. ఇద్దరు యువ ఆటగాళ్లను మినహాయించి మిగతా అంతా సేమ్ టూ సేమ్ అనేలా తన టీమ్‌ను సెలక్ట్ చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా తను బలంగా వినిపిస్తున్న పేరును మాత్రం గంగూలీ విస్మరించడం గమనార్హం.
అందుకే చహల్‌పై వేటు!
టీమిండియా పరిమిత ఓవర్ల మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్‌కు ఆసియా కప్ జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవే తమ మొదటి ప్రాధాన్యం అని, ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు చోటు లేనందునే యుజీని పక్కనపెట్టామని జట్టు ప్రకటన సందర్భంగా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పష్టం చేశాడు.
దీంతో అనుభవజ్ఞుడైన చహల్‌ను పక్కనపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతంలో గంగూలీ మాట్లాడుతూ చహల్‌తో పాటు యువ సంచలనం యశస్వి జైశ్వాల్‌లను తప్పక ఐసీసీ ఈవెంట్లో ఆడించాలని అభిప్రాయపడ్డాడు.
తిలక్ వర్మకు నో ఛాన్స్
కానీ, తాజాగా తను ప్రకటించిన ప్రపంచకప్ జట్టులో మాత్రం ఈ ఇద్దరికీ చోటు ఇవ్వలేదు. ముఖ్యంగా చహల్ ప్రాధాన్యాన్ని వివరిస్తూ అతడికి స్థానమివ్వాలన్న దాదా ఇప్పుడిలా తనను పక్కనపెట్టాడు. ఇక ఆసియా కప్ జట్టులో చోటు దక్కించుకున్న సంచలన ఆటగాడు, హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మతో పాటు కర్ణాటక యువ పేసర్ ప్రసిద్ కృష్ణను కూడా దాదా తప్పించాడు.
అయితే, మిడిలార్డర్ బ్యాటర్ గాయపడితే తిలక్ వర్మ, పేసర్ ఎవరైనా గాయం కారణంగా దూరమైతే ప్రసిద్, స్పిన్నర్ గాయపడితే చహల్‌లను తీసుకోవాలని.. వాళ్లను ఇంజూరీ రిజర్వ్‌లుగా పేర్కొన్నాడు. కాగా అక్టోబరు 5 నుంచి భారత్ వేదికగా ప్రపంచకప్-2023 ఆరంభం కానుంది.
వన్డే వరల్డ్‌కప్-2023కి సౌరవ్ గంగూలీ ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.
చదవండి: WC: కోహ్లి, బాబర్ కాదు.. ఈసారి అతడే టాప్ స్కోరర్: సౌతాఫ్రికా లెజెండ్
Asia Cup: షెడ్యూల్, జట్లు, ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్.. వివరాలివే
Comments
Please login to add a commentAdd a comment