Watch: Rohit Sharma Beats Yuzvendra Chahal For Fun, Virat Kohli Reaction Video Goes Viral - Sakshi
Sakshi News home page

Rohit Sharma Beats Chahal: చాహల్‌ను కొట్టిన రోహిత్‌ శర్మ.. పక్కనే ఉన్న కోహ్లి ఏం చేశాడంటే?

Published Mon, Jul 31 2023 11:30 AM | Last Updated on Mon, Jul 31 2023 11:55 AM

Rohit Sharma Beats Yuzvendra Chahal For Fun - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ 1-1తో సమమైంది. ఈ మ్యాచ్‌లో భారత్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌ రెండు విభాగాల్లోనూ విఫలమైంది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా డగౌట్‌ ఓ ఫన్నీ సంఘటన చోటు చేసుకుంది. భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ డగౌట్‌లో కూర్చున్న యుజ్వేంద్ర చాహల్‌ను సరదగా కొట్టాడు.

ఈ సమయంలో విరాట్ కోహ్లి, జయదేవ్ ఉనద్కత్ కూడా చాహల్ పక్కనే కూర్చున్నారు. ఇది చూసిన కోహ్లి  నవ్వును ఆపుకోలేకపోయాడు. కాగా చాహల్‌, రోహిత్‌ మంచి స్నేహితులుగా చాలా కాలం నుంచి ఉన్నారు. చాహల్‌ తన ఐపీఎల్‌ అరంగేట్రం కూడా ముంబై ఇండియన్స్‌ తరపునే చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో పాటు విరాట్‌ కోహ్లి కూడా దూరమయ్యాడు. కొత్త ఆటగాళ్లను పరీక్షించేందుకు వీరిద్దరికి విశ్రాంతి ఇచ్చారు. అదే విధంగా చాహల్‌కు తొలి రెండు వన్డేల్లో కూడా తుది జట్టులో చోటు దక్కలేదు. రెండో వన్డేలో సంజూ శాంసన్‌, అక్షర్‌ పటేల్‌కు అవకాశం లభించింది.

కానీ వారి​ద్దరూ తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేకపోయారు. ఇక సిరీస్‌ డిసైడర్‌ మూడో వన్డే ట్రినాడాడ్‌ వేదికగా మంగళవారం జరగనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి తిరిగి వచ్చే ఛాన్స్‌ ఉంది.
చదవండి: #Nicholas Pooran: పూరన్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌! 10 ఫోర్లు, 13 సిక్సర్లతో చెలరేగినా.. లాభం లేదు!
                  IND vs WI: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement