Dhanashree Verma With Rohit Ritika Shreyas Fans Asks Where Is Chahal - Sakshi
Sakshi News home page

Yuzvendra Chahal: నెట్టింట చహల్‌ భార్య ధనశ్రీ వర్మ ఫొటోలు వైరల్‌.. ఈసారి కూడా! కావాలనే ఇలా?

Published Mon, Feb 27 2023 7:37 PM | Last Updated on Mon, Feb 27 2023 8:34 PM

Dhanashree Verma With Rohit Ritika Shreyas Fans Asks Where Is Chahal - Sakshi

Yuzvendra Chahal- Dhanashree Verma: టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ సతీమణి, యూట్యూబర్‌ ధనశ్రీ వర్మకు సోషల్‌ మీడియాలో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత, వృత్తిగత అప్‌డేట్లను అభిమానులతో పంచుకుంటుందామె. 

ఇన్‌స్టాగ్రామ్‌లో ధనశ్రీకి యాభై లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీంతో ఆమె పోస్టులకు లక్షల్లో లైకులు రావడం సహా అదే స్థాయిలో కొన్నిసార్లు ట్రోలింగ్‌ బారిన పడుతుందామె. గతంలో టీమిండియా స్టార్‌ సూర్యకుమార్‌ యాదవ్‌- దేవిషా శెట్టి దంపతులతో పాటు.. మరో క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌తో ఆమె దిగిన ఫొటో పలు అనుమానాలకు తావిచ్చింది.

అప్పటికే తన ఇన్‌స్టా అకౌంట్లో ధనశ్రీ భర్త ఇంటి పేరును తొలగించడం.. ఆపై ఇలా వేరే క్రికెటర్‌తో కలిసి కనిపించడంతో విడాకుల వార్తలు తెరమీదుకు వచ్చాయి. చహల్‌- ధనశ్రీ స్వయంగా తాము కలిసే ఉంటున్నామని చెప్పిన తర్వాతే రూమర్లకు అడ్డుకట్ట పడింది.

తాజాగా..  టీమిండియా క్రికెటర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ సంగీత్‌లో పాల్గొన్న ధనశ్రీ షేర్‌ చేసిన ఫొటోలు మరోసారి నెట్టింట చర్చకు దారితీశాయి. పెళ్లికొడుకు శార్దూల్‌తో కలిసి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ- రితికా సజ్దే దంపతులు, ధనశ్రీ, శ్రేయస్‌ అయ్యర్‌ ఫొటో దిగారు. 

వీటిని ఇన్‌స్టాలో పంచుకున్న ధనశ్రీ 5 ఎక్స్‌ పవర్‌ అంటూ ఫైర్‌ ఎమోజీని జత చేసింది. దీంతో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ‘‘చహల్‌ భాయ్‌ ఎక్కడ? మీరు ప్రతిసారి భాయ్‌ను కావాలనే అవాయిడ్‌ చేస్తారా? రూమర్లు రావాలని కోరుకుంటారా?

అప్పుడు ఆ ఫొటోలతో.. ఇప్పుడు ఈ ఫొటోలతో ఎందుకిలా వదినమ్మా? చహల్‌ భయ్యా కూడా ఉంటే బాగుండేది’’ అని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు మాత్రం.. ‘‘అప్పుడలా.. ఇప్పుడలా? ఏదో మతలబు ఉంది’’ అంటూ ట్రోల్‌ చేస్తున్నారు. ఇలా ధనశ్రీ పేరు మరోసారి సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది. ఇదిలా ఉంటే.. స్వదేశంంలో ఆస్ట్రేలియాతో బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ సిరీస్‌లో చహల్‌కు చోటు దక్కలేదు.

చదవండి: సూర్య కాదు.. ఆ ఆసీస్‌ బ్యాటర్‌ వల్లేనన్న ఆజం ఖాన్‌! ‘స్కై’తో నీకు పోలికేంటి?
T20 WC 2023: అత్యుత్తమ టీ20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్‌ నుంచి ఒకే ఒక్కరు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement