India Asia Cup 2023 squad: టీమిండియా మణికట్టు స్పిన్నర్ యజువేంద్ర చహల్ తీవ్ర నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అయితే.. అదే సమయంలో సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న అతడి ఆటిట్యూడ్‌తో అభిమానుల మనసు గెలవడం విశేషం. ఆసియా కప్-2023లో పాల్గొనే జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే.
వరల్డ్‌కప్‌లోనూ?
వన్డే వరల్డ్‌కప్-2023 ఈవెంట్‌కు ప్రొవిజినల్ టీమ్‌గా భావిస్తున్న ఈ జట్టులో స్టార్ బౌలర్ యజువేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. మరో మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌వైపే మొగ్గు చూపింది మేనేజ్‌మెంట్. ఈ చైనామన్ స్పిన్నర్‌తో పాటు స్పిన్ విభాగంలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్‌లకు చోటిచ్చింది.
క్రిప్టిక్ ట్వీట్‌తో చహల్
ఈ నేపథ్యంలో నిరాశకు గురైన యుజీ చహల్ క్రిప్టిక్ ట్వీట్‌తో ముందుకు వచ్చాడు. మబ్బుల్లో దాగిన సూర్యుడు... మళ్లీ ప్రకాశిస్తున్నట్లుగా ఉన్న ఎమోజీలతో క్యాప్షన్ ఏమీ లేకుండానే పోస్ట్ చేశాడు. సూర్యుడు మళ్లీ ఉదయిస్తాడు అన్న అర్థంలో నర్మగర్భ ట్వీట్ చేశాడు.
దీంతో అభిమానులు అతడికి అండగా నిలుస్తున్నారు. ‘‘అవును.. నువ్వు చెప్పిందే నిజమే భాయ్. మళ్లీ నీకు మంచి రోజులు వస్తాయి’’ అని బదులిస్తున్నారు. కాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ చహల్‌ను జట్టు నుంచి తప్పించడంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇకపై నో కుల్-చా!
చోటు లేదు గనుకే అతడిని ఎంపిక చేయలేదని, అయితే.. వన్డే వరల్డ్‌కప్‌లో చహల్ దారులు మూసుకుపోలేదని హిట్‌మ్యాన్ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇకపై కుల్-చా ద్వయాన్ని ఒకేసారి జట్టులో చూసే అవకాశం లేదని పేర్కొన్నాడు.
ఇద్దరు రిస్ట్ స్పిన్నర్లకు జట్టులో చోటివ్వలేమని.. చహల్ కంటే కుల్దీప్ మెరుగ్గా ఉన్న నేపథ్యంలో చైనామన్ బౌలర్‌కే ఓటు వేశామని చెప్పుకొచ్చాడు. ఈ నేపథ్యంలో చహల్ ఈ మేరకు ట్వీట్ చేయడం గమనార్హం.
అప్పుడు రోహిత్ సైతం..
ఇక గతంలో జట్టులో చోటు దక్కని నేపథ్యంలో ప్రస్తుత టీమిండియా సారథి రోహిత్ శర్మ సైతం.. ‘‘సూర్యుడు రేపు మళ్లీ ఉదయిస్తాడు’’ అని ట్విటర్‌లో రాసుకొచ్చాడు. 2018లో టెస్టుల్లో అతడికి స్థానం లేకపోవడంతో ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. అదే రీతిలో చహల్ సైతం తన బాధను వ్యక్తపరుస్తూనే.. మళ్లీ తిరిగివస్తాననే ఆశాభావం వ్యక్తం చేయడం విశేషం.
చదవండి: WC 2023: ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డ్? అంతేనన్న అగార్కర్! వీడియో వైరల్
⛅️——> 🌞
— Yuzvendra Chahal (@yuzi_chahal) August 21, 2023
Sun will rise again tomorrow 😊
— Rohit Sharma (@ImRo45) July 18, 2018
Comments
Please login to add a commentAdd a comment