కౌంటీ క్రికెట్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మాథ్యూ పాట్స్ రెచ్చిపోయాడు. కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్-1 పోటీల్లో భాగంగా లాంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో డర్హమ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్స్ ఒకే ఇన్నింగ్స్‌లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. పాట్స్ చెలరేగిపోవడంతో ఈ మ్యాచ్‌లో డర్హమ్ ఇన్నింగ్స్ 63 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఈ మ్యాచ్ మొత్తంలో పాట్స్ 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 3, రెండో ఇన్నింగ్స్‌లో 9) పడగొట్టాడు. 25 ఏళ్ల పాట్స్ ఇంగ్లండ్ జాతీయ జట్టు తరఫున 8 టెస్ట్‌ల్లో 28 వికెట్లు.. 4 వన్డేల్లో 2 వికెట్లు పడగొట్టాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన లాంకాషైర్ తొలి ఇన్నింగ్స్‌లో 228 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ హర్స్ట్ 90 పరుగులతో రాణించాడు. డర్హమ్ బౌలర్లలో బెన్ రెయిన్ 5, మాథ్యూ పాట్స్ 3, బాస్ డి లీడ్ ఓ వికెట్ పడగొట్టారు.
బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీ
డేవిడ్ బెడింగ్హమ్ భారీ డబుల్ సెంచరీతో (279), అకెర్‌మన్ (186) భారీ సెంచరీతో చెలరేగడంతో డర్హమ్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. లాంకాషైర్ బౌలర్లలో వెల్స్ 4, ఫిలిప్ 2, బెయిలీ, థామస్, టామ్ హార్ట్లీ తలో వికెట్ పడగొట్టారు.
తొమ్మిది వికెట్లు పడగొట్టిన పాట్స్
345 పరుగులు వెనకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లాంకాషైర్.. మాథ్యూ పాట్స్ తొమ్మిది వికెట్లతో చెలరేగడంతో ఈ ఇన్నింగ్స్‌లోనూ తక్కువ స్కోర్‌కే ఆలౌటైంది. పాట్స్ ధాటికి లాంకాషైర్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో 282 పరుగులకు చాపచుట్టేసింది.
చదవండి: తొమ్మిది వికెట్లు తీసిన చహల్
Comments
Please login to add a commentAdd a comment