
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో దుబాయ్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ 41.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లతో సత్తాచాటాడు
ఫస్ట్ స్పెల్‌లో వికెట్ లెస్‌గా వెనుదిరిగిన కుల్దీప్.. తన రెండో స్పెల్‌లో మాత్రం అదరగొట్టాడు. అతడితో హార్దిక్ పాండ్యా సైతం బంతితో మ్యాజిక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మంచి టచ్‌లో కన్పించిన పాక్ ఓపెనర్ బాబర్ ఆజంను హార్దిక్ ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు.
అదే విధంగా హాఫ్ సెంచరీతో మెరిసిన సౌద్ షకీల్‌ను కూడా పాండ్యానే పెవిలియన్‌కు పంపాడు. ఓవరాల్‌గా 8 ఓవర్లు బౌలింగ్ చేసిన పాండ్యా.. కేవలం 31 పరుగులిచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. వీరిద్దరితో పాటు అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా తలా వికెట్ సాధించారు.
ఇక పాకిస్తాన్ బ్యాటర్లలో సౌద్ షకీల్(76 బంతుల్లో 5ఫోర్లతో 62) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్(46), కుష్దీల్ షా(38) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మరి 242 పరుగుల టార్గెట్‌ను భారత్ సునాయసంగా ఛేదిస్తుందో లేదా పాక్ డిఫెండ్ చేసుకుంటుందో వేచి చూడాలి.
చదవండి: ‘ఏంటిది?’.. రిజ్వాన్ చర్యకు హర్షిత్ రాణా రియాక్షన్ వైరల్.. గంభీర్ కూడా!
Comments
Please login to add a commentAdd a comment