బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. మార్కస్ హారిస్ (5 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.