melborne test
-
పాకిస్తాన్ అత్యంత చెత్త రికార్డు.. వరల్డ్ క్రికెట్లోనే తొలి జట్టుగా
మెల్బోర్న్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ 318 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మార్నస్ లాబుషేన్ 63 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో అమీర్ జమాల్ మూడు వికెట్లతో అదరగొట్టగా.. షాహీన్ అఫ్రిది, మీర్ హంజా హసన్ అలీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అయితే తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్ ఏకంగా ఎక్స్‌ట్రాస్ రూపంలో ఏకంగా 52 అదనపు పరుగులను సమర్పించుకుంది. తద్వారా అత్యంత చెత్త రికార్డును పాకిస్తాన్ తమ పేరిట లిఖించుకుంది. చారిత్రత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో ఒక టెస్ట్ ఇన్నింగ్స్‌లో అత్యధిక ఎక్స్‌ట్రాలు ఇచ్చిన జట్టుగా పాక్ రికార్డులకెక్కింది. పాకిస్తాన్ సమర్పించుకున్న ఎక్స్ట్రాస్లో 15 వైడ్లు, 20 బైలు ఉన్నాయి. చదవండి: IND vs SA: 'అతడు అన్‌ఫిట్.. కెప్టెన్‌గానే కాదు ఆటగాడిగా కూడా పనికిరాడు' -
‘36’ పీడ కల.. మనసు కుదుటపడింది!
ఎంత వద్దనుకున్నా ‘36’ జ్ఞాపకాలు ఒకవైపు వెంటాడుతూనే ఉంటాయి... అటు ఆటతో, ఇటు మాటతో కూడా జట్టును నడిపించే నాయకుడు వెళ్లిపోయాడు... మ్యాచ్‌కు ముందు ప్రధాన పేసర్ దూరమైతే, మ్యాచ్ మధ్యలో మరో పేసర్ బంతి వేయలేని పరిస్థితి... బరిలో ఇద్దరు కొత్త ఆటగాళ్లు... ఆపై టాస్ కూడా ముఖం చాటేసింది... ఇలాంటి ప్రతికూలతలకు ఎదురీది భారత జట్టు మెల్బోర్న్లో మరపురాని విజయాన్ని అందుకుంది. గత 20 ఏళ్లలో విదేశీ గడ్డపై భారత్ పలు చిరస్మరణీయ విజయాలు సాధించింది. పెర్త్ (2007), జొహన్నెస్‌బర్గ్ (2006), హెడింగ్లీ (2002), డర్బన్ (2010), అడిలైడ్ (2018), ట్రెంట్‌బ్రిడ్జ్ (2007)... వాటిలో కొన్ని. వాటితో పోలిస్తే తాజా విజయం ఏ స్థానంలో నిలుస్తుంది, దీని ప్రత్యేకత ఏమిటి? గత ఘనతలతో సరిగ్గా పోల్చి చూడటం సరైంది కాకపోవచ్చు. ఏ మ్యాచ్ గొప్పతనం దానిదే. కానీ ప్రస్తుతం జట్టు ఉన్న స్థితిని చూస్తే ఇది చెప్పుకోదగ్గ ఘనతగానే కనిపిస్తుంది. గత మ్యాచ్ పరాభవాన్ని మరచి ఇలాంటి గెలుపు సాధించడం అంటే ఆట మాత్రమే ఉంటే సరిపోదు. అంతకుముందు మానసిక దృఢత్వం, పోరాటతత్వం కూడా ఉండాలి. రహానే సేన దానిని ఇప్పుడు సరిగ్గా ప్రదర్శించింది. ఈ మ్యాచ్‌కు ముందు గత 50 ఏళ్లలో ఆస్ట్రేలియా గడ్డపై ఒక విదేశీ జట్టు 0–1తో వెనుకబడి తర్వాతి మ్యాచ్‌లో నెగ్గడం రెండుసార్లు మాత్రమే జరిగింది. ఇప్పుడు టీమిండియా దానిని చేసి చూపించింది. ప్రత్యర్థి స్కోరును రెండుసార్లు కూడా 200 దాటకుండా కట్టడి చేయడంలోనే మన బౌలింగ్ సత్తా కనిపించింది. బుమ్రా ఎప్పటిలాగే శుభారంభం అందిస్తే విదేశీ గడ్డపై మనకు కొత్త అశ్విన్ కనిపించాడు. అనుభవంకొద్దీ రాటుదేలిన ఈ స్పిన్నర్ కీలక వికెట్లతో ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. విదేశీ గడ్డపై గత 14 టెస్టుల్లో కేవలం 25.8 సగటుతో అశ్విన్ 54 వికెట్లు తీయడం అతని బౌలింగ్ పదునెక్కిన తీరు ఏమిటో చెబుతుంది. ఇక అశ్విన్‌కు సరి జోడీగా జడేజా చూపించిన ఆట కూడా ఆసీస్‌ను దెబ్బ కొట్టింది. విదేశాల్లో మూడేళ్ల తర్వాత వీరిద్దరు ఒకే మ్యాచ్‌లో కలిసి ఆడి జట్టును గెలిపించారు. ఇక బ్యాటిం గ్లో జడేజా ఇచ్చే అదనపు విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుజారా రెండు ఇన్నింగ్స్‌లలో విఫలమైనా... రహానే మొత్తం భారాన్ని మోసి శతకం సాధించడంతో పాటు ఫీల్డింగ్ వ్యూహాల్లో కెప్టెన్ జట్టును నడిపించిన తీరుపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. ఎవరి గురించి ఎంత చెప్పినా మెల్బోర్న్ టెస్టు గిల్, సిరాజ్‌లకు అందరికంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. వీరిద్దరి ఆట చూస్తే తొలి టెస్టు ఆడుతున్నట్లుగా ఏమాత్రం కనిపించలేదు. మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీయడమే కాకుండా... ఆసాం తం అదే జోష్‌ను ప్రదర్శించిన హైదరాబాదీ సిరాజ్ అందరి మనసులు గెలుచుకు న్నాడు. ఇక గిల్ ఆడిన క్లాసికల్ షాట్లు అతనికి మంచి భవిష్యత్తు ఉందని చూపించాయి. సిరీస్ తుది ఫలితం ఎలాగైనా ఉండ వచ్చు కానీ తాజా ప్రదర్శన మాత్రం భారత అభిమానుల్లో సంతోషం నింపిందనేది వాస్తవం. కొసమెరుపు... మ్యాచ్ గెలిచిన తర్వాత భారత జట్టు ఏమైనా సంబరాలు చేసుకున్నట్లు కనిపించిందా... గాల్లోకి పంచ్‌లు విసురుతూ డగౌట్‌లోని ఆటగాళ్లు కూడా ఉత్సాహం ప్రదర్శించడం చూశామా... అసలు ఏమీ జరగనట్లు, ఏదో ఒక రొటీన్ మ్యాచ్ ఆడినట్లు, ఇలా గెలవడం తమకు కొత్త కాదన్నట్లు, ఇకపై ఆస్ట్రేలియాలో గెలవడం అద్భుతంగా భావించరాదని, మున్ముందు చాలా వస్తాయన్నట్లుగా మనోళ్ల స్పందన కనిపించింది. సిరీస్‌కు ముందు కోహ్లి చెప్పినట్లుగా ‘న్యూ ఇండియా’ అంటే ఇదే కావచ్చేమో! (చదవండి: రహానే అన్ని ప్రశంసలకు అర్హుడు: రవిశాస్త్రి) -
మొదటి రోజు మనదే
అడిలైడ్ అపజయాన్ని అల్లంత దూరాన పెడుతూ మెల్బోర్న్ టెస్టును భారత జట్టు మెరుగైన రీతిలో ఆరంభించింది. మన బౌలర్లు మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియా మళ్లీ 200 పరుగులు కూడా దాటలేకపోయింది. బుమ్రా పదునైన బౌలింగ్, అశ్విన్ అనుభవ ప్రదర్శనకు తోడు అరంగేట్రం టెస్టులో హైదరాబాదీ సిరాజ్ కూడా ఆకట్టుకోవడంతో ఆసీస్ జట్టులో ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. బదులుగా మరోసారి సున్నాకే తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా... గత మ్యాచ్‌లో ఘోర పరాభవాన్ని మిగిల్చిన స్కోరు (36) వద్దే మొదటి రోజు ఆట ముగించింది. అయితే మెల్లగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతున్న పిచ్ రెండో రోజు మన ఆటగాళ్ల ప్రదర్శనపై ఆశలు రేపుతోంది. మెల్బోర్న్: ఉదయం 11 మిల్లీ మీటర్ల పచ్చికపై, కాస్త తేమ కూడా ఉన్న పిచ్‌పై బ్యాటింగ్ ఎంచుకొని ఆస్ట్రేలియా చేసిన సాహసం ఆ జట్టుకు పనికి రాలేదు. భారత బౌలర్లు చెలరేగడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 72.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. మార్నస్ లబ్‌షేన్ (132 బంతుల్లో 48; 4 ఫోర్లు), ట్రావిస్ హెడ్ (38), మాథ్యూ వేడ్ (30) మాత్రమే కొద్దిగా పరుగులు చేయగలిగారు. బుమ్రాకు 4 వికెట్లు దక్కగా, అశ్విన్ 3 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోయి 36 పరుగులు చేసింది. మయాంక్ ‘డకౌట్’కాగా... శుబ్‌మన్ గిల్ (28 బ్యాటింగ్), పుజారా (7 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. కీలక భాగస్వామ్యం... భారత బౌలింగ్ పదునుకు తోడు కొన్ని చెత్త షాట్లు ఆసీస్ స్కోరును 200 లోపే పరిమితం చేశాయి. జట్టుకు సరైన ఓపెనింగ్ కూడా లభించలేదు. తన పేలవ ఫామ్‌ను కొనసాగించిన జో బర్న్స్ (0) బుమ్రా వేసిన చక్కటి బంతిని ఆడలేక కీపర్ పంత్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఆస్ట్రేలియా తొలి వికెట్ కోల్పోయింది. కొంత దూకుడు ప్రదర్శించిన వేడ్ తాను టెస్టు మ్యాచ్ ఆడుతున్న విషయాన్ని మరచిపోయినట్లుగా అశ్విన్ బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడి వెనుదిరిగాడు. ఆ వెంటనే టాప్ బ్యాట్స్‌మన్ స్మిత్ (0) కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో జట్టు కష్టాలు పెరిగాయి. ఈ దశలో లబ్‌షేన్, హెడ్ 86 పరుగుల భాగస్వామ్యం ఆసీస్‌ను ఆదుకుంది. బుమ్రా బౌలింగ్‌లో లబ్‌షేన్ (స్కోరు 6) అవుట్ కోసం ఎల్బీ అప్పీల్ చేసిన భారత్... రివ్యూకు వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 26 పరుగుల వద్ద అశ్విన్ బౌలింగ్‌లో అంపైర్ ఎల్బీగా ప్రకటించినా... ఈసారి తాను రివ్యూ కోరి లబ్‌షేన్ బయటపడ్డాడు. లంచ్ సమయానికి జట్టు 65 పరుగులు చేసింది. రెండో సెషన్లోనూ లబ్‌షేన్, హెడ్ సాధికారికంగా, చక్కటి సమన్వయంతో ఆడారు. తొలి గంటలో వీరిద్దరు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడంతో పరుగులు కూడా చకచకా వచ్చాయి. భాగస్వామ్యం మరింత పటిష్టంగా మారుతున్న దశలో మరో పదునైన బంతితో హెడ్‌ను అవుట్ చేసి బుమ్రా ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే లబ్‌షేన్‌ను అవుట్ చేసి టెస్టుల్లో తొలి వికెట్ సాధించిన సిరాజ్... కామెరాన్ గ్రీన్ (12)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. గత టెస్టు తరహాలో ఈసారి ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ జట్టును ఆదుకోలేకపోయాడు. అశ్విన్ బంతిని సమర్థంగా ఎదుర్కోలేక పైన్ (13) బ్యాక్వర్డ్ షార్ట్ లెగ్‌లో విహారికి క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగియడానికి ఎంతో సేపు పట్టలేదు. గిల్ అదృష్టం... సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే రోజు ఇదే మైదానంలో అరంగేట్రం చేసి అర్ధ సెంచరీతో ఆకట్టుకున్న మయాంక్ అగర్వాల్‌కు ఈసారి కలిసి రాలేదు. స్టార్క్ వేసిన తొలి ఓవర్లోనే మయాంక్ (0) వెనుదిరగడంతో స్కోరు బోర్డులో పరుగులు చేరకుండానే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. అయితే గిల్, పుజారా కలిసి జాగ్రత్తగా ఆడారు. తమ పదునైన బంతులతో ఆసీస్ పేసర్లు టీమిండియా ఓపెనర్లను కొంత ఇబ్బంది పెట్టారు. కమిన్స్ బౌలింగ్‌లో 5 పరుగుల వద్ద గిల్ ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మూడో స్లిప్‌లో లబ్‌షేన్ వదిలేశాడు. అయితే ఆ తర్వాత గిల్ కొన్ని చూడచక్కటి షాట్లు ఆడాడు. ముఖ్యంగా స్టార్క్ ఓవర్లో కొట్టిన రెండు ఫోర్లు అతని ఆత్మవిశ్వాసాన్ని చూపించాయి. అవుటా... నాటౌటా! ఆసీస్ కెప్టెన్ పైన్ రనౌట్ విషయంలో భారత్‌కు ప్రతికూల ఫలితం రావడం కొంత చర్చకు దారి తీసింది. అశ్విన్ బౌలింగ్‌లో గ్రీన్ షాట్ ఆడి సింగిల్‌కు ప్రయత్నించాడు. కొంత సందిగ్ధంతో పైన్ అవతలి ఎండ్‌కు పరుగు తీయగా... అదే సమయంలో కవర్స్ నుంచి ఉమేశ్ విసిరిన త్రోను అందుకున్న పంత్ స్టంప్స్‌ను పడగొట్టాడు. దాంతో మూడో అంపైర్‌ను సంప్రదించాల్సి వచ్చింది. రీప్లేలలో పైన్ బ్యాట్ లైన్పైనే ఉన్నట్లు కనిపించింది. అలా చూస్తే అతను అవుట్. అయితే థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం నాటౌట్‌గా ప్రకటించారు. మరో కోణంలో బ్యాట్ కాస్త లోపలికి వచ్చినట్లు కనిపించడం కూడా అందుకు కారణం కావచ్చు. అయితే దీనిపై కెప్టెన్ రహానే అంపైర్ ముందు అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. నువ్వా...నేనా! మాథ్యూ వేడ్ క్యాచ్‌ను అందుకునే విషయంలో భారత ఫీల్డర్లు గిల్, జడేజా మధ్య సాగిన పోటీ కొంత ఉత్కంఠను రేపింది. అశ్విన్ బౌలింగ్‌లో వేడ్ కొట్టిన షాట్‌కు బంతి గాల్లోకి లేవగా మిడ్ వికెట్ నుంచి గిల్, మిడాన్ నుంచి జడేజా పరుగెత్తుకుంటూ వచ్చారు. బంతిపై మాత్రమే దృష్టి పెట్టిన వీరిద్దరు ఒకరిని మరొకరు చూసుకోలేదు. బాగా దగ్గరకు వచ్చిన తర్వాత జడేజా ఆగమంటూ సైగ చేసినా గిల్ పట్టించుకోలేదు. చివరి క్షణంలో జడేజా కాస్త ఎత్తులోనే బంతిని అందుకొని పదిలం చేసుకోగా, గిల్ మాత్రం జారుతూ జడేజా సమీపంలోనే కింద పడ్డాడు. జడేజా ఏకాగ్రత, సరైన నియంత్రణ వల్ల ఇద్దరూ ఢీకొనలేదు గానీ లేదంటే ప్రమాదమే జరిగేది! డీన్ జోన్స్‌కు నివాళి మూడు నెలల క్రితం కన్నుమూసిన ఆస్ట్రేలియా మాజీ బ్యాట్స్‌మన్ డీన్ జోన్స్‌కు అతని సొంత మైదానం ఎంసీజీలో రెండో టెస్టు సందర్భంగా ఇరు జట్ల ఆటగాళ్లు నివాళులు అర్పించారు. మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ తోడు రాగా... జోన్స్ భార్య, ఇద్దరు కూతుళ్లు మైదానంలోకి వచ్చి అతను ఉపయోగించిన బ్యాట్, బ్యాగీ గ్రీన్, సన్‌గ్లాసెస్‌ను వారు స్టంప్స్‌పై ఉంచారు. అనంతరం వాటిని బౌండరీ బయట సీట్‌పై పెట్టారు. జోన్స్‌ను గుర్తు చేసే విధంగా కొందరు ఆసీస్ క్రికెటర్లు తమ పెదవులపై అతనిలాగే జింక్ బామ్ పూసుకొని వచ్చారు. మరోవైపు ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించాల్సిన రాడ్ టకర్...తన తల్లి మరణించడంతో చివరి నిమిషంలో తప్పుకున్నారు. ఆయన స్థానంలో ఆక్సెన్‌ఫర్డ్ అంపైర్‌గా వచ్చారు. టకర్ తల్లికి నివాళిగా అంపైర్లు నలుపు రంగు బ్యాండ్లు ధరించారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (సి) పంత్ (బి) బుమ్రా 0; వేడ్ (సి) జడేజా (బి) అశ్విన్ 30; లబ్‌షేన్ (సి) గిల్ (బి) సిరాజ్ 48; స్మిత్ (సి) పుజారా (బి) అశ్విన్ 0; హెడ్ (సి) రహానే (బి) బుమ్రా 38; గ్రీన్ (ఎల్బీ) (బి) సిరాజ్ 12; పైన్ (సి) విహారి (బి) అశ్విన్ 13; కమిన్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 9; స్టార్క్ (సి) సిరాజ్ (బి) బుమ్రా 7; లయన్ (ఎల్బీ) (బి) బుమ్రా 20; హాజల్‌వుడ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (72.3 ఓవర్లలో ఆలౌట్) 195 వికెట్ల పతనం: 1–10, 2–35, 3–38, 4–124, 5–134, 6–155, 7–155, 8–164, 9–191, 10–195. బౌలింగ్: బుమ్రా 16–4–56–4, ఉమేశ్ యాదవ్ 12–2–39–0, అశ్విన్ 24–7–35–3, జడేజా 5.3–1–15–1, సిరాజ్ 15–4–40–2. భారత్ తొలి ఇన్నింగ్స్: మయాంక్ అగర్వాల్ (ఎల్బీ) (బి) స్టార్క్ 0; శుబ్‌మన్ గిల్ (బ్యాటింగ్) 28; పుజారా (బ్యాటింగ్) 7; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (11 ఓవర్లలో వికెట్ నష్టానికి) 36 వికెట్ల పతనం: 1–0. బౌలింగ్: స్టార్క్ 4–2–14–1, కమిన్స్ 4–1–14–0, హాజల్‌వుడ్ 2–0–2–0, లయన్ 1–0–6–0. -
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
-
భారత్ స్కోరు 443/7.. ఇన్నింగ్స్ డిక్లేర్
మెల్బోర్న్ : బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్‌ను భారత్ డిక్లేర్ చేసింది. గురువారం రెండో రోజు ఆటలో భాగంగా ఏడు వికెట్ల నష్టానికి 443 పరుగులు చేసిన అనంతరం భారత్ తన తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అటు తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులు చేసింది. మార్కస్ హారిస్ (5 బ్యాటింగ్), ఆరోన్ ఫించ్ (3 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు 215/2 ఓవర్‌నైట్ స్కోరుతో రెండోరోజు ఆట ప్రారంభించిన భారత్ ధాటిగా ఆడింది. ఓవర్‌నైట్ ఆటగాళ్లు కోహ్లి, పుజారాలు బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడంతో భారత స్కోరు బోర్డు పరుగులు తీసింది. కాగా, ఈ జోడి 170 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత కోహ్లి (82; 204 బంతుల్లో 9 ఫోర్లు) మూడో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆపై మరో ఆరు పరుగుల వ్యవధిలో శతకం సాధించిన పుజారా(106; 319 బంతుల్లో 10 ఫోర్లు) నాల్గో వికెట్‌గా ఔటయ్యాడు. ఇది పుజారాకు టెస్టుల్లో 17వ సెంచరీ కాగా, ఆసీస్‌పై నాల్గోది. ఆ తరుణంలో అజింక్యా రహానే(34), రోహిత్ శర్మ(63 నాటౌట్)ల జోడి నిలకడగా ఆడింది. దాంతో భారత్ స్కోరు మూడొందల మార్కును అవలీలగా చేరింది. ఇక రోహిత్ శర్మ-రిషబ్ పంత్(39)లు జంట కూడా మరో కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేయడంతో భారత్ నాల్గొందల మార్కును దాటింది. స్కోరును పెంచే క్రమ్లో రిషభ్ పంత్ ఔటైన స్వల్ప వ్యవధిలో రవీంద్ర జడేజా సైతం ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. తొలి రోజు ఆటలో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (76) హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఆసీస్ బౌలర్లలో కమిన్స్ మూడు వికెట్లు సాధించగా, మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు లభించాయి. హజల్‌వుడ్, లయన్‌లకు తలో వికెట్ దక్కింది. -
భారత్-ఆస్ట్రేలియా మూడో టెస్టు డ్రా
-
మూడో టెస్ట్ డ్రా: సిరీస్ ఆసీస్ వశం
-
మూడో టెస్ట్ డ్రా: సిరీస్ ఆసీస్ వశం
మెల్ బోర్న్: ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోనీ ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుని అభిమానుల్లో కలవరం పెంచినా చివరి వరకూ పోరాడి డ్రా ముగించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో కైవశం చేసుకుంది. మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(54) మరోసారి ఆదుకున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే(48) రాణించడంతో జట్టు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడింది. విరాట్-రహానేల జోడి 85 పరుగుల జోడి నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. కర్ణాటక ఆటగాడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా పంపి టీమిండియా ప్రయోగం చేసింది. అయితే ఆ ప్రయోగం సత్ఫలితాన్నివ్వకపోవడంతో కాస్త నెమ్మదిగా ఆడింది. మ్యాచ్ గంటలోపు ముగుస్తుందనగా టీమిండియా పరుగు వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోవడంతో మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. అయితే చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (24), అశ్విన్ (8) జట్టుకు మరమ్మత్తులు చేపట్టి మ్యాచ్ డ్రాలో పాలుపంచుకున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్, హజ్లివుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 530, సెకెండ్ ఇన్నింగ్స్ 318/9 డిక్లేర్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 465, సెకెండ్ ఇన్నింగ్స్ 174/6 -
పరుగు తేడాలో రెండు వికెట్లు..ధోనీ సేనలో కలవరం
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. అజ్యింకా రహానే(48) పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. 117 బంతులు ఎదుర్కొన్న రహానే హాఫ్ సెంచరీ దగ్గర్లో అవుట్ కావడమే కాకుండా.. మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశాన్ని క్లిష్టం చేశాడు. అంతకుముందు చటేశ్వరా పూజారా(21) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక పరుగు దూరంలో వీరిద్దరూ అవుట్ కావడంతో ధోనీ సేనలో కలవరం మొదలైంది. చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ(54)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్ , హజిల్ వుడ్ లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
ఐదో వికెట్ కోల్పోయిన టీమిండియా(141/5)
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 141 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. చటేశ్వర పూజారా (21) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. మరోప్రక్క అజ్యింకా రహానే(47) పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 104 పరుగులకే ధోనీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ(54)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్ లకు తలో రెండు వికెట్లు లభించాయి. -
ఎదురీదుతున్న టీమిండియా!
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఎదురీదుతోంది. 104 పరుగులకే ధోనీ సేన నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాలో పడింది. చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ(54)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ప్రస్తుతం అజ్యింకా రహానే(34), చటేశ్వర పూజారా(4) క్రీజ్ లో ఉన్నారు. -
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా:కోహ్లీ అవుట్
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 104 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్సోయింది. టీ విరామ సమయం అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా విరాట్ కోహ్లీ(54) వికెట్ ను చేజార్చుకుంది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో కోహ్లీ, రహానేలు బాధ్యతాయుతంగా ఆడారు. వారిద్దరు కలిసి నాల్గో వికెట్ కు 85 పరుగులు జోడించారు. ప్రస్తుతం రహానే(34) పరుగులతో ఆడుతున్నాడు. చివరిరోజు ఆటలో భాగంగా 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. -
రెండో ఇన్నింగ్స్: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ చేశాడు. చివరిరోజు ఆటలో భాగంగా 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానే లు తీసుకున్నారు. ప్రస్తుతం వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (54) , రహానే (33) పరుగులతో ఆడుతున్నాడు. టీ విరామ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం. అంతకుముందు శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే. -
కుదురుగా ఆడుతున్న టీమిండియా
మెల్ బోర్న్:ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో మూడు వికెట్లు కోల్పోయిన అనంతరం టీమిండియా కుదురుగా బ్యాటింగ్ కొనసాగిస్తోంది. ఆదిలోనే కీలక వికెట్లను కోల్పోయిన టీమిండియా కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వైఎస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానేలు మరోసారి టీమిండియా స్కోరు బోర్డును చక్కదిద్దే పనిలో పడ్డారు. కోహ్లీ(40), రహానే(22) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. అంతకుముందు టీమిండియా వరుస వికెట్లను కోల్పోయింది. శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే.384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియాకు ఇంకా 304 పరుగులు అవసరం. ప్రస్తుతం టీమిండియా 80 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
-
మూడో వికెట్ కోల్పోయిన టీమిండియా
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 19 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. 384 పరుగుల విజయలక్ష్యంతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్ మురళీ విజయ్ (11)పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు కేఎల్ రాహుల్ (1), శిఖర్ ధావన్ (0) కే పెవిలియన్ చేరి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, హజ్లివుడ్ , హారిస్ లు తలో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే. -
భారత రెండో ఇన్నింగ్స్: 5 పరుగులకే రెండు వికెట్లు
సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌ను భారత్ పేలవంగా ప్రారంభించింది. ఈ సిరీస్‌లో వరుసగా విఫలం అవుతూ వస్తున్న శిఖర్ ధావన్ డకౌట్ అయ్యాడు. హ్యారిస్ వేసిన బంతిని సరిగా అర్థంచేసుకోలేని శిఖర్ ధావన్.. ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఆ వెనువెంటనే ఒక్క పరుగు మాత్రమే చేసిన తొలిడౌన్ బ్యాట్స్‌మన్ రాహుల్ కూడా ఔటయ్యాడు. జాన్సన్ వేసిన బంతి ఆఫ్ స్టంప్ వెలుపలకు వెళ్తుండగా దాన్ని వేటాడి మరీ వాట్సన్‌కు క్యాచ్ ఇచ్చేశాడు. దాంతో 70 ఓవర్లలో 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మురళీ విజయ్‌కి తొలి ఇన్నింగ్స్ హీరో విరాట్ కోహ్లీ అండగా వచ్చాడు. -
ఆసీస్ 318/9 డిక్లేర్: భారత్ విజయలక్ష్యం 384
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న మూడో టెస్టు ఆఖరు రోజున ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలి ఇన్నింగ్స్‌లో దీటుగా ఆడిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను భారత బౌలర్లు పేకమేడలా కూల్చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ ఇద్దరు సెంచరీలు బాదగా, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ మార్ష్‌ను కోహ్లీ 99 పరుగుల వద్ద రనౌట్ చేశాడు. దానికితోడు రోజర్స్ చేసిన 69 పరుగులు తప్ప ఆసీస్ వీరులు ఎవరూ పెద్దగా మెరవలేదు. భారత బౌలర్లు సమష్టిగా రాణించి తలో రెండు వికెట్లు పంచుకున్నారు. ఉమేష్ యాదవ్, షమీ, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ నలుగురికీ రెండేసి వికెట్లు దక్కాయి.