రెండో ఇన్నింగ్స్: విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ మరో హాఫ్ సెంచరీ చేశాడు. చివరిరోజు ఆటలో భాగంగా 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే బాధ్యతను విరాట్ కోహ్లీ, అజ్యింకా రహానే లు తీసుకున్నారు.
ప్రస్తుతం వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ (54) , రహానే (33) పరుగులతో ఆడుతున్నాడు. టీ విరామ సమయానికి టీమిండియా మూడు వికెట్ల నష్టానికి 104 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ఇంకా టీమిండియా విజయానికి 280 పరుగులు అవసరం. అంతకుముందు శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి అవుటయిన సంగతి తెలిసిందే.