మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా 104 పరుగుల వద్ద నాల్గో వికెట్ ను కోల్సోయింది. టీ విరామ సమయం అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా విరాట్ కోహ్లీ(54) వికెట్ ను చేజార్చుకుంది. 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో కోహ్లీ, రహానేలు బాధ్యతాయుతంగా ఆడారు.
వారిద్దరు కలిసి నాల్గో వికెట్ కు 85 పరుగులు జోడించారు. ప్రస్తుతం రహానే(34) పరుగులతో ఆడుతున్నాడు. చివరిరోజు ఆటలో భాగంగా 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.