పరుగు తేడాలో రెండు వికెట్లు..ధోనీ సేనలో కలవరం
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా 142 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. అజ్యింకా రహానే(48) పరుగులు చేసి ఆరో వికెట్ గా వెనుదిరిగాడు. 117 బంతులు ఎదుర్కొన్న రహానే హాఫ్ సెంచరీ దగ్గర్లో అవుట్ కావడమే కాకుండా.. మ్యాచ్ ను డ్రా చేసుకునే అవకాశాన్ని క్లిష్టం చేశాడు.
అంతకుముందు చటేశ్వరా పూజారా(21) పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఒక పరుగు దూరంలో వీరిద్దరూ అవుట్ కావడంతో ధోనీ సేనలో కలవరం మొదలైంది. చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. అనంతరం విరాట్ కోహ్లీ(54)పరుగులతో మరోసారి ఆకట్టుకున్నప్పటికీ నాల్గో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్ , హజిల్ వుడ్ లకు తలో రెండు వికెట్లు లభించాయి.