మూడో టెస్ట్ డ్రా: సిరీస్ ఆసీస్ వశం | australia-won-test-series-after-third-test-draw-against-team-india | Sakshi

Published Tue, Dec 30 2014 1:44 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM

ఆస్ట్రేలియా-టీమిండియాల మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు 384 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ధోనీ ఆదిలో కీలక వికెట్లను చేజార్చుకుని అభిమానుల్లో కలవరం పెంచినా చివరి వరకూ పోరాడి డ్రా ముగించింది. దీంతో నాలుగు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ను ఆసీస్ 2-0 తేడాతో కైవశం చేసుకుంది. మంగళవారం ఐదో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ధోనీ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ(54) మరోసారి ఆదుకున్నాడు. అతనికి జతగా అజ్యింకా రహానే(48) రాణించడంతో జట్టు క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడింది. విరాట్-రహానేల జోడి 85 పరుగుల జోడి నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ శిఖర్ ధావన్ డకౌట్ గా పెవిలియన్ కు చేరగా, కేఎల్ రాహుల్(1), మురళీ విజయ్(11) పరుగులు చేసి పెవిలియన్ కు చేరారు. కర్ణాటక ఆటగాడు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా పంపి టీమిండియా ప్రయోగం చేసింది. అయితే ఆ ప్రయోగం సత్ఫలితాన్నివ్వకపోవడంతో కాస్త నెమ్మదిగా ఆడింది. మ్యాచ్ గంటలోపు ముగుస్తుందనగా టీమిండియా పరుగు వ్యవధిలో రెండు వికెట్లను కోల్పోవడంతో మళ్ళీ పరిస్థితి మొదటికొచ్చింది. అయితే చివర్లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (24), అశ్విన్ (8) జట్టుకు మరమ్మత్తులు చేపట్టి మ్యాచ్ డ్రాలో పాలుపంచుకున్నారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, ర్యాన్ హారిస్, హజ్లివుడ్ లకు తలో రెండు వికెట్లు దక్కాయి. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 530, సెకెండ్ ఇన్నింగ్స్ 318/9 డిక్లేర్ టీమిండియా తొలి ఇన్నింగ్స్ 465, సెకెండ్ ఇన్నింగ్స్ 174/6

Advertisement
 
Advertisement

పోల్

Advertisement