అజింక్య రహానే, విరాట్ కోహ్లి సెంచరీలు సాధించడంతో మూడో టెస్టులో ఆస్ట్రేలియాకు భారత్ దీటుగా జవాబిచ్చింది. తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 462 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా కంటే 68 పరుగులు వెనుకబడింది. 108/1 ఓవర్ నైట్ స్కోరుతో మూడో ఆట ప్రారంభించిన టీమిండియా వెంటవెంటనే మురళీ విజయ్(68), పూజారా(25) వికెట్లు కోల్పోయింది. తర్వాత కోహ్లి, రహానే ఆచితూచి ఆడి జట్టు స్కోరు పెంచారు. ఈ క్రమంలో ఇద్దరూ సెంచరీలు సాధించారు. రహానే 147, కోహ్లి 169 పరుగులు చేసి అవుటయ్యారు. ధోని(11), రాహుల్(3) నిరాశ పరిచారు. ఆట ముగిసే సమయానికి మహ్మద్ షమీ 9 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో హరీస్ 4 వికెట్లు నేలకూల్చాడు. లియాన్ 2 వికెట్లు తీశాడు. జాన్సన్, వాట్సన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
Published Sun, Dec 28 2014 5:05 PM | Last Updated on Thu, Mar 21 2024 8:52 PM