ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 19 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది.
మెల్ బోర్న్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా 19 పరుగుల వద్ద మూడో వికెట్ ను కోల్పోయింది. 384 పరుగుల విజయలక్ష్యంతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో కూరుకుపోయింది. ఓపెనర్ మురళీ విజయ్ (11)పరుగులు చేసి మూడో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.
అంతకుముందు కేఎల్ రాహుల్ (1), శిఖర్ ధావన్ (0) కే పెవిలియన్ చేరి టీమిండియా ఆశలపై నీళ్లు చల్లారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ జాన్సన్, హజ్లివుడ్ , హారిస్ లు తలో వికెట్ తీశారు. ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసిన సంగతి తెలిసిందే.