సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ను భారత్ పేలవంగా ప్రారంభించింది.
సిరీస్ కోల్పోకుండా ఉండాలంటే గెలిచి తీరాల్సిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ను భారత్ పేలవంగా ప్రారంభించింది. ఈ సిరీస్లో వరుసగా విఫలం అవుతూ వస్తున్న శిఖర్ ధావన్ డకౌట్ అయ్యాడు. హ్యారిస్ వేసిన బంతిని సరిగా అర్థంచేసుకోలేని శిఖర్ ధావన్.. ఫ్రంట్ ఫుట్ వచ్చి ఆడేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు.
ఆ వెనువెంటనే ఒక్క పరుగు మాత్రమే చేసిన తొలిడౌన్ బ్యాట్స్మన్ రాహుల్ కూడా ఔటయ్యాడు. జాన్సన్ వేసిన బంతి ఆఫ్ స్టంప్ వెలుపలకు వెళ్తుండగా దాన్ని వేటాడి మరీ వాట్సన్కు క్యాచ్ ఇచ్చేశాడు. దాంతో 70 ఓవర్లలో 384 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. ఐదు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మురళీ విజయ్కి తొలి ఇన్నింగ్స్ హీరో విరాట్ కోహ్లీ అండగా వచ్చాడు.