
ఆసీస్ 318/9 డిక్లేర్: భారత్ విజయలక్ష్యం 384
మూడో టెస్టు ఆఖరు రోజున ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
గవాస్కర్ - బోర్డర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో జరుగుతున్న మూడో టెస్టు ఆఖరు రోజున ఆస్ట్రేలియా జట్టు 9 వికెట్ల నష్టానికి 318 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొంటే భారత జట్టుకు 384 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది.
తొలి ఇన్నింగ్స్లో దీటుగా ఆడిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ను భారత బౌలర్లు పేకమేడలా కూల్చేశారు. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ ఇద్దరు సెంచరీలు బాదగా, రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మన్ మార్ష్ను కోహ్లీ 99 పరుగుల వద్ద రనౌట్ చేశాడు. దానికితోడు రోజర్స్ చేసిన 69 పరుగులు తప్ప ఆసీస్ వీరులు ఎవరూ పెద్దగా మెరవలేదు. భారత బౌలర్లు సమష్టిగా రాణించి తలో రెండు వికెట్లు పంచుకున్నారు. ఉమేష్ యాదవ్, షమీ, ఇషాంత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ నలుగురికీ రెండేసి వికెట్లు దక్కాయి.