పుజారాను ట్రోల్‌ చేసిన ధావన్‌ | Ranji Trophy: Cheteshwar Pujara Gets Trolled By Dhawan | Sakshi
Sakshi News home page

పుజారాను ట్రోల్‌ చేసిన ధావన్‌

Published Sat, Dec 28 2019 11:04 AM | Last Updated on Sat, Dec 28 2019 11:04 AM

Ranji Trophy: Cheteshwar Pujara Gets Trolled By Dhawan - Sakshi

రాజ్‌కోట్‌: టీమిండియా టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర పుజారాను శిఖర్‌ ధావన్‌ ట్రోల్‌ చేశాడు. ఇప్పటివరకు టెస్టు బ్యాట్స్‌మన్‌గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్న చటేశ్వర పుజారా.. తాజాగా తనలో దాగున్న మరో కోణాన్ని మైదానంలో మరోసారి ప్రదర్శించాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సౌరాష్ట్ర సారథి పుజారా బంతితో మెరిశాడు. యూపీ బ్యాట్స్‌మన్‌ మోహిత్‌ జంగ్రాను పుజారా తన లెగ్‌ స్పిన్‌తో అవుట్‌ చేయడం రెండో రోజు ఆటకే హైలెట్‌గా నిలిచింది. దీనికి సంబంధించిన ఫోటోను పుజారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. అంతేకాకుండా తాను బ్యాట్స్‌మన్‌ నుంచి ఆల్‌రౌండర్‌గా ఎదిగానని సరదాగా కామెంట్‌ చేశాడు. 

అయితే పుజారా వికెట్‌ తీయడం పట్ల సహచర క్రికెటర్లు, అభిమానులు ఆనందంవ్యక్తం చూస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. దీనిలో భాగంగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ పుజారాను ఆటపట్టించాడు. ‘అద్భుతంగా బౌలింగ్‌ చేశావు. నీ పరుగుల వేగానికి స్ర్పింటర్‌ కూడా తట్టుకోలేక చచ్చిపోతాడు’అంటూ ట్రోల్‌ చేశాడు. ‘అసాధారణం, ఇక మరింతగా బౌలింగ్‌ చేసే సమయం వచ్చింది’అంటూ రవిచంద్రన్‌ అశ్విన్‌ పేర్కొన్నాడు. ప్రస్తుతం పుజారాను ఉద్దేశిస్తూ ధావన్‌ చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. అంతేకాకుండా ధావన్‌ హాస్యచతురతపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఇక పుజారా ఇప్పటివరకు ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement