Asian Games 2023: చైనాలో ఈ ఏడాది జరుగనున్న ఆసియా క్రీడలకు భారత క్రికెట్ జట్లను పంపేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అక్టోబరు 5 నుంచి వన్డే ప్రపంచకప్-2023 మొదలుకానున్న నేపథ్యంలో మెన్స్ క్రికెట్‌కు సంబంధించి ద్వితీయ శ్రేణి జట్టును పంపే యోచనలో ఉన్నట్లు సమాచారం.
ఇక ఈ జట్టుకు వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా.. దిగ్గజ బ్యాటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వెటరన్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
అత్యుత్తమ క్రికెటర్
పీటీఐతో మాట్లాడిన సందర్భంగా... టీమిండియా- బీ జట్టుకు రవిచంద్రన్ అశ్విన్ కెప్టెన్ అయితే బాగుంటుందని డీకే వ్యాఖ్యానించాడు. ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సారథ్యం వహించే అర్హత అశూకు ఉందని పేర్కొన్నాడు. ఈ మేరకు.. ‘‘అత్యుత్తమ, గొప్ప క్రికెటర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్‌కు కచ్చితంగా స్థానం ఉంటుంది.
అశ్విన్- దినేశ్ కార్తిక్
ఆ హక్కు తనకు ఉంది.. అర్హుడు కూడా
కనీసం ఒక్కసారైనా టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం అతడికి రావాలి. అందుకు అతడు వందకు వందశాతం అర్హుడే. ఆ హక్కు తనకి ఉంది’’అని డీకే పేర్కొన్నాడు. ఇక ఆసియా కప్-2023లో టీమిండియా వికెట్ కీపర్ రేసులో కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్ మధ్య ప్రధాన పోటీ ఉంటుందని 36 ఏళ్ల దినేశ్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు.
ఇక.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్-2023లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి అనంతరం టీమిండియా వెస్టిండీస్ పర్యటనతో బిజీకానుంది. జూలై 12 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే పలువురు భారత ఆటగాళ్లు కరేబియన్ గడ్డపై అడుగుపెట్టారు.
కాగా విండీస్‌తో టెస్టు జట్టులో వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ అశ్విన్‌కు స్థానం దక్కిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. సెప్టెంబరు 23- అక్టోబర్ 8 వరకు ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
వెస్టిండీస్‌తో రెండు టెస్టులకు బీసీసీఐ ప్రకటించిన జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే (వైస్ కెప్టెన్), కేఎస్ భరత్ (వికెట్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్ , మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, జయదేవ్ ఉనాద్కట్, నవదీప్ సైనీ.
చదవండి: WC 2023: గొప్ప బ్యాటర్‌వే! కానీ నీకసలు బుర్ర లేదు..
WC 2023: వెస్టిండీస్‌కు ఊహించని షాకిచ్చిన స్కాట్లాండ్! మరీ ఘోరంగా..
Comments
Please login to add a commentAdd a comment