
ఢిల్లీ : కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో ఆటగాళ్లంతా ఇళ్లకు పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సమయాన్ని తమకు తోచిన విధంగా గడిపేస్తున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి చటేశ్వర్ పుజారను ఉద్దేశించి ట్విటర్‌లో ట్రోల్ చేస్తూ పెట్టిన కామెంట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.2018-19 ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టు సిరీస్‌కు సంబంధించిన ఫోటోను కోహ్లి తన ట్విటర్‌లో షేర్ చేశాడు. ' చటేశ్వర్ పుజార.. లాక్‌డౌన్ తర్వాత మొదటి సెషన్ ఇలాగే ఉంటుంది. బంతి కోసం నువ్వు పరిగెత్తాల్సి ఉంటుందని నేను అనుకుంటున్నా' అంటూ క్యాప్షన్ పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత పేస్ బౌలర్ షమీ దీనికి స్పందిస్తూ.. 'నో చాన్స్.. హాహాహ' అంటూ కోహ్లి, పుజారలనుద్దేశించి నవ్వుతూ పేర్కొన్నాడు. కరోనా మహమ్మారితో ఐపీఎల్‌తో పాటు ఇతర క్రీడలన్నీ వాయిదా పడిన సంగతి తెలిసిందే. అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌పై కూడా సందేహాలు నెలకొన్నాయి.
'అందుకే రైనాను పక్కన పెట్టాం'
ధోని, కోహ్లిలపై యోగ్‌రాజ్ సంచలన వ్యాఖ్యలు
First session after lockdown be like 👀 @cheteshwar1 I hope you will go for the ball pujji 😜😜 pic.twitter.com/5DAGgpzbbw
— Virat Kohli (@imVkohli) May 5, 2020