కొందరు భవిష్యత్తును ముందే ఊహిస్తుంటారు.అయితే అదంతా వారి ఊహ మాత్రమేనని.. నిజంగా అలా జరిగే అవకాశం లేదంటూ చాలా మంది వాటిని కొట్టిపారేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మాత్రం అలాంటివి నమ్మాల్సి వస్తుంది. తాజాగా విరాట్ కోహ్లి విషయంలో ఇలాంటిదే ఒకటి జరిగింది. కోహ్లి ఔటయ్యే విషయాన్ని ఒక అభిమాని దాదాపు 12 గంటల ముందే ఊహించాడు. ఇక్కడ ఆసక్తికర విషయమేంటంటే.. ఆ అభిమాని చెప్పిన రీతిలోనే కోహ్లి ఔటవ్వడం విశేషం. దానికి సంబంధించిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
క్విక్ సింగిల్ పేరుతో ఒక ట్విటర్ యూజర్ కోహ్లి అవుటయ్యే విషయాన్ని ఇలా రాసుకొచ్చాడు.'' కోహ్లి తన వందో టెస్టులో సెంచరీ కొట్టడు. 100 బంతుల్లో 45 పరుగులు చేసి ఎంబుల్డేనియా బౌలింగ్‌లో బౌల్డ్ అవుతాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో నాలుగు అద్భుతమైన కవర్‌డ్రైవ్‌లు ఉంటాయి. తాను ఔటైన రీతిపై కోహ్లి షాక్‌కు గురవుతాడు. ఆ తర్వాత తన తలను అడ్డంగా ఊపుకుంటూ నిరాశతో పెవిలియన్‌కు వెళ్తాడు'' అంటూ రాసుకొచ్చారు.
Kohli Won't score a 100 in his 100th test. Will score 45 (100) with 4 gorgeous cover drives and then Embuldeniya will knock his stumps over and he'll pretend to be shocked 😳😳 and will nod his head in disappointment
— shruti #100 (@Quick__Single) March 3, 2022
అయితే సదరు యూజర్ చేసిన ట్వీట్‌పై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోహ్లి అన్నే పరుగులు చేసి ఔట్ అయ్యాడని అంత కచ్చితంగా ఎలా చెప్పగలిగాడు.. అసలు ఆ ట్వీట్‌ను మార్ఫింగ్ చేసే అవకాశముందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇందులో వాస్తవమెంత అనేది తేలాల్సి ఉంది. ఒకవేల పాపులారిటీ కోసం కూడా ఇలాంటి ట్వీట్లు క్రియేట్ చేసే అవకాశాలున్నాయంటూ పేర్కొన్నారు.
కాగా ఆ అభిమాని చెప్పినట్లుగా దాదాపు అదే రీతిలో కోహ్లి ఔటవ్వడం విశేషం. సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి సెంచరీ చేయలేదు. ట్విటర్ యూజర్ చెప్పినట్లుగానే 45 పరుగులు చేసి లసిత్ ఎంబుల్డేనియా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి 45 పరుగులు చేయడానికి అతను చెప్పినట్లు 100 బంతులు తీసుకోలేదు. 75 బంతుల్లోనే ఈ పరుగులు సాధించాడు. ఇక ఐదు బౌండరీలు కొట్టిన కోహ్లికి ఒక్క కవర్ డ్రైవ్ బౌండరీ లేదు. ఇక చివర్లో కోహ్లి తన ఔట్‌పై షాకవడం.. ఆ తర్వాత తలను అడ్డంగా ఊపుతూ పెవిలియన్ చేరడం.. ఇలా అంతా ఆ ట్విటర్ యూజర్ చెప్పినట్లుగానే జరిగింది.
అంతే సదరు ట్విటర్ యూజర్ ఎవరనే వెతుకులాటలో పడ్డారు సోషల్ మీడియా అభిమానులు. కోహ్లి అవుట్ విషయంలో దాదాపు కరెక్ట్ కావడంతో అభిమానులు ఇంక ఊరుకుంటారా.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులపై భవిష్యత్తు ఏంటని అడగడం మొదలుపెట్టేశారు. ఒకరేమో యూసీఎల్‌ను బార్కా గెలుచుకుంటుందా అని.. మరొకరేమో.. ఏ స్టాక్స్ కొంటే లాభాల్లోకి వస్తామో చెప్పమంటూ ట్వీట్స్ చేయడం విశేషం. ఇంతకముందు కూడాఫిఫా వరల్డ్‌కప్ విషయంలో ఎవరు కప్ గెలుస్తారు అనే దానిపై ఒక ఆక్టోపస్‌ను ఉపయోగించడం.. అది సెలబ్రిటీగా మారిపోయిన సంగతి తెలిసిందే.
ఇక శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు కోహ్లికి వందోది అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వందో టెస్టులో కోహ్లి సెంచరీ చేస్తాడని ఫ్యాన్స్ భావించారు. అయితే వారిని నిరాశ పరుస్తూ 45 పరుగుల వద్ద ఔటయ్యాడు. 80 పరుగుల వద్ద ఓపెనర్లు ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన కోహ్లి.. హనుమ విహారితో కలిసి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఇక తన బ్యాటింగ్‌తో కదురుకున్నాడు అనుకున్న దశలో ఎంబుల్డేనియా బౌలింగ్‌లో బౌల్డ్ అయి నిరాశ పరిచాడు.
చదవండి: Virat Kohli Vs Suranga Lakmal: ఎంతైనా వందో టెస్టు కదా.. ఆ మాత్రం ఉండాలి
Virat Kohli: 'అరె కోహ్లి ఎంత పని జరిగింది'.. రోహిత్ రియాక్షన్ వైరల్
Comments
Please login to add a commentAdd a comment