
గంభీర్, పుజారా సెంచరీలు
హుబ్లీ: పేలవ ఫామ్‌తో పరుగులు సాధించేందుకు అష్టకష్టాలు పడుతున్న ఓపెనర్ గౌతం గంభీర్ (236 బంతుల్లో 123; 11 ఫోర్లు) దాదాపు రెండేళ్ల అనంతరం చక్కటి సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ చతేశ్వర్ పుజారా (228 బంతుల్లో 139 బ్యాటింగ్; 15 ఫోర్లు)సైతం అజేయ శతకంతో రాణించడంతో భారత్ ‘ఎ’ జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. వెస్టిండీస్ ‘ఎ’తో జరుగుతున్న మూడో అనధికార టెస్టులో భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి తమ తొలి ఇన్నింగ్స్‌లో 95 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 334 పరుగులు చేసింది.
ప్రస్తుతం 66 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెహ్వాగ్ (49 బంతుల్లో 38; 2 ఫోర్లు; 1 సిక్స్) ఓ మోస్తరుగా ఆడాడు. క్రీజులో పుజారాతో పాటు నాయర్ (18 బంతుల్లో 10 బ్యాటింగ్) ఉన్నాడు. అంతకుముందు 10 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన భారత్ ఇన్నింగ్స్‌లో గంభీర్, పుజారా విండీస్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ జోడి రెండో వికెట్‌కు 207 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది.