IND VS BAN 1st Test: డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. తొలుత ప్రకటించిన భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో చతేశ్వర్ పుజారాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న పంత్‌కు ఇది భారీ షాక్ అనే చెప్పాలి.
టీమిండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పంత్‌కు టెస్ట్ జట్టులో కూడా స్థానం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. తొలి టెస్ట్‌లో పంత్ స్థానంలో వికెట్‌కీపర్‌గా శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదనపు బౌలర్‌ను తీసుకోవాలని మేనేజ్‌మెంట్ భావిస్తే శ్రీకర్ భరత్‌ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉండదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు కూడా మోసే అవకాశం ఉంది.
కాగా, న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన పంత్‌ను టీమిండియా యాజమాన్యం గాయాం సాకుగా చూపి అఖరి నిమిషంలో వన్డే జట్టు (బంగ్లాతో సిరీస్) నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా పంత్‌ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఇషాన్ కిషన్‌లా రెచ్చిపోతే, టెస్ట్‌ల్లో కూడా పంత్ స్థానం గల్లంతైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే, గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు షమీ, జడేజాలు కూడా గాయాల బారిన పడటంతో బంగ్లా టూర్‌కు తొలుత ఎంపిక చేసిన జట్టులో భారీ మార్పులు జరిగాయి. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరగా.. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కొత్తగా వచ్చాడు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ
Comments
Please login to add a commentAdd a comment