Vice-captain ship
-
బంగ్లాతో తొలి టెస్ట్.. పంత్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ, అతడి స్థానంలో..!
IND VS BAN 1st Test: డిసెంబర్ 14 నుంచి బంగ్లాదేశ్‌తో జరుగబోయే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా యువ వికెట్‌కీపర్ రిషబ్ పంత్‌కు బీసీసీఐ భారీ షాకిచ్చింది. తొలుత ప్రకటించిన భారత టెస్ట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్న పంత్‌ను తప్పించిన బీసీసీఐ.. అతడి స్థానంలో చతేశ్వర్ పుజారాకు ఆ బాధ్యతలు అప్పజెప్పింది. గత కొంతకాలంగా పేలవ ఫామ్‌తో సతమతమవుతూ ముప్పేట దాడిని ఎదుర్కొంటున్న పంత్‌కు ఇది భారీ షాక్ అనే చెప్పాలి. టీమిండియా మేనేజ్మెంట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పంత్‌కు టెస్ట్ జట్టులో కూడా స్థానం లేదన్న సంకేతాలు అందుతున్నాయి. తొలి టెస్ట్‌లో పంత్ స్థానంలో వికెట్‌కీపర్‌గా శ్రీకర్ భరత్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ అదనపు బౌలర్‌ను తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే శ్రీకర్ భరత్‌ను కూడా తుది జట్టులో ఆడించే అవకాశం ఉండదు. కెప్టెన్ కేఎల్ రాహుల్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు కూడా మోసే అవకాశం ఉంది. కాగా, న్యూజిలాండ్ పర్యటనలో దారుణంగా విఫలమైన పంత్‌ను టీమిండియా యాజమాన్యం గాయాం సాకుగా చూపి అఖరి నిమిషంలో వన్డే జట్టు (బంగ్లాతో సిరీస్) నుంచి తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా పంత్‌ను టెస్ట్ జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పించడంతో అతని భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. పంత్ స్థానంలో జట్టులోకి వచ్చే ఆటగాడు ఇషాన్ కిషన్‌లా రెచ్చిపోతే, టెస్ట్‌ల్లో కూడా పంత్ స్థానం గల్లంతైనట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే, గాయం కారణంగా రోహిత్ శర్మ జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో కేఎల్ రాహుల్ బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న విషయం తెలిసిందే. రోహిత్‌తో పాటు షమీ, జడేజాలు కూడా గాయాల బారిన పడటంతో బంగ్లా టూర్‌కు తొలుత ఎంపిక చేసిన జట్టులో భారీ మార్పులు జరిగాయి. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరగా.. రోహిత్ శర్మ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ కొత్తగా వచ్చాడు. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు.. శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
కెప్టెన్‌గా రోహిత్ సరే.. వైస్ కెప్టెన్‌గా రాహుల్, పంత్‌ల కంటే అతనైతేనే బెటర్..!
Virender Sehwag Picks Jasprit Bumrah As Team India Vice Captain: టీ20 ప్రపంచకప్-2021 తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా రోహిత్ శర్మ పేరు దాదాపుగా ఖరారైన నేపథ్యంలో వైస్ కెప్టెన్‌గా ఎవరుంటారనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొందరు మాజీలు, విశ్లేషకులేమో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌ల పేర్లు ప్రతిపాధిస్తుండగా.. టీమిండియా మాజీ ఓపెనర్, డాషింగ్ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా పేరును తెరపైకి తెస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత పరిమిత ఓవర్ల జట్టు ఉప సారధిగా రాహుల్, పంత్‌ల కంటే బుమ్రానే బెటర్ ఛాయిస్ అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటి వరకు బుమ్రా ఏ టీ20 జట్టుకు నాయకత్వం వహించకపోయినా బౌలింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడని, మూడు ఫార్మాట్లలో నిలకగా ఆడే వారినే కెప్టెన్, వైస్ కెప్టెన్‌గా నియమిస్తారు కాబట్టి బుమ్రా కంటే మెరుగైన ఎంపిక మరొకటి ఉండదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా ఇప్పటివరకూ ఫాస్ట్ బౌలర్‌ను ఎంపిక చేయలేదన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని టీమిండియా వైస్ కెప్టెన్‌గా బుమ్రాను ఎంపిక చేయాలని డిమాండ్ చేశాడు. కాగా, ఇటీవలే భారత మాజీ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఆశిష్ నెహ్రా సైతం ఇంచుమించు ఇలాంటి ప్రతిపాదననే చేయగా, సెహ్వాగ్.. నెహ్రా ఛాయిస్‌ను సమర్ధిస్తూ బుమ్రాకు మద్దతు పలికాడు. టీమిండియా కెప్టెన్‌గా బౌలర్ ఉండకూడదని ఏ రూల్ బుక్లోనైనా రాసుందా అంటూ ఆశిష్ నెహ్రా సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కోహ్లి స్థానాన్ని ఫాస్ట్ బౌలర్‌తో భర్తీ చేయాలని నెహ్రా డిమాండ్ చేశాడు. చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
జైలు నుంచి వైస్ కెప్టెన్ విడుదల
టీ.నగర్: పుళల్ జైలు నుంచి అమెరికా సాయుధ నౌక వైస్ కెప్టెన్ విడుదలయ్యారు. తూత్తుకుడి హార్బర్లో గత అక్టోబర్ 11వ తేదీ హద్దుమీరి ప్రవేశించినట్లు అమెరికా సాయుధ నౌక పట్టుబడింది. ఆ నౌక కెప్టెన్ వేలంటైన్. వైస్ కెప్టెన్ పాల్ డేవిడ్ డెనిష్ టవర్ సహా 23 మందిని అరెస్టు చేశారు. ఆ తరువాత వీరందరిని పుళల్ జైలులో నిర్బంధించారు. ఏప్రిల్ 5వ తేదీ 21 మంది విడుదలయ్యారు. మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వైస్‌కెప్టెన్ శనివారం విడుదలయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ వేలంటైన్ మాత్రం జైల్లో ఉన్నారు. అతనిని విడిపించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.