పుళల్ జైలు నుంచి అమెరికా సాయుధ నౌక వైస్ కెప్టెన్ విడుదలయ్యారు. తూత్తుకుడి హార్బర్‌లో గత అక్టోబర్ 11వ తేదీ హద్దుమీరి ప్రవేశించినట్లు అమెరికా సాయుధ నౌక పట్టుబడింది.
టీ.నగర్: పుళల్ జైలు నుంచి అమెరికా సాయుధ నౌక వైస్ కెప్టెన్ విడుదలయ్యారు. తూత్తుకుడి హార్బర్‌లో గత అక్టోబర్ 11వ తేదీ హద్దుమీరి ప్రవేశించినట్లు అమెరికా సాయుధ నౌక పట్టుబడింది. ఆ నౌక కెప్టెన్ వేలంటైన్. వైస్ కెప్టెన్ పాల్ డేవిడ్ డెనిష్ టవర్ సహా 23 మందిని అరెస్టు చేశారు. ఆ తరువాత వీరందరిని పుళల్ జైలులో నిర్బంధించారు. ఏప్రిల్ 5వ తేదీ 21 మంది విడుదలయ్యారు. మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల మేరకు వైస్‌కెప్టెన్ శనివారం విడుదలయ్యారు. ప్రస్తుతం కెప్టెన్ వేలంటైన్ మాత్రం జైల్లో ఉన్నారు. అతనిని విడిపించేందుకు అమెరికా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.