Ind vs Ban 1st Test: Fans disappointed with KL Rahul tame dismissal - Sakshi
Sakshi News home page

BAN Vs IND: చాలా దూకుడుగా ఆడావు! ‘శభాష్‌’ రాహుల్‌.. కెప్టెన్‌పై నెటిజన్ల సెటైర్లు!

Published Wed, Dec 14 2022 12:19 PM | Last Updated on Wed, Dec 14 2022 1:50 PM

Fans disappointed with KL Rahuls tame dismissal against Bangladesh - Sakshi

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా స్టాడింగ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 54 బంతులు ఎదుర్కొన్న రాహుల్‌ 22 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. తొలి సెషన్‌లో 19 ఓవర్‌ వేసిన ఖలీద్ అహ్మద్ బౌలింగ్‌లో రాహుల్‌ కవర్‌ డ్రైవ్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించాడు.

అయితే బంతి బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకుని స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో నిరాశ చెందిన రాహుల్‌ తన బ్యాట్‌కు పంచ్‌ చేస్తూ పెవిలియన్‌కు చేరాడు. కాగా చాలా సందర్భాల్లో రాహుల్‌ ఈ విధంగానే తన వికెట్‌ను చేజార్చుకున్నాడు. ఈ క్రమంలో ట్విటర్‌ వేదికగా అభిమానులు రాహుల్‌పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.

ఎప్పుడూ ఒకే విధంగానేనా.. కొంచెం కొత్తగా ఔట్‌ అవ్వవచ్చు కదా అంటూ నెటిజన్లు ట్విట్‌ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు విలేకురుల సమావేశంలో మాట్లాడిన రాహుల్‌.. తొలి టెస్టులో ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ విధానాన్ని అనుసరించి దూకుడుగా ఆడుతామని అన్నాడు. ఈ నేపథ్యంలో నెటిజన్లు రాహుల్‌ ఆట తీరుపై దారుణంగా సెటైర్‌లు వేస్తున్నారు. "54 బంతుల్లో 22 పరుగులు.. ఇదేనేమో దూకుడు" అంటూ అభిమానులు కేఎల్‌ను ట్రోల్‌ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో శుబ్‌మాన్‌ గిల్‌(20), విరాట్‌ కోహ్లి(1) కూడా దారుణంగా విఫలమయ్యారు.
చదవండి: ENG Vs PAK: ఓటమి బాధలో ఉన్న పాకిస్తాన్‌కు మరో భారీ షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement