
ముంబై: టీమిండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా ఎప్పుడెప్పుడు ఐపీఎల్‌లో ఆడాలా అని ఎదురుచూస్తున్నాడు. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడనున్న పుజారాను ఫిబ్రవరిలో జరిగిన మినీ వేలంలో రూ. 50 లక్షలకు సీఎస్‌కే కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రాక్టీస్ సమయంలోనూ పుజారా సిక్సర్ల వర్షం కురిపించి తనలో ఎంత కసి దాగుందో చూపించాడు. అయితే అతనికి సీఎస్‌కే అవకాశాలు ఇస్తుందా అన్న అనుమానం ఉన్నా.. పుజారాకు చాన్స్ ఇస్తే మాత్రం తన విలువేంటో చూపించేందుకు ఉత్సుకతతో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే పుజారా తన సహచర ఆటగాడు హనుమ విహారి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హనుమ విహారిని ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు.
''మనం టీమిండియా తరపున ఏదైనా సాధించినప్పుడు ప్రజలు అమితంగా ఇష్టపడడం సాధారణం.. ఆ విలువ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. ఇప్పుడు నేను ఐపీఎల్‌లో ఆడుతున్నందుకు ఎంత సంతోషంగా ఉన్నానో.. నా సహచరులు కూడా అంతే ఆనందంతో ఉన్నారు. గత కొన్నేళ్లలో టీమింయాలో ఉన్న సహచరుల్లో ఐపీఎల్ మిస్సయ్యింది నేను మాత్రమే అనుకుంటా. దాదాపు ఏడేళ్ల తర్వాత ఐపీఎల్‌లో ఆడబోతున్నా. తాజాగా హనుమ విహారి ఆ బాధను అనుభవిస్తున్నాడు. 2018 తర్వాత అతన్ని ఏ జట్టు వేలంలో తీసుకోవడానికి ముందుకు రాలేదు. కానీ అతను ఐపీఎల్‌లో ఏదో ఒక జట్టుకు ఆడి ఉంటే బాగుండేది. గతంలో విహారి ఐపీఎల్‌లో ఆడాడు.. ఇప్పుడు కూడా ఉంటే బాగుంటుంది..'' అని చెప్పుకొచ్చాడు.
కాగా హనుమ విహారి గతంలో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2019లో ఎస్‌ఆర్‌హెచ్ హనుమ విహారిని రిలీజ్ చేసిన తర్వాత నుంచి ఎవరు అతన్ని కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించలేదు. ఇక ఐపీఎల్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన పుజారా 390 పరుగులు సాధించాడు. గతంలో కేకేఆర్, ఆర్‌సీబీలకు ఆడిన పుజారా తాజాగా సీఎస్‌కే తరపున ఆడనున్నాడు. ఈ సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.మరోవైపు ఐపీఎల్ 14వ సీజన్‌కు కరోనా సెగ పట్టుకుంది. వరుసగా ఆటగాళ్లంతా కరోనా బారిన పడుతుండడంతో ఫ్రాంచైజీల్లో ఆందోళన మొదలైంది.
చదవండి:
'మేం సీఎస్‌కేకు ఆడలేం'.. కారణం అదేనట
Comments
Please login to add a commentAdd a comment