సెంచూరియన్ వేదికగా సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 191 పరుగులకే ఆలౌట్ కావడంతో టీమిండియాకు 113 పరుగుల భారీ విజయం దక్కింది. తద్వారా మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో భారత్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక మ్యాచ్ విజయం అనంతరం హోటల్ రూమ్‌కు వెళ్లే సమయంలో టీమిండియా ఆటగాళ్ల సంబురాలు మాములుగా జరగలేదు. హోటల్ రూంకు వెళ్లే దారిలో పుజారా, సిరాజ్, ఇతర ఆటగాళ్లు తమ డ్యాన్స్‌లతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా లెగ్ షేకింగ్ డ్యాన్స్‌తో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియోనూ అశ్విన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
చదవండి: Virat Kohli: కోహ్లి అరుదైన ఫీట్.. తొలి ఆసియా కెప్టెన్‌గా
''మ్యాచ్ విజయం అనంతరం మా సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫోటోలు బోరింగ్‌గా అనిపించాయి. అయితే అప్పుడు పుజారా మాయ చేశాడు. మేము ఇంతవరకు పుజారా డ్యాన్స్ చేయడం చూడలేదు. మా కోరిక మేరకు పుజారా తొలిసారి మాతో కలిసి డ్యాన్స్ చేశాడు. పుజారా డ్యాన్స్‌లో సిరాజ్‌ది అగ్రభాగం.. నిజంగా ఇది గొప్ప విజయం'' అని క్యాప్షన్ జత చేశాడు.
చదవండి: విజయంతోనే 'ప్రారంభం.. ముగింపు'; సూపర్ టీమిండియా
ఇక మ్యాచ్‌లో పుజారా బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో గోల్డెన్ డక్, రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో సిరాజ్ మూడు వికెట్లు తీస్తే.. అశ్విన్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఖర్లో వరుసగా రెండు బంతుల్లో రెండు వికెట్లు తీసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 3-7 వరకు జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment