టీమిండియా, సౌతాఫ్రికాల మధ్య తొలి టెస్టు ప్రొటీస్ ఇన్నింగ్స్ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సిరాజ్ చేసిన ఒక పని ఆశ్చర్యానికి గురి చేసింది. విషయంలోకి వెళితే.. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 61వ ఓవర్‌ను సిరాజ్ వేశాడు. తొలి బంతిని సిరాజ్ గుడ్‌లెంగ్త్‌తో వేయడంతో బవూమా డిఫెన్స్ ఆడాడు. అయితే బంతిని అందుకున్న సిరాజ్ స్టంప్స్‌ను ఎగురగొడుదామన్న ఉద్దేశంతో బవుమా వైపు కోపంగా విసిరాడు. అయితే బంతి వెళ్లి అనూహ్యంగా బవూమా పాదానికి గట్టిగా తగిలింది.
చదవండి: Ind Vs Ban Semi Final-2: గుంటూరు కుర్రాడు సూపర్.. 90 పరుగుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్
దీంతో బవూమా నొప్పితో విలవిల్లాలాడగా.. వెంటనే సిరాజ్ అతని వద్దకు వెళ్లి క్షమాపణ కోరాడు. అయితే సిరాజ్ ఇది కావాలని మాత్రం చేయలేదని అతని క్షమాపణ ద్వారా తేలింది. బవూమా నొప్పితో బాధపడడంతో వెంటనే ఫిజియో వచ్చి కాలుకు మర్దన చేశాడు. అనంతరం బ్యాటింగ్ కొనసాగించాడు. అయితే సిరాజ్ చర్యపై ఫ్యాన్స్ కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగూ మనం మ్యాచ్ గెలవబోతున్నాం.. ఈ సమయంలో ఇలాంటివి అవసరమా అంటూ కామెంట్స్ చేశారు.
305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వరుసగా వికెట్లు కోల్పోతూ వస్తుంది. లంచ్ విరామం సమయానికి సౌతాఫ్రికా 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. బవుమా 34 పరుగులతో ఒంటరి పోరాటం చేస్తుండగా.. మార్కో జాన్సెన్ 5 పరుగులతో ఆడుతున్నారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3, షమీ 2, సిరాజ్ 2 వికెట్లు తీశారు. టీమిండియా విజయానికి కేవలం మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది.
చదవండి: IND Vs SA: బుమ్రా సూపర్ డెలివరీ.. డసెన్‌కు బొమ్మ కనబడింది
UFF..!!
— Chintan Nanavati (@LightHealing) December 30, 2021
I rather like Mohammed Siraj's alpha-competitiveness & the crazed look in his eyes when bowling, but chucking the ball AT Bavuma post-bowl when he wasn't even CONTEMPLATING a run and, potentially, injuring the South African batter's heel is just NOT cricket..!!#SAvIND pic.twitter.com/zA4UuMGLTm
Comments
Please login to add a commentAdd a comment