ముంబై: ఐపీఎల్ 14వ సీజన్ ఆరంభానికి ముందే ఆసీస్ పేసర్ జోష్ హాజిల్‌వుడ్ తాను ఐపీఎల్‌లో ఆడడం లేదంటూ సీఎస్‌కే జట్టుకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. సుధీర్ఘ బయోబబుల్‌లో ఉండడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హాజిల్‌వుడ్ తెలిపాడు. గత 10 నెలల నుంచి బయోబబుల్, క్వారంటైన్‌లోనే ఎక్కువగా ఉంటూ ఫ్యామిలీకి దూరమవుతుండడంతో వారితో సరదాగా గడిపేందుకు ఐపీఎల్‌కు దూరమవుతున్నట్లుగా మరో కారణం కూడా చెప్పాడు. అయితే ఆసీస్ పేసర్ ఐపీఎల్ ఆడడం లేదని ప్రకటించిన క్షణం నుంచే సోషల్ మీడియాలో అతనిపై నెటిజన్లు విపరీతమైన ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు.
చతేశ్వర్ పుజారాను నెట్స్‌లో ఎదుర్కొలేకనే హాజిల్‌వుడ్ ఈ నిర్ణయం తీసుకున్నాడంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి .. ఏంటి జోష్.. పుజారాకు భయపడ్డావా.. మీ ఇద్దరు ఒకే జట్టులో ఉన్నారన్న విషయం మరిచిపోయావా ఏంటి?.. అంటూ ట్రోల్ చేశారు. నెటిజన్ల మీమ్స్‌ను చూసిన సీఎస్‌కే కూడా తమ ట్విటర్‌లో పుజారా ఫోటోను షేర్ చేస్తూ.. ''చెపు జోష్, ఏమైంది...'' అంటూ కామెంట్ చేసింది. సీఎస్‌కే చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
కాగా ఈ సీజన్‌కు దూరమైన జోష్ హాజిల్‌వుడ్ స్థానంలో ఇంకా ఎవరిని తీసుకోవాలనేదానిపై సీఎస్‌కే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. హాజిల్‌వుడ్ ఇలాంటి నిర్ణయం తీసకుంటాడని ఊహించలేదు. అతని స్థానంలో ఎవరిని తీసుకోవాలనేదానిపై ఏ నిర్ణయానికి రాలేదు. హాజిల్‌వుడ్ లేకున్నా ప్రస్తుతం జట్టు సమతుల్యంగానే ఉంది. ఒకవేళ మేనేజ్‌మెంట్ వద్దు అనుకుంటే ఎవరిని తీసుకునే అవకాశం లేదు అని సీఎస్‌కే ఒక ప్రకటనలో తెలిపింది. ఇక ఈ సీజన్‌లో సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌ను ముంబై వేదికగా ఏప్రిల్ 10న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.
చదవండి: ఐపీఎల్ 2021: వాంఖడేలో కరోనా కలకలం
పుజారా ఆన్ ఫైర్.. సిక్సర్లు బాదుతున్న నయా వాల్
ChePu Josh, what happened? 🤔😉 #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gOBR7PPfRW
— Chennai Super Kings (@ChennaiIPL) April 1, 2021
Comments
Please login to add a commentAdd a comment