
ముంబై : మ్యాచ్ ఆడేటప్పుడు సెంచరీకి ఒక పరుగు దూరంలో ఉన్నప్పుడు ఎంత ఒత్తిడికి గురవుతామో భార్యతో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువ ఒత్తిడి ఉంటుందని టీమిండియా క్రికెటర్ చటేశ్వర్ పుజార అంటున్నాడు. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ విధించడంతో సెలూన్ షాపులు బంద్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పెరిగిన జట్టును కొంతమంది తామే కట్ చేసుకుంటే మరికొందరు ఆ పనిని వారి జీవిత భాగస్వాములకు అప్పగిస్తున్నారు. తాజాగా పుజార తన భార్య పూజాతో హెయిర్ కట్ చేసుకుంటున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకున్నాడు.(అఫ్రిది వ్యాఖ్యలకు రైనా స్ట్రాంగ్ కౌంటర్)
'సెంచరీకి ఒక్క పరుగు (99*) దూరంలో ఉన్నప్పుడు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ను ఎంతగా నమ్ముతాము అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ అదే జీవిత భాగస్వామితో హెయిర్ కట్ చేసుకునేటప్పుడు అదే నమ్మకం ఉంటుందని దైర్యంగా చెప్పడం మాత్రం చాలా కష్టం.' అంటూ క్యాప్షన్ పెట్టాడు. దీనికి సౌరాష్ట్ర సహచర ఆటగాడు జయదేవ్ ఉనద్కట్ మంకీతో కూడిన ఒక ఎమోజీని పెట్టి పుజారతో నేను కూడా ఏకీభవిస్తా అంటూ కామెంట్ చేశాడు. టీమిండియా తరపున 77 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చటేశ్వర్ పుజార 48.86 సగటుతో 5840 పరుగులు చేశాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 18 సెంచరీలు, 25 అర్థ సెంచరీలున్నాయి.
(మాటలతో జవాబివ్వకు అన్నాడు: కోహ్లి)
Comments
Please login to add a commentAdd a comment