టాప్టెన్ లో కొనసాగుతున్న పూజారా, అశ్విన్ | Pujara, Ashwin slip in latest ICC rankings | Sakshi
Sakshi News home page

టాప్టెన్ లో కొనసాగుతున్న పూజారా, అశ్విన్

Published Mon, Feb 10 2014 3:47 PM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

Pujara, Ashwin slip in latest ICC rankings

దుబాయ్: ఐసీసీ విడుదల చేసిన తాజా ర్యాకింగ్ లో భారత ఆటగాళ్లు చటేశ్వర పూజారా, అశ్విన్ లు టాప్ టెన్ లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్ విభాగంలో పూజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా, బౌలింగ్ విభాగంలో అశ్విన్ ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్నాడు. కాగా ఈ వీరివురూ ఆటగాళ్లు గత ర్యాంకులను కోల్పోయినా టాప్ టెన్ లో స్థానం దక్కించుకోవడం విశేషం. ఇదిలా ఉండగా టీం ఇండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐదు స్థానాలు దిగజారి 33వ ర్యాంక్ తో సరిపెట్టుకున్నాడు.

 

ఈ సిరీస్ లో పేలవమైన ఆటను కొనసాగిస్తున్న వైస్ కెప్టెన్ కోహ్లి మాత్రం తిరిగి 11 వ స్థానం నిలబెట్టుకున్నాడు. న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్టులో టీం ఇండియా 40 పరుగుల తేడాతో ఓటమి చెందిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement