లండన్: చాన్నాళ్లుగా ఇంటా బయటా టెస్టుల్లో విఫలమై జట్టులో చోటు కోల్పోయిన భారత సీనియర్ బ్యాటర్ చతేశ్వర్ పుజారా ఇంగ్లండ్‌లో అది కూడా వన్డేల్లో చెలరేగిపోతుండటం విశేషం! అక్కడి దేశవాళీ టోర్నీ అయిన ‘రాయల్ లండన్ వన్డే కప్’లో ససెక్స్ తరఫున వరుసగా రెండో సెంచరీ సాధించాడు. శుక్రవారం వార్విక్‌షైర్‌తో 79 బంతుల్లో 107తో మెరుపు శతకం సాధించిన పుజారా ఆదివారం సర్రేతో ఏకంగా విశ్వరూపమే చూపించాడు.
దీంతో ససెక్స్ 216 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ముందుగా ససెక్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 378 పరుగులు సాధించింది. ఓపెనర్లు హారిసన్ (5), అలీ అర్ (4) విఫలమవగా... కెప్టెన్ పుజారా (131 బంతుల్లో 174; 20 ఫోర్లు, 5 సిక్సర్లు), టామ్ క్లార్క్ (106 బంతుల్లో 104; 13 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 205 పరుగులు జోడించాడు. క్లార్క్ అవుటయ్యాక అస్లాప్ (22), రాలిన్స్ (15), ఇబ్రహీం (15 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 350 పరుగులు దాటించాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన సర్రే 31.4 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ రియాన్ పటేల్ (65; 8 ఫోర్లు, 1 సిక్స్), టామ్ లవెస్ (57 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. కార్వెలస్ నాలుగు, రాలిన్స్ మూడు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment