తొలి టెస్టులో భారీ లక్ష్యం నిర్దేశించినా... పాక్ పోరాటపటిమ ఫలితంగా కష్టపడి గెలిచిన ఆస్ట్రేలియా మరో విజయమే లక్ష్యంగా
ఉదయం గం. 5.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
మెల్‌బోర్న్: తొలి టెస్టులో భారీ లక్ష్యం నిర్దేశించినా... పాక్ పోరాటపటిమ ఫలితంగా కష్టపడి గెలిచిన ఆస్ట్రేలియా మరో విజయమే లక్ష్యంగా ‘బాక్సింగ్ డే’ టెస్టులో బరిలోకి దిగనుంది. సోమవారం మొదలయ్యే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పాకిస్తాన్ పట్టుదలగా ఉంది. బ్రిస్బేన్ డే నైట్ టెస్టులో 490 పరుగుల లక్ష్యాన్ని దాదాపు ఛేదించినంత పనిచేసిన పాక్ అదే ఉత్సాహాన్ని మెల్‌బోర్న్‌లోనూ కొనసాగించాలని భావి స్తోంది.
ఆస్ట్రేలియా గడ్డపై ఆడిన గత పది టెస్టుల్లో ఓడిపోయిన పాక్... 1981లో చివరి సారి మెల్‌బోర్న్ వేదికపై విజయాన్ని అందుకుంది. ఆసీస్ బౌలర్లు స్టార్క్, హాజెల్‌వుడ్, బర్డ్ చెలరేగితే పాక్ బ్యాట్స్‌మెన్‌కు కష్టాలు తప్పవు. బ్రిస్బేన్ టెస్టులో సెంచరీ చేసిన అసద్ షఫీక్‌తోపాటు యూనిస్ ఖాన్, మిస్బా రాణింపుపైనే పాక్ ఆశలు పెట్టుకుంది.