బాలుణ్ణి కాపాడినందుకు అవార్డు
మెల్‌బోర్న్: మతసంప్రదాయానికి విరుద్ధమని తెలిసినా గాయపడ్డ బాలుడికి కట్టుకట్టడానికి తలపాగా ఉపయోగించిన సిక్కు యువకుడిని న్యూజిలాండ్ ప్రభుత్వం అవార్డుతో సత్కరించింది. హర్మాన్ సింగ్‌కు ‘డిస్ట్రిక్ట్ కమాండర్స్ సర్టిఫికెట్’ను శుక్రవారం మనకావు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రదానం చేశారు.
బాధితులపై సింగ్ చూపిన సహానుభూతి ప్రశంసనీయార్హమైనదని కౌంటీ పోలీసుశాఖ ఉన్నతాధికారి అన్నారు. డీజన్ పహియా అనే బాలుడు మే 15న నడుచుకుంటూ స్కూలుకు వెళ్తుండగా కారు ఢీకొట్టింది. అతడి తల నుంచి విపరీతంగా రక్తం కారడాన్ని చూసి సింగ్ వెంటనే తలపాగా తీసి కట్టుకట్టి ప్రాథమిక చికిత్స చేశారు.