‘అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవు’ | Australia Man Saves His Kitten Life From Python | Sakshi
Sakshi News home page

పిల్లికూన కోసం కొండచిలువతో పోరాటం 

Published Wed, May 6 2020 5:27 PM | Last Updated on Wed, May 6 2020 5:30 PM

Australia Man Saves His Kitten Life From Python - Sakshi

లిల్‌తో నిక్‌

మెల్‌బోర్న్‌ : ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న పిల్లికూనను కాపాడటానికి రెండున్నర మీటర్ల పొడవైన కొండచిలువతో నగ్నంగా పోరాడాడు ఓ వ్యక్తి. ఈ సంఘటన ఆస్ట్రేలియాలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని కునునుర్రాకు చెందిన నిక్‌ కియాన్స్‌ కొద్దిరోజుల క్రితం ఓ రాత్రి బెడ్‌ మీద నిద్రపోతున్నాడు. గార్డెన్‌లోనుంచి ఏవో శబ్ధాలు రావటంతో నిద్రలోంచి మెలుకున్నాడు. ఏంటా అని చూస్తే.. అతని పెంపుడు పిల్లి కూన లిల్‌.. కొండ చిలువ బారిన పడి అరుస్తోంది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే అతడు బెడ్‌పై నుంచి నగ్నంగా గార్డెన్‌లోకి పరిగెత్తాడు. ( కిచెన్‌లో బ‌య‌టప‌డ్డ విష‌పూరిత పాము ) 

 పిల్లిని  పట్టుకుని దాన్ని కొండచిలువ నుంచి తప్పించటానికి ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో పాము పిల్లిని వదిలేసింది. కానీ, ఆ వెంటనే అతడి చేతిని బాగా కొరికింది. రక్తం ధారలు కడుతున్నా పట్టించుకోకుండా పిల్లి ని కాపాడానన్న ఆనందంలో మునిగిపోయాడు నిక్‌. ఈ సంఘటనపై మాట్లాడుతూ.. ‘‘ కొన్ని సంవత్సరాలకు ముందు పాముల్ని పట్టుకోవటంలో శిక్షణ తీసుకోవటం కలిసొచ్చింది. పాము లిల్‌ను పట్టుకోవటం చూడగానే.. బెడ్‌పై నుంచి కిందకు దూకి గార్డెన్‌లోకి పరిగెత్తాను. అప్పుడు నా ఒంటి మీద బట్టల్లేవ’’ని చెప్పాడు.  ( కిచెన్‌లో బాత్‌రూమ్: ‘ఓనర్‌ను జైలులో వేయాలి’ ) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement