
ఆ్రస్టేలియాలోని మెల్‌బోర్న్ సీ లైఫ్ ఎక్వేరియంలో డజన్ల కొద్దీ నలుపు, తెలుపు పెంగి్వన్ల మధ్య చాలా పెద్దగా, బొద్దుగా ఉన్న ఏకైక పెంగి్వన్ ఇప్పుడు హాట్‌ఫేవరెట్‌గా మారింది. దాని పేరు పెస్టో. జనవరి 31వ తేదీన పుట్టినపుడు కేవలం 200 గ్రాములున్న ఈ పిల్ల పెంగి్వన్ ఈ 7 నెలల్లో విపరీతంగా పెరిగి ఇప్పుడు ఏకంగా 22 కేజీలు తూగుతూ అటూ ఇటూ తల ఎగరేస్తోంది.
తల్లిదండ్రులు టాంగో, హడ్సన్‌ల మొత్తం బరువుకు దీని బరువు ఇది సమానం. చాక్లెట్ రంగు వెంట్రుకలు, పనస పండులాంటి నిలువెత్తు శరీరంతో ఎక్వేరియం అంతా కలియ తిరుగుతూ ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్న దీనిని నేరుగా చూసేందుకు ఎక్వేరియం ఎన్‌క్లోజర్‌కు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సోషల్ మీడియా రికార్డులను బద్దలుకొడుతూ ఆన్‌లైన్‌లో దీని ఫొటోలు, వీడియోలు చూసిన వారి సంఖ్య ఏకంగా 190 కోట్లు దాటిందని ఒక అనధికార అంచనా.
సాధారణ జనం దగ్గర్నుంచి కేటీ పెర్రీ వంటి హాలీవుడ్ సెలబ్రిటీల దాకా అందరూ దీని ఫ్యాన్సే. ఇప్పటికే బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఇది రోజూ 30 చేపలను గుటకాయ స్వాహా చేస్తోంది. అయితే ఇంతటి బరువుతో దీనికి ఎలాంటి సమస్యలు లేకపోవడం విశేషం. ‘‘మరికొద్ది వారాల్లో ఇది యుక్త వయసులోకి వచ్చి 15 కేజీలకుపైగా బరువు సహజంగా కోల్పోనుంది. అప్పుడు మరింత అందంగా తయారవుతుంది’అని ఎక్వేరియంలో దీని బాగోగులు చూసే జసింటా ఎర్లీ చెప్పారు.
– మెల్‌బోర్న్
Comments
Please login to add a commentAdd a comment