penguins
-
Pesto the penguin: బొద్దు సూపర్‌స్టార్
ఆ్రస్టేలియాలోని మెల్బోర్న్ సీ లైఫ్ ఎక్వేరియంలో డజన్ల కొద్దీ నలుపు, తెలుపు పెంగి్వన్ల మధ్య చాలా పెద్దగా, బొద్దుగా ఉన్న ఏకైక పెంగి్వన్ ఇప్పుడు హాట్‌ఫేవరెట్‌గా మారింది. దాని పేరు పెస్టో. జనవరి 31వ తేదీన పుట్టినపుడు కేవలం 200 గ్రాములున్న ఈ పిల్ల పెంగి్వన్ ఈ 7 నెలల్లో విపరీతంగా పెరిగి ఇప్పుడు ఏకంగా 22 కేజీలు తూగుతూ అటూ ఇటూ తల ఎగరేస్తోంది. తల్లిదండ్రులు టాంగో, హడ్సన్ల మొత్తం బరువుకు దీని బరువు ఇది సమానం. చాక్లెట్ రంగు వెంట్రుకలు, పనస పండులాంటి నిలువెత్తు శరీరంతో ఎక్వేరియం అంతా కలియ తిరుగుతూ ఎంతో బొద్దుగా, ముద్దుగా ఉన్న దీనిని నేరుగా చూసేందుకు ఎక్వేరియం ఎన్‌క్లోజర్‌కు జనం తండోపతండాలుగా వస్తున్నారు. సోషల్ మీడియా రికార్డులను బద్దలుకొడుతూ ఆన్లైన్లో దీని ఫొటోలు, వీడియోలు చూసిన వారి సంఖ్య ఏకంగా 190 కోట్లు దాటిందని ఒక అనధికార అంచనా. సాధారణ జనం దగ్గర్నుంచి కేటీ పెర్రీ వంటి హాలీవుడ్ సెలబ్రిటీల దాకా అందరూ దీని ఫ్యాన్సే. ఇప్పటికే బ్రిటన్, అమెరికా సహా చాలా దేశాల్లో దీనిపై ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించారు. ఇది రోజూ 30 చేపలను గుటకాయ స్వాహా చేస్తోంది. అయితే ఇంతటి బరువుతో దీనికి ఎలాంటి సమస్యలు లేకపోవడం విశేషం. ‘‘మరికొద్ది వారాల్లో ఇది యుక్త వయసులోకి వచ్చి 15 కేజీలకుపైగా బరువు సహజంగా కోల్పోనుంది. అప్పుడు మరింత అందంగా తయారవుతుంది’అని ఎక్వేరియంలో దీని బాగోగులు చూసే జసింటా ఎర్లీ చెప్పారు. – మెల్బోర్న్ -
బిడ్డ కోసం పెంగ్విన్ల ఆరాటం
-
వైరల్: ‘బిడ్డా లే.. అమ్మ వచ్చింది చూడు’
న్యూఢిల్లీ: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే తల్లి హృదయం విలవిల్లాడుతుంది. పిల్లలు ఏ చిన్నాపాటి అనారోగ్యానికి గురైన అమ్మ మనసు సహించదు. బిడ్డలు కోలుకునే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దురదృష్టం కొద్ది బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి తల్లి ప్రేమ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. వాటి బిడ్డలకు ఏం జరిగినా అవి కూడా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. చనిపోయిన పిల్ల పెంగ్విన్ని చూసి దాని తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపించాయి. ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్లో ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు. ‘‘జీవితం అంటేనే ఇలా ఉంటుంది. తమ బిడ్డను కోల్పోయినందుకు ఈ రెండు పెంగ్విన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహమ్మారి టైంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి.. బాధపడుతున్న వారికి దేవుడు ఆత్మనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుశాంత నంద వీడియో షేర్ చేశారు. ఇక దీనిలో ఓ పెంగ్విన్ జంట చనిపోయిన బిడ్డను అటు ఇటు దొర్లిస్తూ.. ముక్కుతో దాన్ని కదుపుతూ లేపే ప్రయత్నం చేశాయి. కానీ దానిలో ఎలాంటి చలనం లేదు. బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ పెంగ్విన్ల గుండె పగిలింది. బిడ్డను చూస్తూ.. మౌనంగా రోదించాయి. వాటి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి -
ఆకట్టుకునే దృశ్యం: ‘ఎంత ముచ్చటగా ఉన్నాయో’
వాషింగ్టన్: ఆకట్టుకునే దృశ్యం. అది పెంగ్విన్స్ బహుమతుల దుకాణం. అందులో అన్ని పెంగ్విన్ బొమ్మలే. వాటిని చూసి ఇద్దరు అనుకొని కస్టమర్లు ఆ షాపులోకి వచ్చారు. ఎంతో ఆసక్తితో షాపంతా తిరగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకి ఆ అనుకొని కస్టమర్లు ఎవరంటే రెండు పెంగ్విన్లు. అవి అలా ఆ దుకాణంలోకి వచ్చి షాపు మొత్తం ఉత్సాహంగా తిరుగుతున్న ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను అమెరికా షెడ్ అక్వేరియం వారు గురువారం ట్విటర్లో షేర్ చేశారు. (చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.) The penguins explore the gift shop! 🐧 Penguins Izzy and Carmen took a field trip to Shedd's gift shop and found...even more penguins. pic.twitter.com/6lEFLUMpyF — Shedd Aquarium (@shedd_aquarium) August 3, 2020 37 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ‘అవును పెంగ్విన్లు కూడా షాపింగ్ చేస్తాయి. ఈ దుకాణంలో ఓ బహుమతి వాటిని ఆకట్టుకుంది కూడా’ అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేశారు. ఆ రెండు పెంగ్విన్లు తమకు నచ్చిన బహుమతిని ఎంచుకున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 42వేల వ్యూస్.. వందల్లో కామెంట్స్ వచ్చాయి. వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ప్రపంచలోనే అత్యంత అందమైన జంతువుల్లో పెంగ్విన్లు ఒకటి. అవి అలా షాపంతా తిరుగుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది’, ‘వాటిని చూస్తుంటే ముచ్చటేస్తోంది’, హ్యాపీ షాపింగ్ పెంగ్విన్స్’ అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. (చదవండి: వైరల్ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు) -
పెంగ్విన్ కూడా ఓటీటీ వైపే?
కీర్తీ సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన థ్రిల్లర్ చిత్రం ‘పెంగ్విన్’. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. నూతన దర్శకుడు ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు నిర్మించారు. ఇందులో గర్భవతి పాత్రలో కీర్తీ సురేష్ నటించారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ఊటీలో జరిపారు. ఈ సినిమా ఈ నెలలో విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా విడుదల పరిస్థితి అయోమయంగా మారింది. తాజాగా ఈ సినిమాను నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారని టాక్. అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమాను జూన్ మొదటివారంలో విడుదల చేయడానికి చర్చలు నడుస్తున్నాయట. ఆల్రెడీ తమిళంలో జ్యోతిక నటించిన ‘పొన్ మగళ్ వందాళ్’ చిత్రాన్ని కూడా డిజిటల్ లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చూడబోతుంటే.. లాక్ డౌన్ కారణంగా మరిన్ని సినిమాలు థియేటర్లో రిలీజ్ కాకుండానే డిజిటల్ కి వచ్చేట్లున్నాయి. -
కరోనా : పెంగ్విన్ ఫీల్డ్ ట్రిప్ !!
చికాగో : కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా ఆ పెగ్విన్స్‌కు స్వేచ్ఛ లభించింది. తాము ఇన్ని రోజులు మగ్గిపోయిన అక్వేరియంలో ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి. తమ రాజ్యంలోని ఇతర జీవులను చూస్తూ టైం పాస్ చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. కరోనా వైరస్ పూర్తిగా ప్రబలడంతో అమెరికా మొత్తం లాక్డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చికాగోకు చెందిన షేడ్ అక్వేరియాన్ని కూడా మూసేశారు. అయితే అక్వేరియంలో ఉండే పెంగ్విన్లను లోపల స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పించారు. దీంతో విల్లింగ్టన్ అనే పెంగ్విన్ అక్వేరియాన్ని చుట్టేస్తూ అందులోని జంతువులను చూస్తూ ఆనందపడిపోతోంది. ఆసక్తిగా ఒకదాన్నొకటి చూసుకుంటున్న వేల్, పెంగ్విన్ మంగళవారం కయావక్, మోయక్, బేబీ అన్నిక్ అనే వేల్స్‌ల దగ్గరకు వెళ్లి చూసి వచ్చింది. అక్కడే ఉంటున్న మరో రెండు పెంగ్విన్లు టిల్లీ, కార్మిన్లు కూడా వేల్స్లను చూసోచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు కొన్ని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మిలియన్ల వ్యూస్‌తో ముందుకు దూసుకుపోతున్నాయి. దీనిపై అక్వేరియం సిబ్బంది మాట్లాడుతూ.. ‘‘ విల్లింగ్టన్ వేల్స్ దగ్గరకు వెళ్లినపుడు అవి చాలా ఆసక్తిగా దాన్ని చూడసాగాయి. ఎందుకంటే అవెప్పుడూ పెంగ్విన్స్‌ను చూసెరుగవ’’ని పేర్కొన్నారు. కాగా, లాక్డౌన్ కారణంగా జూలు, అక్వేరియాలు మూతపడటంతో అక్కడి జంతువులు లోపలే స్వేచ్ఛగా తిరిగేందుకు అవకాశం కల్పిస్తున్నారు సంరక్షకులు. -
ఇప్పుడు మహారాజుల్లా తిరిగేస్తున్నాయి
-
చిట్టి పెంగ్విన్లకు పెద్ద కష్టం!
విక్టోరియా : ఆస్ట్రేలియాలోని బుల్లి పెంగ్విన్లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. 13 సెంటీ మీటర్ల కంటే పెద్దగా పెరగలేని ఈ పెంగ్విన్లకు కికియూ అనే గడ్డి శాపంగా మారుతోంది. గడ్డి శాపంగా మారడమేంటనేగా... 1992లో విక్టోరి యా ప్రాంతంలో విమానం లాండింగ్ సౌకర్యం కోసం కికియూ అనే గడ్డిని తీసుకువచ్చి నాటారు. అయితే ఈ గడ్డి విపరీతంగా పెరిగిపోతూ పెంగ్విన్లు నివాసం ఉండే ప్రాంతాలను కప్పేస్తోంది. అంతేకాకుండా ఈ గడ్డిలో చిక్కుకొని ఎటూ కదల్లేక పెంగ్విన్లు చనిపోతున్నాయట. గతంలో 40 వేల వరకు ఉన్న ఈ పెంగ్విన్ల సంఖ్య ప్రస్తుతం 18 వేలకు చేరుకుంది. అయితే దీనికి స్థానిక అధికారులు ఒక ఉపాయం ఆలోచించారు. పెంగ్విన్లను రక్షించడానికి ఆవులను రంగంలోకి దించారు. గడ్డిని ఆవులు మేసేయడంతో పెంగ్విన్లకు కష్టాలు తప్పుతున్నాయట. -
పరి పరిశోధన
వర్టికల్ ఫార్మింగ్‌తో 30 రెట్లు ఎక్కువ దిగుబడి నేల అవసరం లేని నిట్టనిలువు వ్యవసాయం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాంగానీ.. ఇందులోనూ రికార్డులు బద్దలు కొట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన బోవరీ విషయాన్నే తీసుకోండి. ఈ సంస్థ అతితక్కువ స్థలం, నీరు, వనరులు వాడుకుని బోలెడన్ని ఆకు కూరలు పండించేందుకు రంగం సిద్ధం చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో ఎకరానికి పండించే దానికంటే బోవరీలో పండేది ఏకంగా 30 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. అత్యాధునిక టెక్నాలజీలను వాడుకోవడం ద్వారా తాము 95 శాతం తక్కువ నీరు.. క్రిమికీటక నాశినులు, రసాయన ఎరువులు ఏవీ వాడకుండానే అధిక దిగుబడులు సాధిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఒకే రకమైన పంట కాకుండా ఏకకాలంలో దాదాపు వంద రకాల ఆకు కూరలు, ఔషధ మొక్కలు పెంచడం ఇంకో విశేషం. ప్రత్యేకంగా తయారుచేసుకున్న కంప్యూటర్ సాఫ్ట్వేర్ ద్వారా మొక్కలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానగరాలకు చేరువలో ఇలాంటి వర్టికల్ ఫార్మింగ్ చేపట్టడం ద్వారా నగరవాసులకు తాజా ఆకుకూరలు దొరుకుతాయి. ఇందువల్ల రవాణా చేయవలసిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని బోవెరీ అంటోంది. ప్రస్తుతం ఈ సంస్థ పంటలు న్యూయార్క్‌లోని ఫోరేజ్, హోల్సమ్ ఫుడ్స్ వంటి స్టోర్లలో లభ్యమవుతున్నాయి. పెంగ్విన్ల కాలనీ బయటపడింది... మంచుముద్ద అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ల కాలనీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ.. ఇందులో విశేషమేముంది? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అంతరించిపోతున్నాయని అనుకుంటున్న అడిలీ రకం పెంగ్విన్లు ఇక్కడ ఉండటం ఒక విశేషమైతే.. ఏకంగా 15 లక్షల ప్రాణులు ఉండటం ఇంకో విశేషం. వుడ్హోల్ ఓషన్రోఫిక్ ఇన్స్టిట్యూషన్ శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్లతో జరిపిన పరిశోధనల ద్వారా ఈ కొత్త కాలనీ గురించి ప్రపంచానికి తెలిసింది. డాంగర్ ద్వీపంలో ఉన్న ఈ కాలనీని ఇప్పటివరకూ మనుషులెవరూ సందర్శించలేదని.. బహుశా అందుకే ఆ ప్రాంతంలో పెంగ్విన్లు బాగా వృద్ధి చెందుతూండవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్ హార్ట్ తెలిపారు. 1959లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ వీటి ఉనికి గురించి కొన్ని ఆనవాళ్లు కనిపించాయని, ఆ తరువాత డాంగర్ ద్వీపమున్న పశ్చిమ అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్లు క్రమేపీ తగ్గిపోతూ వచ్చాయని హార్ట్ వివరించారు. దాదాపు ఏడు లక్షల జంటలతో ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్ కాలనీగా ‘హార్ట్’ నిలిచింది అంటున్నారు. ఆక్సఫర్డ్ విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, ఫ్రాన్స్‌లలోని ఇతర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. నిత్య యవ్వనం గుట్టు తెలిసింది... నిండు నూరేళ్లూ... ఎలాంటి జబ్బులు, ఇబ్బందులు లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది గానీ.. సాధ్యమయ్యేదెలా? అంటున్నారా? అరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఈ దిశగా ఇంకో అడుగు ముందుకు పడింది. విషయం ఏమిటంటే.. మన క్రోమోజోమ్‌ల చివరన ఉండే టెలిమోర్లకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని తెలుసుకున్నారు. డీఎన్ఏ పోగుల్లోని కొన్ని భాగాలను టెలీమోర్లుగా మార్చేందుకు టెలిమరేస్ అనే ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వీరు గుర్తించారు. సాధారణంగా మన శరీర కణాలు కొన్నిసార్లు విభజితమైన తరువాత మరణిస్తాయి. ఈ క్రమంలో క్రోమోజోమ్‌ల చివర ఉండే టెలీమోర్ల పొడవు తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే టెలిమోర్ల పొడవు నిర్దిష్ట స్థాయికంటే తక్కువ అవుతుందో అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే కణాలు.. వాటితోపాటు మనమూ వృద్ధులమవుతామన్నమాట. ఈ నేపథ్యంలో టెలీమోర్ల పొడవు తగ్గకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. టెలీమెరేస్లో క్రోమోజోమ్ చివరల్లో ఉండే టెలీమోర్లకు సంబంధించిన డీఎన్ఏ ముక్కలను కచ్చితంగా తయారు చేసేందుకు ఒక వ్యవస్థ ఉందని.. ఇది.. ఆ ఎంజైమ్ మొత్తం పనితీరునూ ప్రభావితం చేస్తోందని వీరు తెలుసుకున్నారు ఈ వ్యవస్థను నియంత్రించగలిగితే టెలీమోర్ల పొడవు తగ్గకుండా ఉంటుంది.. తద్వారా కణాలు.. మనమూ నిత్యయవ్వనంతో ఉండవచ్చునని అంచనా. -
మనుషుల్లాగా నడవద్దు.. ఐతే ఏం చేయాలి..!
బెర్లిన్: జర్మనీ వాసులకు డాక్టర్లు ఓ వినూత్న ఐడియాను సూచించారు. ఇకనుంచీ జర్మనీ వాసులు మనుషుల్లాగ నడవద్దని.. పెంగ్విన్స్ తరహాలో నడవాలని డాక్టర్లు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఇలాగే చేయాలని లేనిపక్షంలో సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయంటూ దేశ ప్రజలను హెచ్చరించారు. అసలు విషయం ఏంటంటే.. కొన్ని అమెరికన్ దేశాలతో పాటు యూరప్‌లోనూ కొన్ని నెలలపాటు మంచు కురుస్తుంటుంది. ఈ క్రమంలో మంచుపై నడుస్తున్నప్పుడు పట్టుతప్పి జారి పడిపోయే అవకాశం ఉంది. దీనిపై స్థానిక ఓ వెబ్సైట్లో జర్మన్ సొసైటీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రౌమా సర్జన్స్ ఆందోళన వ్యక్తం చేశారు. 2014లో జర్మనీ వాసులు మంచుపై జారిపడి 750 ఎమర్జెన్సీ కేసులు నమోదైన సంగతి తెలిసిందే. రాబోయే శనివారం నాటికి ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలు ఉంటాయని వాతావరణశాఖ తెలిపింది. రెండేళ్ల కింద నెలకొన్ని పరిస్థితులు మరోసారి పునరావృతం కావద్దంటే ప్రజలు కాస్త జాగ్రత్తగా నడుచుకోవాలని వైద్యులు చెబుతున్నారు. గతంలో జరిగిన ప్రమాదాలకు బెర్లిన్ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ జనాలు ఆరోపించారు. పెంగ్విన్ పక్షుల్లా నడవాలని డాక్టర్లు సూచించారు కానీ, మనుషుల నడకకు, వాటి నడకకు ఎంతో వ్యత్యాసం ఉంటుందని ఇది మనకు సాధ్యం కాదని బెర్లిన్ వాసులు అంటున్నారు. పెంగ్విన్లు ఒకేసారి గెంతుతూ వెళ్తాయని, మనం అడుగు తీసి అడుగు వేస్తాం.. ఒక్క కాలు పట్టుతప్పినా జారి పడిపోయే అవకాశం ఎక్కువని వారు వాపోతున్నారు.