ఆకట్టుకునే దృశ్యం: ‘ఎంత ముచ్చటగా ఉన్నాయో’ | Penguins In Penguin Gift Shop Video Goes Viral | Sakshi
Sakshi News home page

పెంగ్విన్‌ బహుమతి షాపులో పెంగ్విన్స్‌

Published Thu, Aug 6 2020 5:18 PM | Last Updated on Thu, Aug 6 2020 5:33 PM

Penguins In Penguin Gift Shop Video Goes Viral - Sakshi

వాషింగ్టన్‌: ఆకట్టుకునే దృశ్యం. అది పెంగ్విన్స్‌‌ బహుమతుల దుకాణం. అందులో అన్ని పెంగ్విన్‌‌ బొమ్మలే. వాటిని చూసి ఇద్దరు అనుకొని కస్టమర్లు ఆ షాపులోకి వచ్చారు. ఎంతో ఆసక్తితో షాపంతా తిరగుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇంతకి ఆ అనుకొని కస్టమర్లు ఎవరంటే రెండు పెంగ్విన్‌లు. అవి అలా ఆ దుకాణంలోకి వచ్చి షాపు మొత్తం ఉత్సాహంగా తిరుగుతున్న ఈ వీడియోకు నెటిజన్లంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను అమెరికా షెడ్‌ అక్వేరియం వారు గురువారం ట్విటర్‌లో షేర్‌ చేశారు. (చదవండి: ప్రకృతికి కోపం వస్తే ఇలాంటి విధ్వంసాలే.)

37 సెకన్ల నిడివి గల ఈ వీడియోకు ‘అవును పెంగ్విన్‌లు కూడా షాపింగ్‌ చేస్తాయి. ఈ దుకాణంలో ఓ బహుమతి  వాటిని ఆకట్టుకుంది కూడా’ అనే క్యాప్షన్‌తో ట్వీట్‌ చేశారు.  ఆ రెండు పెంగ్విన్‌లు తమకు నచ్చిన బహుమతిని ఎంచుకున్న ఈ దృశ్యం ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంటోంది. ఇప్పటి వరకు ఈ వీడియోకు 42వేల వ్యూస్‌.. వందల్లో కామెంట్స్‌ వచ్చాయి. వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. ‘ప్రపంచలోనే అత్యంత అందమైన జంతువుల్లో పెంగ్విన్‌లు ఒకటి. అవి అలా షాపంతా తిరుగుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది’, ‘వాటిని చూస్తుంటే ముచ్చటేస్తోంది’, హ్యాపీ షాపింగ్‌ పెంగ్విన్స్’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ పెడుతున్నారు. (చదవండి: వైరల్‌ : ఇతనికి కొంచెమైనా బుద్ధి లేదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement