విక్టోరియా : ఆస్ట్రేలియాలోని బుల్లి పెంగ్విన్‌లకు పెద్ద కష్టమే వచ్చిపడింది. 13 సెంటీ మీటర్ల కంటే పెద్దగా పెరగలేని ఈ పెంగ్విన్లకు కికియూ అనే గడ్డి శాపంగా మారుతోంది. గడ్డి శాపంగా మారడమేంటనేగా... 1992లో విక్టోరి యా ప్రాంతంలో విమానం లాండింగ్ సౌకర్యం కోసం కికియూ అనే గడ్డిని తీసుకువచ్చి నాటారు. అయితే ఈ గడ్డి విపరీతంగా పెరిగిపోతూ పెంగ్విన్‌లు నివాసం ఉండే ప్రాంతాలను కప్పేస్తోంది.
అంతేకాకుండా ఈ గడ్డిలో చిక్కుకొని ఎటూ కదల్లేక పెంగ్విన్‌లు చనిపోతున్నాయట. గతంలో 40 వేల వరకు ఉన్న ఈ పెంగ్విన్‌ల సంఖ్య ప్రస్తుతం 18 వేలకు చేరుకుంది. అయితే దీనికి స్థానిక అధికారులు ఒక ఉపాయం ఆలోచించారు. పెంగ్విన్‌లను రక్షించడానికి ఆవులను రంగంలోకి దించారు. గడ్డిని ఆవులు మేసేయడంతో పెంగ్విన్‌లకు కష్టాలు తప్పుతున్నాయట.
Comments
Please login to add a commentAdd a comment