అత్యంత నివాసయోగ్య నగరం.. మెల్‌బోర్న్ | Melbourne crowned world's most liveable city: 13 of the best houses at median price | Sakshi
Sakshi News home page

అత్యంత నివాసయోగ్య నగరం.. మెల్‌బోర్న్

Published Wed, Aug 19 2015 6:35 AM | Last Updated on Sun, Sep 3 2017 7:44 AM

Melbourne crowned world's most liveable city: 13 of the best houses at median price

 కాన్‌బెర్రా: ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) అనే సంస్థ ప్రతిఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. సుమారు 140 నగరాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాల ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించింది. ఈ అంశాల ఆధారంగా ఆయా నగరాలకు పాయింట్లు కేటాయించింది.

మొత్తం 100 పాయింట్లకు గాను 97.5 పాయింట్లు సాధించి మెల్‌బోర్న్ మొదటిస్థానంలో నిలిచింది. వియన్నా(97.4), వాంకోవర్(97.3), టొరంటో(97.2) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్-10లో ఆస్ట్రేలియా, కెనడాలకు చెందిన ఏడు నగరాలు ఉండడం విశేషం.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement