median price
-
‘బేటీ బచావో బేటీ పడావో’ నిధులు ప్రచారానికేనా?
న్యూఢిల్లీ: 2016 నుంచి 2019 వరకూ ‘బేటీ బచావో, బేటీ పడావో’ పథకానికి విడుదల చేసిన రూ.446.72 కోట్లలో 78 శాతానికి పైగా నిధులను కేవలం మీడియాలో ప్రచారానికే ఖర్చు చేయడం పట్ల పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలికల విద్య కోసం వ్యయం చేయాల్సిన సొమ్మును ప్రకటనలపై వెచ్చించడం ఎంతవరకు సమంజసమో ప్రభుత్వం ఆలోచించాలని సూచించింది. మహిళా సాధికారతపై ఏర్పాటైన ఈ స్థాయీ సంఘం తాజాగా తన నివేదికను లోక్సభకు సమర్పించింది. ఈ పథకం అమలు తీరుపై జిల్లా స్థాయిలో ఏదైనా సామాజిక సంస్థ లేదా థర్డ్ పార్టీ/నిపుణులతో సోషల్ ఆడిట్ కచ్చితంగా నిర్వహించాలని పేర్కొంది. -
ఆ ఖర్చూ ఎన్నికల వ్యయమే: ఈసీ
న్యూఢిల్లీ: అభ్యర్థుల నేరచరిత్ర గురించి మీడియాలో ఇచ్చే ప్రకటనలకు అయ్యే ఖర్చును ఎన్నికల ప్రచార వ్యయంలో భాగంగానే పరిగణించాలని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి ఈసీ ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీచేసింది. నేరచరిత్రకు సంబంధించిన ప్రకటనల ఖర్చును అభ్యర్థులు, రాజకీయ పార్టీలే భరించాలని స్పష్టం చేసింది. నామినేషన్ పత్రాలు దాఖలుచేసిన తరువాత నేరచరిత్రలో ఏమైనా మార్పులు జరిగితే సవరించిన వివరాల్ని కూడా ప్రచురించి, రిటర్నింగ్ అధికారికి వెల్లడించాలని సూచించింది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యయానికి పరిమితి లేదు. కానీ అభ్యర్థి వ్యయం రూ.28 లక్షలకు మించకూడదు. -
అత్యంత నివాసయోగ్య నగరం.. మెల్బోర్న్
కాన్బెర్రా: ప్రపంచంలో అత్యంత నివాసయోగ్యమైన నగరంగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వరుసగా ఐదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(ఈఐయూ) అనే సంస్థ ప్రతిఏటా ఈ జాబితాను విడుదల చేస్తుంది. సుమారు 140 నగరాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, సంస్కృతి, పర్యావరణం వంటి అంశాల ఆధారంగా చేసుకొని ఈ జాబితాను రూపొందించింది. ఈ అంశాల ఆధారంగా ఆయా నగరాలకు పాయింట్లు కేటాయించింది. మొత్తం 100 పాయింట్లకు గాను 97.5 పాయింట్లు సాధించి మెల్బోర్న్ మొదటిస్థానంలో నిలిచింది. వియన్నా(97.4), వాంకోవర్(97.3), టొరంటో(97.2) ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. టాప్-10లో ఆస్ట్రేలియా, కెనడాలకు చెందిన ఏడు నగరాలు ఉండడం విశేషం.