
మెల్‌బోర్న్‌లో యాగానికి లక్ష్మీపార్వతి
వచ్చే నెల 5, 6 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగనున్న ‘శ్రీ యాగం– లక్ష్మీ మహా యజ్ఞం’, ‘ఇంటర్ ఫేయిత్ అండ్ మల్టీ కల్చరల్
సాక్షి, హైదరాబాద్: వచ్చే నెల 5, 6 తేదీల్లో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరగనున్న ‘శ్రీ యాగం– లక్ష్మీ మహా యజ్ఞం’, ‘ఇంటర్ ఫేయిత్ అండ్ మల్టీ కల్చరల్ కాన్ఫరెన్స్’ కు నందమూరి లక్ష్మీపార్వతిని ప్రత్యేక అతిథిగా జేఈటీ ఆస్ట్రేలియా ఫౌండేషన్–మెల్‌బోర్న్ చాప్టర్ ఆహ్వానించింది.
ఆస్ట్రేలియాలోని శ్రీ దుర్గ దేవాలయం, జేఈటీ ఆస్ట్రేలియా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ యాగాన్ని నిర్వహిస్తున్నట్లు ఆహ్వానంలో ఫౌండేషన్ మెల్‌బోర్న్ చాప్టర్ ప్రతినిధి సత్య రామడుగు పేర్కొన్నారు. త్రిదండి చినజీయర్ స్వామి, ఆయన బృం దంతో భారత్ నుంచి మెల్‌బోర్న్ వరకు నిర్వహిస్తున్న పర్యటనలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.