షాపింగ్ సెంటర్పై కూలిన విమానం | plane veered into the shopping centre. | Sakshi
Sakshi News home page

షాపింగ్ సెంటర్పై కూలిన విమానం

Published Tue, Feb 21 2017 11:33 AM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM

షాపింగ్ సెంటర్పై కూలిన విమానం

షాపింగ్ సెంటర్పై కూలిన విమానం

సిడ్నీ: ఆస్ట్రేలియాలో మంగళవారం విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మెల్బోర్న్లోని ఓ షాపింగ్ సెంటర్పై విమానం కూలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు.

మెల్బోర్న్లోని ఎసెండన్ ఫీల్డ్స్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ తీసుకున్న విమానం కొద్ది సెకన్లలోనే ప్రమాదానికి గురైంది. ఎయిర్పోర్ట్ పక్కనే ఉన్న షాపింగ్ సెంటర్పై కూలిపోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి, అదృష్టవశాత్తు ఆ సమయంలో అక్కడ ప్రజలెవరూ లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. బీచ్కాండి ఎయిర్క్రాఫ్ట్ మెల్బోర్న్ నుంచి కింగ్ ఐలాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని విక్టోరియన్ ప్రీమియర్ అధికారి డానియల్ ఆండ్రూస్ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement