మెల్‌బోర్న్: మహిళల క్రికెట్‌కు కూడా మంచి రోజు లు రాబోతున్నాయి. ఈ దిశగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ముందడుగు వేసింది. ఆసీస్ దేశవాళీ టోర్నీ బిగ్ బాష్ ప్రాముఖ్యం గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే లీగ్ మహిళల కోసం ఏర్పాటు కానుంది. 2015-16 సీజన్ నుంచి మహిళల బిగ్‌బాష్ లీగ్ (డబ్ల్యుబీబీఎల్)ను ప్రారంభించనున్నట్టు సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ తెలిపారు.
ప్రస్తుతం బీబీఎల్‌లో ఉన్న 8 జట్లే ఇందులోనూ కొనసాగుతాయి. ‘మహిళల క్రికెట్ మరింత అభివృద్ధి చెందేందుకు ఈ డబ్ల్యుబీబీఎల్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక్కడి బాలికలు, మహిళలకు క్రికెట్ నంబర్‌వన్ గేమ్‌గా ఉండాలని మా ఉద్దేశం. మా లక్ష్యాన్ని ఈ లీగ్ నెరవేరుస్తుందని అనుకుంటున్నాం. ఫార్మాట్‌పై ఇంకా చర్చిస్తున్నాం. అత్యుత్తమ పోటీ ఉండేలా చూస్తున్నాం’ అని సదర్లాండ్ చెప్పారు.
మహిళలకూ టి20 లీగ్
Published Fri, Feb 20 2015 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM
Advertisement
Advertisement