ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
మెల్బోర్న్: 'చెంబులో చేయెందుకు పెట్టావ్?' అనే మాట మనల్ని ఇప్పటికీ నవ్విస్తుంటుంది. సరదాగా మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం. మనలాగే ఆస్ట్రేలియాలో ఓ తండ్రి తన కుమారుడిని ఇలాగే ప్రశ్నించాడు. అయితే చెంబులో అని కాకుండా వెండింగ్ మెషిన్లో చెయ్యెందుకు పెట్టావని.
ఆస్ట్రేలియాలో బిస్కట్లు, చాక్లెట్లువంటివాటికి ప్రత్యేక వెండింగ్ మెషిన్లు ఉంటాయి. లోన్ స్డేల్ వీధిలోని ఓ కాంప్లెక్స్ వద్ద బిస్కెట్ల వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లిన లియో అనే నాలుగేళ్ల పిల్లాడు మెషిన్ లోపలికి చేయిపెట్టాడు. దాంతో అది కాస్త ఇరుక్కుపోయింది. ఎంతకీ భయటకు రాకపోవడంతో ఏడ్వడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ప్రయత్నించారు. ఫలితం లేకుండాపోయింది.
ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. చివరకు వెండింగ్ మెషిన్ను కట్ చేసి ఆరు గంటల తర్వాత అతడి చేతిని భయటకు తీశారు. అతడు చిన్నపిల్లాడు కావడం, బిస్కెట్లు చూసి ఆకర్షణకు లోనై తెలియక లోపల చేయిపెట్టడం వల్ల ఈ సంఘటన జరిగిందని బాలుడి తండ్రి చెప్పాడు.