leo
-
మగవారూ... భాష జాగ్రత్త
గతంలో ఎం.ఎల్.ఏ అయిన ఒక పెద్ద హీరో స్త్రీల గురించి అసభ్యంగా మాట్లాడి అసెంబ్లీలో సంజాయిషీ ఇచ్చాడు. డెబ్బయి ఏళ్లు దాటిన ఒక సీనియర్ నటుడు నోరు పారేసుకుని పరువు పోగొట్టుకున్నాడు. పార్లమెంట్ సభ్యుడుగా ఉన్న మరో నటుడు స్త్రీల దుస్తుల గురించి సుద్దులు చెప్పి నిరసన ఎదుర్కొన్నాడు. ఇప్పుడు తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్. సెలబ్రిటీలుగా ఉన్నవారు ఎంతో బాధ్యతగా ఉండి యువతకు మార్గం చూపేలా ఉండాలి. వారు ఇలా తగలడితే స్త్రీలతో ఎలా వ్యవహరించాలో ఇంటినే బడిగా మార్చి తల్లిదండ్రులు నేర్పించాల్సి ఉంటుంది. అయితే ఇంటి ఆడవారికి తండ్రి, భర్త గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నారా అనేది ప్రశ్న. అతడో ప్రసిద్ధ నటుడు. ‘మా బ్లడ్డు వేరు మా బ్రీడు వేరు’ అంటుంటాడు. కాని ఒక సభలో అభిమానులను చూసి పూనకం వచ్చి స్త్రీల గురించి అశ్లీలమైన వ్యాఖ్యలు చేశాడు. వందల సినిమాల్లో తండ్రిగానో బాబాయిగానో వేసిన ఒక నటుడు ‘స్త్రీల మీద మీ అభిప్రాయం ఏమిటి?’ అని సభలో యాంకర్ అడిగితే పరమ రోతగా సమాధానం ఇచ్చాడు. ఇక నటుడుగా, రియల్టర్‌గా గుర్తింపు పొందిన మరో పెద్ద మనిషి పార్లమెంట్ మెంబర్ అయ్యాక పార్లమెంట్లో నిలబడి మరీ ‘స్త్రీల దుస్తుల వల్లే వారికి సమస్యలు వస్తున్నాయి’ అన్నాడు. స్త్రీలను ఏదో ఒకటి అనేయొచ్చు, అంటే వాళ్లు పడతారు, అనడానికే మేము పుట్టాము అనే చులకనభావం పురుష సమాజంలో నరనరాన జీర్ణించుకుని పోబట్టే ఈ ప్రతిఫలాలు. అదృష్టవశాత్తు ఇలాంటి వ్యాఖ్యలకు వెంటనే నిరసన పెల్లుబుకుతున్నా పురుషుల నోటి దురుసు తగ్గడం లేదు. తాజాగా తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల త్రిషతో ‘లియో’ సినిమాలో నటించిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ‘ఆమె హీరోయిన్ అని తెలిశాక (గత సినిమాల్లో తాను చేసిన) బెడ్రూమ్ సీన్ ఉంటుందని ఆశపడ్డాను’ అని వ్యాఖ్యానించాడు. ‘ఇది సినిమా లాంగ్వేజ్’ అని మన్సూర్ అనుకుని ఉండొచ్చుగాని దానిలోని అశ్లీల ధ్వనికి త్రిష రియాక్ట్ అయ్యింది. ‘ఇతనితో ఇంకెప్పుడూ సినిమాల్లో నటించను’ అని చెప్పింది. ఆ తర్వాత చినికి చినికి గాలివానై ఇప్పుడు మన్సూర్ మీద కేసు బుక్ అయ్యేంతగా వెళ్లింది. మగవాళ్లు ‘సరదాగా మాట్లాడుతున్నామని’ అనుకుంటూ కూడా స్త్రీలను కించపరిచే వ్యాఖ్యలు చేస్తారు. సరదాగా కించపరచడం ఏమిటో... కించపరచడం ఎలాంటి సరదానో వీరే చెప్పాలి. ► ప్రసిద్ధులే దారి తప్పితే రాజకీయ నేతలు, సినిమా నటులు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు... ఇలా సమాజంలో గుర్తింపు పొందినవారు స్త్రీల పట్ల మరింత గౌరవంతో మెలగుతూ ఆదర్శంగా నిలవాలి. కాని చాలాసార్లు రాజకీయ నాయకుల దగ్గరి నుంచి అన్ని రకాల ప్రముఖులు ఏదో ఒక సందర్భంలో చులకన మాటలు మాట్లాడుతూ కుసంస్కారాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరాదిలో మంత్రులు ‘మేం వేసిన రోడ్లు ఫలానా హీరోయిన్ బుగ్గల్లా ఉంటాయి’ అంటూ వదరుతుంటారు. సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమాలో కుస్తీ వీరుడిగా నటించి ‘ఈ సినిమాలో కుస్తీలు చేస్తే రేప్ జరిగినంత పనయ్యింది నాకు’ అని వ్యాఖ్యానించి మొట్టికాయలు తిన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఒక మాజీ మంత్రి ప్రస్తుత మంత్రిగా ఉన్న నటిపై దారుణమైన వ్యాఖ్యలు చేసి కోర్టు కేసును ఎదుర్కొనబోతున్నాడు. ► బాల్యం నుంచి భావజాల ప్రభావం ‘కుటుంబంలో తండ్రి (మగాడు) ముఖ్యం’ అనే భావన బాల్యం నుంచి పిల్లల్లో ఎక్కించడం ద్వారా పురుష సమాజం తన ఆధిక్యతను స్త్రీలపై ఆధిపత్యాన్ని కొనసాగించేలా చేస్తుంది. తండ్రిని ‘మీరు’ అని, తల్లిని ‘నువ్వు’ అని అనడంలో ప్రేమ, గౌరవం, దగ్గరితనం ఉన్నా ‘నువ్వు’ అనడం వల్ల ‘లెక్క చేయవలసిన పని లేదు’ అనే భావన కలిగితే కష్టం. తిట్లు, బూతులు అన్నీ స్త్రీలను అవమానించేవే. వాటిని విని, పలికి స్త్రీల పట్ల అలా మాట్లాడవచ్చు అనుకుంటారు మగవారు. ఇంట్లో చెల్లెని, అక్కని, తల్లిని తండ్రి అదుపు చేసే తీరు చూసి, తామూ బయట స్త్రీలను అలాగే అదుపు చేయవచ్చనుకుంటారు. ఫైటర్ జెట్స్‌ను స్త్రీలు నడుపుతున్న ఈ కాలంలో కూడా ‘మేమేమీ గాజులు తొడుక్కోలేదు’, ‘మూతి మీద మీసముంటే రా’లాంటి పౌరుష వచనాలను పురుషులు ఇంకా పలికేటంత వెనుకబాటుతనంలో ఉండటం విషాదకరం. శారీరక పరిమితులు ఉన్నంత మాత్రాన స్త్రీలు బలహీనులు, పురుషులు బలవంతులు కాబోరు. ► తల్లిదండ్రులూ జాగ్రత్త అబ్బాయిలను ఆడపిల్లలను గౌరవించేలా పెంచడం, టీనేజ్‌లో ఉన్న అబ్బాయిలకు సరైన కౌన్సెలింగ్ ఇవ్వడం ఇప్పటి తల్లిదండ్రుల తక్షణ కర్తవ్యం. చట్టాలు పకడ్బందీగా ఉన్న ప్రస్తుత రోజుల్లో తెలిసో తెలియకో అహంకారంతోనో పరుష వ్యాఖ్య, అసభ్య చేష్ట నేరుగా కాని సోషల్ మీడియాలోగాని చేస్తే వారు ప్రమాదంలో పడతారని హెచ్చరించాలి. చైతన్యం పెరిగింది. అబ్బాయిలూ భాష జాగ్రత్త. -
అలాంటి వ్యక్తితో నటించకపోవడం సంతోషం
తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ–‘‘నేను గతంలో చాలా సినిమాల్లో హీరోయిన్లతో బెడ్ సీన్లలో నటించా. ‘లియో’ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు త్రిషతో బెడ్రూమ్ సీన్ ఉంటుందని అనుకున్నాను. అయితే అలాంటి సన్నివేశం లేకపోవడం బాధపడ్డాను. కశ్మీర్ షెడ్యూల్ అయిపోయే వరకు త్రిషను చూసే అవకాశం కూడా చిత్రయూనిట్ ఇవ్వలేదు’’ అంటూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతటా చర్చనీయాంశంగా మారాయి. ఈ వార్తలు త్రిష వద్దకు చేరడంతో సోషల్ మీడియా వేదికగా ఆమె స్పందించారు. ‘‘మన్సూర్ అలీఖాన్ నా గురించి అసహ్యంగా మాట్లాడిన వీడియో నా దృష్టికి వచ్చింది.. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి వ్యక్తులతో నటించకపోవడం సంతోషంగా ఉంది. భవిష్యత్తులోనూ ఆయనతో, అలాంటి వారితో నటించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటా. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తోంది’’ అన్నారు. అయితే తన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగడంతో మన్సూర్ అలీఖాన్ స్పందిస్తూ–‘‘త్రిష అంటే నాకు చాలా గౌరవం ఉంది. నేను సరదాగా మాట్లాడిన వ్యాఖ్యలపై ఇలాంటి దుమారం రేగుతుందనుకోలేదు.. నా మాటలను ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు’’ అన్నారు. -
రిలీజ్ కి ముందే రికార్డులు
-
Lokesh Kanagaraj Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లియో డైరెక్టర్ (ఫోటోలు)
-
లియోకి వాయిస్
ఇళయ దళపతి విజయ్ అభిమానులకు లోక నాయకుడు కమల్‌హాసన్ ఓ స్వీట్ షాక్ ఇవ్వనున్నారని కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్ అంటోంది. వార్తల్లో ఉన్న ప్రకారం విజయ్ నటిస్తున్న ‘లియో’ చిత్రం టీజర్‌కి కమల్ వాయిస్ ఓవర్ ఇచ్చారట. ఈ నెల 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఓ మంచి యాక్షన్ టీజర్‌ని రెడీ చేస్తున్నారట చిత్రదర్శకుడు లోకేష్ కనగరాజ్. విజయ్ ΄ాత్ర పరిచయంతో ఈ టీజర్ సాగుతుందని, ఈ పరిచయం కమల్ మాటల్లో వినబడుతుందని భోగట్టా. కమల్ డబ్బింగ్ చెప్పేశారని, ఆ వాయిస్‌తో టీజర్ రెడీ చేసే పని మీద చిత్ర యూనిట్ ఉందని టాక్. త్రిష కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ ΄ాత్ర చేస్తున్నారు. అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. -
విద్యార్థులకు లియో 1 క్రెడిట్ కార్డ్
హైదరాబాద్: ఎడ్యుఫిన్‌టెక్ సంస్థ లియో 1, క్యాంపస్‌లలో నగదుతో పని లేకుండా ఉండేందుకు కో బ్రాంబెడ్ క్రెడిట్ కార్డు ‘లియో1 కార్డ్’ను విడుదల చేయనుంది. ఇందుకు స్టూడెంట్ ట్రైబ్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఆర్థిక క్రమశిక్షణతో ఉండే విద్యార్థులకు దీన్ని ఆఫర్ చేయనున్నట్టు సంస్థ తెలిపింది. విద్యా సంస్థలను నగదు రహితంగా మార్చడమే తమ భాగస్వామ్యం లక్ష్యమని పేర్కొంది. -
సింహ రాశి ఫలాలు 2022-23
మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే) పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ) ఉత్తర 1వ పాదము (టే) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (సప్తమం)లోను తదుపరి మీనం (అష్టమి)లోను సంచారం చేస్తారు. శని ఏప్రిల్ 28 వరకు మరల జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (షష్ఠం)లోను మిగిలిన కాలం అంతా కుంభంలోను సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (రాజ్యం) కేతువు వృశ్చికం (చతుర్థం)లోనూ తదుపరి రాహువు మేషం (భాగ్యం) కేతువు తుల (తృతీయం)లో సంచరిస్తారు. 2022 ఆగస్టు 10 నుంచి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (దశమం)లో స్తంభన. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా అనుకూల ప్రతికూల ఫలితాలు మీ ప్రవర్తనపై ఆధారపడి ఉంటాయి. మకర శని సంచారం కుంభ గురు సంచార కాలం అనుకూలం. ఈ సంవత్సరం ఏ పని అయినా స్వయంగా చేసుకుంటే సానుకూలం. ఇతరుల మీద ఆధారపడితే ప్రతికూలం. ప్రధానంగా ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు నియంత్రించుకోగలిగిన వారికి కాలం అనుకూలం. లేకుంటే, ఇబ్బందికరం. కావలసిన కొత్త ఋణాలు సమయానికి అందుబాటులో లేకపోవడంతో పాత ఋణాలు తీర్చే ప్రయత్నాలు ఇబ్బందికరంగా ఉంటాయి. కుటుంబ సమస్యలు ప్రత్యేకంగా ఏమీ ఉండవుగాని, తెలియని అవగాహన లోపాలు వెంబడిస్తుంటాయి. ఏప్రిల్ నుంచి మూడు నెలల కాలంలో వస్తువులు చోరీకి గురవడం, అనుకోని భయం, తరచుగా దేశాంతరం వెళ్ళవలసి రావటం వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాలలో మౌనం చాలా శుభప్రదంగా ఫలిస్తుంది. గృహనిర్మాణ, శుభకార్య ప్రయత్నాలకు మంచి సూచనలు, సలహాలు అందుతాయి. చతుష్పాద జంతువుల ద్వారా చికాకులు రాగలవు. తరచుగా ప్రయాణంలో ఆటంకాలు ఎదురవుతాయి. అధికారులను, ప్రభుత్వంలో పెద్దలను కలుసుకుంటారు. వ్యాపారాల్లో అనవసర పోటీలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారులకు సంవత్సరం అంతా శ్రమ ఒత్తిడి ఉంటుంది. అయినా, కాలం కలసివస్తుంది. ఉద్యోగులకు అధికారులతో పాటు తోటివారి సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రమోషన్ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆరోగ్య విషయంలో పెద్ద ఇబ్బందులు ఉండవుగాని, శని, గురువుల ప్రభావం వల్ల మే జూన్ నెలల్లో తరచుగా ఉష్ణప్రకోపానికి లోనవడం, పాత రుగ్మతలు పునరావృతం కావడం వంటివి ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలుకు మే, జూన్ మాసాలలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు వేగంగా సాగుతాయి. మిత్రులు సహకరిస్తారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు సునాయాసంగా సాధ్యపడతాయి. షేర్ వ్యాపారులకు ఫైనాన్స్ వ్యాపారులకు కాలం అనుకూలంగా ఉన్నా, దూకుడుగా వ్యవహరించరాదు. విద్యార్థులకు శ్రమ చేసే కొద్దీ మంచి ఫలితాలు అందుతాయి. పోటీ పరీక్షలలో రాణిస్తారు. రైతులకు మంచి ఫలితాలు దక్కుతాయి. గర్భిణీస్త్రీలు నిత్యం అనవసర ఆలోచనలు చేస్తూ ఉంటారు. అయితే ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. మఘ నక్షత్రం వారికి హామీలు నిలబెట్టుకోలేని స్థితి వుంటుంది. ప్రయాణాల్లో చికాకులు, వాహనాల రిపేర్ల కారణంగా అధిక ఖర్చులు వుంటాయి. ప్రతిపనీ ఆలస్యమవుతుంది. ఖర్చులు అధికంగా ఉన్నా, చివరకు కొంతలాభం పొందుతారు. బంధుమిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్తపడాలి. పుబ్బ నక్షత్రం వారికి అంతా ఆలస్యమయంగా ఉంటుంది. ఈ నక్షత్ర గర్బిణిలు చాలా చికాకులు పొందే అవకాశం వుంటుంది. ఈ సంవత్సరం ఎప్పుడు అవకాశం కుదిరితే అప్పుడే పనులు త్వరగా పూర్తి చేసి లాభాలు అందుకోవాలని మీరు చేసే ప్రయత్నాలు చాలా తేలికగా సత్ఫలితాలనిస్తాయి. ఉత్తరా నక్షత్రం వారికి తరచుగా విశ్రాంతి తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది. అనవసర బాధ్యతలు పెరుగుతాయి. అందరికీ ఉపయోగపడే పనులు చేయడంలో ఎక్కువగా శ్రమిస్తారు. తరచుగా పూజ్యులను, పెద్దలను, ప్రభుత్వ పదవుల్లోని పెద్దలను దర్శించుకోవడం జరుగుతుంది. శాంతి: నాలుగు ముఖాల రుద్రాక్ష ధరించడం ద్వారా ప్రశాంతత ఏర్పడుతుంది. మే మొదటివారంలో శని జపం చేయించండి. ప్రతిరోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి, లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసినట్లయితే ప్రశాంతత లభిస్తుంది. ఏప్రిల్: ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఏ పని ప్రారంభించినా, పూర్తయ్యేదాకా చాలా దక్షతతో వ్యవహారిస్తారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. ఆదాయ వ్యయాల మీద పట్టు సాధిస్తారు. ఆరోగ్య విషయమై శ్రద్ధ పెంచాలి. ద్వితీయార్ధంలో శనికి జపం చేయించండి. ఎవరి మీద ఆధారపడవద్దు. మే: అన్ని అంశాల్లోనూ తెలియని అసంతృప్తి ఉంటుంది. పనులు వేగంగా సాగవు. కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయ, వ్యయాలు నియంత్రణలో ఉండవు. బంధువుల రాకపోకలు ఎక్కువ అవుతాయి. వృథా కాలక్షేపాలు, వృథా ప్రయాణాలు, వృథా ఖర్చులు ఉంటాయి. పెద్దల ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. జూన్: పనులకు అవాంతరాలు అధికమవుతాయి. దేశాంతరం వెళ్ళాలనే కోరిక ఎక్కువ అవుతుంది. ఋణాలు ఇచ్చి పుచ్చుకునే ప్రకరణంలో అవమానాలకు అవకాశం ఉంది. స్థానచలన, ప్రమోషన్ ప్రయత్నాల్లో జాగ్రత్తలు అవసరం. బంధుమిత్రుల రాకపోకల విషయంలో అధిక జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక వ్యవహారాలను స్వయంగా చూసుకోండి. జూలై: చాలా అద్భుతమైన గోచారం అనే చెప్పాలి. సమయం వృథా చేయకుండా నడుచుకుంటే, అంతా ఆనందదాయకంగా ఉంటుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రధానంగా వృత్తి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రతి విషయంలోనూ కుటుంబ సభ్యుల సహకారం అద్భుతంగా ఉంటుంది. ఆగస్టు: సమస్యలు ఉన్న పనులను వదిలేసి, సమస్యలు లేని పనులు చేయడం ద్వారా కొంత సుఖపడతారు. అయితే పని ఎగవేసే ధోరణి సరి కాదని గమనించుకోండి. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అందరితోనూ స్నేహపూర్వకంగా మెలగాలి. పనిముట్ల వాడకం ఇబ్బందికరం. ప్రయాణ చికాకులు ఎక్కువ. సెప్టెంబర్: పనుల ఎగవేత ధోరణిని విడనాడాలి. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం ఎదురైనా, ఫలితాలు సానుకూలంగానే ఉంటాయి. ప్రతి విషయంలోనూ ధనవ్యయం అధికం అవుతుంది. సరైన సమయానికి డబ్బు వెసులుబాటు కాదు. అయితే ఋణ విషయాలు, ఖర్చులు, ఈ నెలలో కొంత చికాకు కలిగిస్తాయి. అక్టోబర్ : ప్రారంభంలో కొన్ని ఇబ్బందులున్నా క్రమంగా అన్నీ తీరిపోయి మంచి ఫలితాలు వస్తాయి. 15వ తేదీ తరువాత వృత్తి సౌఖ్యం చాలా బాగుంటుంది. చాలా తెలివి ప్రదర్శిస్తారు. ఆర్థిక విషయాలలో చికాకులను క్రమంగా పరిష్కరించుకోగలుగుతారు. ఈ నెలలో స్నేహితులు బంధువుల సహకారం బాగుంటుంది. నవంబర్: మాసారంభం నుంచి చక్కటి ఫలితాలు ఉంటాయి. అన్ని గ్రహాలు ఈ నెలలో అనుకూలిస్తాయి. శుభకార్యాలు త్వరగా నెరవేరుతాయి. ఉద్యోగ భద్రత బాగుంటుంది. అందరూ బాగా సహకరిస్తారు. పుణ్యకార్యాలు చేస్తారు. గురువులను, పూజ్యులను దర్శించుకుంటారు. ప్రశాంతంగా కాలం గడిచిపోతుంది. డిసెంబర్: చాలా చక్కటి కాలం. అన్ని పనులూ చక్కగా పూర్తయి, ఆనందంగా ఉంటారు. డబ్బు వెసులుబాటు బాగుంటుంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు. అందరి నుంచి మంచి సహకారం లభిస్తుంది. గత ఆరోగ్య సమస్యలకు ఈ నెలలో వైద్య సహాయం లభిస్తుంది. పుణ్యక్షేత్రాలను, గురువులను దర్శించుకుంటారు. జనవరి: వృత్తి విషయాల్లో ఒత్తిడి, కార్యాలస్యం వుంటాయి. అయినా ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ప్రధానంగా ఈ నెలలో కుటుంబ సమస్యల మీద దృష్టి ఉంచండి. డబ్బు వెసులుబాటు కొంత ఇబ్బందికరమే అయినా, తెలివిగా ఖర్చులను సానుకూలం చేయగలుగుతారు. ప్రశాంతంగా ఉంటారు. ఫిబ్రవరి: అన్ని అంశాల్లోనూ జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మితభాషణ, ఓర్పు చాలా అవసరం. కలహాలు రాకుండా మాటతీరు సరిచూసుకోవాలి. అవమానకర ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తపడండి. ఇతరుల విషయాల్లో కలగజేసుకోకండి. మీ పనులు మీరు స్వయంగా చేసుకునేటట్లయితే కొంతవరకు సమస్యలు దూరమవుతాయి. మార్చి: ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు ఉంటాయి. ఆదాయ వ్యయాలు సమతూకంగా ఉండవు. అయినా ధైర్యంగా ఉంటారు. వృత్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి. రవి సంచారం అనుకూలం లేకపోవడం, గురు, శని సంచారం కూడా సరిగా లేని కారణంగా అన్ని అంశాల్లోనూ ఓర్పుతో మెలగవలసిన అవసరం ఉంది. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
లియో... ద రోబో డ్రోన్
ఎగిరే డ్రోన్స్ మాత్రమే ఇప్పటివరకు చూసుంటారు. తాడుపై సర్కస్, స్కేట్ బోర్డుపై ఫీట్లు చేసే కొత్త డ్రోన్ వచ్చేసింది. సెంటర్ ఫర్ అటానమస్‌సిస్టమ్స్ అండ్ టెక్నాలజీస్ (కాస్ట్) బృందం తయారుచేసిన ఈ రోబో డ్రోన్ పేరు లియోనార్డో... (లెగ్స్ ఆన్‌బోర్డ్ డ్రోన్). ముద్దు పేరు లియో. రెండు కాళ్లు కలిగి, రెండున్నర ఫీట్ల పొడవున్న ఈ రోబోడ్రోన్ తాడుపై నడవడమే కాదు... స్కేటింగ్ కూడా చేయగలదు. అవసరం ఉన్న చోట సాధారణ డ్రోన్ మాదిరిగానే ఎగురుతుంది. సెకనుకు 20 సెంటీమీటర్ల దూరం నడుస్తుంది. రెండు కాళ్లకు ఉన్న హైబ్రిడ్ మూవ్మెంట్ వల్ల ఒక చోటు నుంచి మరో చోటుకి సులభంగా కదులుతుంది. ఎగురుతుంది. మెట్లు కూడా ఎక్కగలుగుతుంది. సాధారణ డ్రోన్ ఆపరేటింగ్ కష్టమైన పరిస్థితుల్లో సైతం ఈ డ్రోన్ సునాయాసంగా పని చేయగలుగుతుందని చెబుతున్నది బృందం. ‘‘ఆకాశంలో ఎగురుతూ, నేల మీద నడుస్తూ తమ అవసరాలకనుగుణంగా కదిలే పక్షులే మాకు స్ఫూర్తి. ఎగిరే డ్రోన్లకు కొన్ని పరిమితులున్నాయి. విద్యుత్ వినియోగం ఎక్కువ. కానీ లియో అలా కాదు. పరిస్థితులకు అనుగుణంగా దాని మోడ్‌ను మార్చుకుంటుంది. జెట్సూట్ వేసుకున్న మనిషి భూమి మీద వాలేప్పుడు, ఎగరడానికి ముందు కాళ్లను నియంత్రించినట్టుగానే ఈ రోబో డ్రోన్ సైతం నియంత్రిస్తుంది. హై వోల్టేజ్ లైన్ల తనిఖీ, అంతరిక్ష కేంద్రంలోని వివిధ భాగాల మరమ్మతుల వంటివి చాలా ప్రమాదంతో కూడుకున్నవి. అలాంటి వాటిని సైతం లియో ఒక్కటే చేసేస్తుంది’’అని ఆ బృందానికి నాయకత్వం వహిస్తున్న ప్రొఫెసర్ సూన్ జో చుంగ్ తెలిపారు. అయితే మార్కెట్లోకి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? దాని ధర ఎంత అనే విషయాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఇంకా పయ్రోగ స్థాయిలో ఉన్న ఈ రోబో... తయారీ కోసం ఏదైనా కంపెనీ ముందుకొస్తే త్వరలోనే అందుబాటులోకి వస్తుంది. -
ఐఫోన్ 13లో సరికొత్త ఆప్షన్.. ఆపదలో ఆదుకునేలా!
సరికొత్త ఫీచర్లతో టెక్ యూజర్లను ఆకట్టునేలా ఫోన్లను తీసుకువచ్చే యాపిల్ కంపెనీ ఈ సారి మరో కొత్త ఆప్షన్‌తో ముందుకు రానుంది. ఈ నెలాఖరుకల్లా మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్న ఐ ఫోన్ 13ని ఆపదలో ఆదుకునే పరికరంగా కూడా ఉపయోగపడేలా డిజైన్ చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. ఎమర్జెన్సీ ఎస్సెమ్మెస్ యాపిల్ సంస్థ నుంచి త్వరలో మార్కెట్‌కి రాబోతున్న ఐఫోన్ 13లో ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నట్టు సమాచారం. మారుమూల ప్రాంతాలు, రిమోట్ ఏరియాలు, దట్టమైన అడవులు, సముద్ర ప్రయాణాలు చేసే సమయంలో నెట్వర్క్ పని చేయని సందర్భంలో ఇతరులతో కమ్యూనికేట్ అయ్యేలా ఈ ఫీచర్ పని చేస్తుందని బ్లూమ్‌బర్గ్ టెక్ నిపుణుడు మార్క్ గుర్మన్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫోన్లలో అత్యవసర సమయంలో ఎస్‌వోఎస్ మేసేజ్‌లు చేసే వీలున్నా ఇవన్నీ పరిమితంగానే పని చేస్తాయి. యాపిల్ అందించే ఎమర్జెన్సీ ఫీచర్లో తమ చుట్టు ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఎస్ఎమ్మెస్లను పంపే వీలుంటుంది. దీని వల్ల ఎమర్జెన్సీ మెసేజ్ రిసీవ్ చేసుకున్న వారు మరింత మెరుగ్గా స్పందించే వీలు కలుగుతుంది. లియో ఆధారంగా ఇంటర్నెట్, మొబైల్ నెట్వర్క్ రంగంలో భవిష్యత్తు టెక్నాలజీగా చెబుతున్న లో ఎర్త్ ఆర్బిన్, లియో (LEO) ఆధారంగా ఈ ఎమర్జెన్సీ మెస్సేజ్ పని చేస్తుందని చెబుతున్నారు. మొబైల్ నెట్వర్క్ పని చేయని చోట తక్కువ ఎత్తులో ఉండే శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగా ఫోన్‌ను ఉపయోగించుకునే వీలు ఉంటుంది. అయితే ఈ టెక్నాలజీ పరిమితంగా కొన్ని దేశాల్లోనే అందుబాటులో ఉంది. అక్కడ మాత్రమే ఈ ఎమర్జెన్సీ ఎస్ఎమ్మెస్ ఫీచర్ పని చేస్తుంది. ప్రస్తుతం అనేక సంస్థలు లియో టెక్నాలజీని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నాయి. ఇండియాలో టాటా , ఎయిర్టెల్ సంస్థలు లియో టెక్నాలజీలో పెట్టుబడులు పెట్టాయి. ఆ ఫీచర్ ఇప్పుడే కాదు ఐ ఫోన్ 13 లియో టెక్నాలజీ ఆధారంగా పని చేస్తుందని, మొబైల్ నెట్‌వర్క్‌తో పని లేకుండానే కాల్స్, మేసేజ్ చేసుకోవచ్చనే వార్తలు మొదటగా వచ్చాయి. అయితే లియో టెక్నాలజీ ఆధారంగా ఫోన్లు తయారు చేసేందుకు అవసరమైన హార్డ్‌వేర్ ఇంకా భారీ స్థాయిలో అందుబాటులోకి రాలేదు, పైగా అన్ని దేశాల్లోనూ లియో టెక్నాలజీ కమర్షియల్ స్థాయిని అందుకోలేదు. దీంతో లియో టెక్నాలజీని తెచ్చేందుకు సమయం పడుతుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. యాపిల్ సొంతంగా టెక్నాలజీ రంగంలో సరికొత్త ఆవిష్కరణలు చేసే యాపిల్ సంస్థ లియో పైనా కన్నేసింది. అయితే ఇతర సంస్థలకు చెందిన శాటిలైట్లను ఉపయోగించుకోవడానికి బదులుగా తానే స్వయంగా రంగంలోకి దిగే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంటున్నారు. అందువల్లే ఐఫోన్ 13లో లియో టెక్నాలజీ వాడలేదని చెబుతున్నారను. కానీ యాపిల్ సంస్థ ఇంటర్నల్ మార్కెట్ స్ట్రాటజీ ప్రకారం లియో ఆపరేషన్స్ సొంతంగా చేసే అవకాశం ఉందని అంటున్నారు. చదవండి: టెక్ దిగ్గజం ఆపిల్‌ను దాటేసిన షియోమీ -
సిమ్‌కార్డ్, నెట్‌వర్క్‌లతో పని లేదు... ఆపిల్ నుంచి సరికొత్త టెక్నాలజీ?
టెక్నాలజీ వరల్డ్‌లో అనేక నూతన ఆవిష్కరణలకు కేరాప్ అడ్రస్‌గా యాపిల్ నిలిచింది. ఏదైనా ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తెచ్చిందంటే మిగిలిన కంపెనీలన్నీ ఆ బాటలోనే నడుస్తాయి. మెటల్ బాడీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, టాప్‌నాచ్ ఒకటేమిటి ఇప్పుడు పాపులర్ ఫీచర్లలో సగానికి పైగా యాపిల్ వల్లే ట్రెండింగ్‌లో ఉన్నాయి. వాటన్నింటిని మించి మరో పాత్ బ్రేకింగ్ ఫీచర్‌ని యాపిల్ అందుబాటులోకి తేనుందని మార్కెట్ వర్కాలు అంటున్నాయి. లియోతో మార్పులు ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న మొబైల్ ఫోన్లు అన్నీ కూడా నెట్వర్క్ ఆధారంగా పని చేస్తున్నాయి. 2జీ మొదలుకుని ఇప్పుడు ఎల్టీఈ (లాంగ్‌టర్మ్ ఎవల్యూషన్), 5జీ వరకు వచ్చాం. శాటిలైట్ తరంగాల ఆధారంగా ప్రత్యేక ఫ్రీక్వెన్సీలో ఈ నెట్‌వర్క్‌లు పని చేస్తున్నాయి. అయితే వీటిని మించేలా భవిష్యత్తులో లియో నెట్‌వర్క్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. దీని ద్వారా లియో టెక్నాలజీలో సిమ్‌తో అవసరం లేకుండా నేరుగా హ్యండ్‌సెట్ ద్వారానే ఇటు కాల్స్, అటు డేటాకు సంబంధించి మరింత మెరుగైన కమ్యూనికేషన్ కొనసాగించవచ్చు. ఐఫోన్ 13తో మొదలు ? లియో టెక్నాలజీని ముందుగా అందిపుచ్చుకునేందుకు యాపిల్ అడుగులు వేస్తోంది. త్వరలో రిలీజ్ చేయబోతున్న యాపిల్ 13 మోడల్ లియో ఆధారంగా పని చేసే అవకాశం ఉందని మార్కెట్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే మొబైల్ ఆపరేటర్‌కు ప్రస్తుతం చెల్లిస్తున్నట్టుగా ప్రత్యేకంగా ఏమైనా రీఛార్జీలు ఉంటాయా? లేక హ్యండ్‌సెట్ ధరలోనే అఅన్నీ పొందు పరుస్తారా అనే అంశంపై చర్చ జరుగుతోంది. ఈ మేరకు బ్లూమ్‌బర్గ్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి యాపిల్ నుంచి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. లియో అంటే నెట్వర్క్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ప్రస్తుతం భూ వాతావరణం ఆవల ఉన్న శాటిలైట్లను ఉపయోగిస్తున్నారు. ఇకపై వాటితో సంబంధం లేకుండా భూమి నుంచి కేవలం 500 కి.మీ ఎత్తులో ఉండే లో ఎర్త్ ఆర్బిట్ (LEO) శాటిలైట్లను మొబైల్ కమ్యూనికేషన్ కోసం ఉపయోగించుకోబోతున్నారు. దీని కోసం లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్లను ప్రయోగించేందుకు బడా సంస్థలు పోటాపోటీగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆమెజాన్, ఎయిర్టెల్ , స్పేస్ఎక్స్,, టాటా, టెలిశాట్ వంటి కంపెనీలు ఈ పనిలో బిజీగా ఉన్నాయి. ఈ టెక్నాలజీ 90వ దశకం నుంచి అందుబాటులో ఉన్నా ప్రపంచ వ్యాప్తంగా ఇటీవలే వాణిజ్య అవసరాలకు ఉపయోగించుకునేలా అనుమతులు జారీ అవుతున్నాయి. ప్రభుత్వం తరఫున భారత్ బ్రాడ్‌బ్యాండ్ నిగమ్ లిమిటెడ్ సైతం ఇదే టెక్నాలజీపై ఆధారపడి పని చేయనుంది. చదవండి: సెల్‌ఫోన్ టవర్లు, కేబుళ్లు కనుమరుగు కానున్నాయా..! -
గగన్‌యాన్ మిషన్ మరింత ఆలస్యం
సాక్షి, బెంగళూరు: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి ఆర్బిటల్ వ్యోమనౌకలో భారతీయ వ్యోమగాములను పంపనుంది. ఇండియన్ హ్యుమన్ స్పెస్ క్రాఫ్ట్ ప్రొగ్రామ్‌లో భాగంగా 2022 నాటికి భారతీయ వ్యోమగాములతో కూడిన ఆర్బిల్ స్పేస్ క్రాఫ్ట్‌ను కనీసం 7 రోజులు అంతరిక్షానికి పంపించడమే గగన్ యాన్ ప్రయోగం ఉద్దేశమని ఇస్రో తెలిపింది. తాజాగా కోవిడ్ -19 మహమ్మారి కారణంగా భారతదేశపు మొదటి మానవ అంతరిక్ష మిషన్ గగన్‌యాన్ ఒక సంవత్సరం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) అధికారులు తెలిపారు.(చదవండి: దేశీయంగా వ్యాక్సిన్‌కు అనుమతించండి) రెండు మానవ రహిత మిషన్లను డిసెంబర్ 2020, జూలై 2021లో నిర్వహిస్తామని... వ్యోమగాములతో కూడిన మిషన్ ను డిసెంబర్ 2021లో నిర్వహిస్తామని వ్యాఖ్యానించారు. గగన్‌యాన్ మిషన్ అడ్వాన్స్డ్ ట్రైనింగ్ లో భాగంగా ప్రాజెక్ట్ కోసం ఎంపికైన మనుషులకి ఈ మిషన్ ప్రయోగానికి ముందు రెండు అన్‌క్రూవ్డ్ మిషన్లు చేపడుతారు. కానీ "కోవిడ్ కారణంగా ఈ మిషన్ మరింత ఆలస్యం అవుతుంది" అని ఇస్రో చైర్మన్ కె.శివన్ స్పష్టం చేశారు. "మేము వచ్చే ఏడాది చివరలో లేదా తర్వాతి సంవత్సరంలో ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము" అని అతను తెలిపారు. గగన్‌యాన్ మిషన్ లో భాగంగా ముగ్గురు సిబ్బందితో కూడిన వ్యోమనౌకని లోయర్ ఎర్త్ ఆర్బిట్ (LEO)కు కక్ష్యలో ప్రవేశపెట్టడంతో పాటు, మిషన్ తరువాత వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడం గగన్ యాన్ ప్రాజెక్ట్ ముఖ్య లక్ష్యం. బెంగళూరు ప్రధాన కార్యాలయం ఇస్రో గత నెలలో హెవీ లిఫ్ట్ లాంచర్, జిఎస్ఎల్వి ఎంకెఐఐఐని గగన్‌యాన్ మిషన్ ప్రాజెక్ట్ లో భాగంగా ప్రయోగించినట్లు తెలిపారు. జిఎస్ఎల్వి ఎంకెఐఐఐలో హై థ్రస్ట్ సాలిడ్ ప్రొపెల్లెంట్ స్ట్రాప్-ఆన్ బూస్టర్స్ S200 ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. -
వికారినామ సంవత్సర (సింహ రాశి) రాశిఫలాలు
సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. పంచమంలో శని కేతువుల సంచారం, పంచమ, షష్ఠమంలో గురుగ్రహ సంచారం, ఏకాదశంలో రాహుగ్రహ సంచారం, గురు శుక్ర మౌఢ్యమిలు, గ్రహణాలు ప్రధానమైన ఫలితాలు నిర్దేశిస్తున్నాయి. ధైర్యం, సాహసంతో కూడిన నిర్ణయాలు లాభిస్తాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్నవారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. మీ ప్రాధాన్యతను తగ్గించడానికి ప్రయత్నాలు జరిగినా అవి తాత్కాలికమే. మళ్ళీ అనుకున్న స్థానంలోకి రాగలుగుతారు. స్త్రీలతో భేదాభిప్రాయాలు తలెత్తుతాయి. సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి. మీ మంచితనాన్ని అసమర్థతగా భావించిన వాళ్ళు కీలక సమయంలో మీ చేతిలో భంగపడతారు. ప్రభుత్వపరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. కొన్ని ప్రతిష్ఠాత్మకమైన కాంట్రాక్టులు లభిస్తాయి. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థిక పరిస్థితి దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలు పొందగలుగుతారు. ఎంత సంపాదించినా చేతిలో ధనం మిగులదు. సహోదర సహోదరీవర్గంలోని వారికి మీ పరపతి ఉపయోగించి ఉద్యోగం ఇప్పించగలుగుతారు. మీ కుటుంబ బాధ్యతలను విస్మరించరు. అదే మీకు శ్రీరామరక్ష. మీ బంధువర్గంలో పదేపదే మీ నుండి ఆర్థికసాయం ఆశిస్తున్న వాళ్ళు విసిగించడం మొదలుపెడతారు. ఆధ్యాత్మికవేత్తలతో, సాహితీవేత్తలతో, కళారంగాలతో సాన్నిహిత్యం పెరుగుుతుంది. ఆధ్యాత్మిక ప్రపంచంలో మానసిక ఆనందం పొందగలుగుతారు. కొన్ని కార్యక్రమాలు చేపట్టి పలువురి ప్రశంసలు అందుకుంటారు. ఒక గౌరవనీయమైన పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. పరిశోధన రంగుంలోని వారికి అనుకూలంగా ఉంది. మేధావులతో, సామర్థ్యం కలిగిన వారితో విభేదాలు ఏర్పరచుకోకండి. పలుకుబడి కలిగిన కీలకమైన వ్యక్తులను మీవైపు మలచుకోవడంలో విజయం సాధిస్తారు. మీ కీర్తిప్రతిష్ఠలకు మచ్చ రాకుండా జాగ్రత్త వహించండి. వ్యూహ, ప్రతివ్యూహాలను రచించడంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటారు. మీ వైరివర్గాన్ని బోల్తా కొట్టించడానికి మీరు పన్నిన వ్యూహం ఫలిస్తుంది. శుభకార్యాల విషయమై కార్యానుకూలత కోసం గట్టిగా ప్రయత్నిస్తారు, మంచి ఫలితాలు వస్తాయి. వృద్ధులైన తల్లిదండ్రులను ప్రేమగా చూడడం ధర్మమే అవుతుంది. కానీ మీ విషయంలో ఇది పెద్ద అపరాధంలా పరిగణింపబడుతుంది. కుటుంబ విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సంతాన పురోగతి బాగున్నప్పటికీ వాళ్ళలో క్రమశిక్షణ లోపిస్తుంది. అతి గారాబం చెడు తెచ్చిందని భావిస్తారు. ఈ విషయంలో జీవిత భాగస్వామితో వాగ్వివాదాలు ఏర్పడతాయి. నూతన భాగస్వాములతో నూతన వ్యాపారాలు బాగుంటాయి. వ్యాపారంలో నూతన బ్రాంచీలు నెలకొల్పుతారు. ఫైనాన్స్ స్కీములు, లక్కీ డ్రాలు, షేర్లు, కోడిపందాలు, గుర్రపుపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగ్స్, రాజకీయ ఫలితాల బెట్టింగుులకు దూరంగా ఉండడం ఎంతైనా శ్రేయస్కరం. ఋణాలు ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం. పెద్దమొత్త్తంలో ఋణాలు తీసుకుంటారు, తీరుస్తారు. కానీ మీకు రావలసిన ధనం మాత్రం నిలిచిపోతుంది. వెన్నుపోటుదారులు స్నేహితులలోనే ఉన్నారన్న విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. పోటీపరీక్షలలో విజయం సాధించి మంచి ఉద్యోగం పొందుతారు. నామినేటెడ్ పదవులు లభిస్తాయి. కుటుంబంలోనివారి ఆరోగ్య విషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. సిగరెట్స్ కాల్చడం, కాఫీలు, టీలు ఎక్కువసార్లు త్రాగడం, క్రమశిక్షణలేని భోజన సంభవం. దురాలవాట్లకు దూరంగా ఉండండి, మేలు జరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు దక్కుతాయి. ఏమాత్రం శ్రమించని సోమరిపోతులకు కూడా మీతో సరిసమానమైన ప్రతిఫలాలు లభిస్తాయి. ఇది మీకు నిరాశ కలిగించే అంశం. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. వృత్తి ఉద్యోగాలపరంగా సంవత్సర ప్రథమార్ధంలో కొన్ని సాంకేతిక సమస్యలను విజయవంతంగా ఎదుర్కొంటారు. మీ మీద ఆరోపణలు చేసినవారి నిజస్వరూపం బయటపడుతుంది. మీరు చాలామందికి అర్థంకాని మనిషి అవుతారు. అబద్ధాలు, నమ్మకద్రోహం విసుగు కలిగిస్తాయి. మౌనంగా మీ పని మీరు చేసుకుపోతారు. ఎన్నో బాధలను అంతరంగంలో దాచుకుని పైకి నిండుగా నిదానంగా కనిపిస్తారు. విడాకులు, భార్యాభర్తలు విడిపోవటం వంటి సమస్యలు మనోవేదనకు కారణం అవుతాయి. అంతరంగిక చర్చలు, రహస్య విషయాలు బయటకి పొక్కడం వల్ల ప్రయోజనాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. సహచరవర్గం వల్ల, ముఖ్యమైన అధికారుల వల్ల ఈ రకమైన ఇబ్బందులను అధిగమించగలుగుతారు. పోలీసు కేసులు, చిల్లర అభియోగాలతో చట్టపరమైన సమస్యలలో చిక్కుకున్న మీ వారిని రక్షించవలసిన బాధ్యత మీపైన పడుతుంది. మీ పరపతి దుర్వినియోగం అవుతుంది. వేళకు తిండి, నిద్ర కరువవుతాయి. ఇది ఆరోగ్యం మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. ఫాస్ట్ఫుడ్స్, బేకరీల వ్యాపారాలు, హాస్టళ్ళ నిర్వహణ మొదలైనవి మధ్యస్థంగా ఉంటాయి. హోల్‌సేల్ వ్యాపారాలు, సుగంధద్రవ్య వ్యాపారాలు బాగుంటాయి. ఉద్యోగపరంగా సంస్థ నుండి ఒకరిని తొలగించవలసిన పరిస్థితి వస్తుంది. దానికి మీరే బాధ్యులని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. వృత్తి ఉద్యోగాలపరంగా అనవసరమైన బాధ్యతలు నెత్తినపడతాయి. వ్యాపారంలో రొటేషన్ బాగున్నా భాగస్వాముల ప్రవర్తన వల్ల సంస్థకు ఆశించిన లాభాలు రావు. ప్రభుత్వ అధికారులు మీ వైరివర్గం చేతిలో కీలుబొమ్మలుగా మారి మీకు ఇబ్బందులు సృష్టిస్తారు. సహోదర సహోదరీవర్గానికి చెందిన బాధ్యతలు మీ నెత్తినపడతాయి. విద్యార్థినీ విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ విజయాన్ని, మంచి ఫలితాలను పొందుతారు. విదేశాలలో ఉన్న మిత్రులకు, రక్తసంబంధీకులకు మేలు చేస్తారు. వారి డబ్బులతో వారి పేరుమీద ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులైన విద్యావంతులకు తాత్కాలికంగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసినా పోటీపరీక్షలలో విజయం సాధించి, మంచి ఉద్యోగాన్ని సాధిస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, గ్రూపు సర్వీసులకు ఎంపిక అవుతారు. రాజకీయరంగంలో ఉన్నవారికి రాజకీయ నిర్ణయాలు లాభిస్తాయి. కొంతమంది ముఖ్యమైన రాజకీయ నాయకులతో విభేదాలు ఏర్పడినా మీదే పైచేయి అవుతుంది. మీరు సంపాదించిన ఒక పెద్దమొత్తాన్ని అంతరంగిక మిత్రుల వద్ద దాచిపెడతారు. కొంతమందితో తిరగవద్దని కుటుంబసభ్యుల నుండి ఒత్తిడి వచ్చినా స్నేహాన్ని వదులుకోవడానికి సిద్ధపడరు. రాత్రిపూట చేసే దీర్ఘాలోచనలు కలిసివస్తాయి. సహోదర సహోదరీవర్గానికి సహాయ సహకారాలు అందిస్తారు, అండగా నిలుస్తారు. స్త్రీలకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో గౌరవస్థానాలలో ఉన్నవారికి మీ గురించి చెడుగా చెప్పటం జరుగుతుంది. కొన్ని సమస్యలను ఒంటరిగానే ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయ వ్యూహం ఫలిస్తుంది. మొండిధైర్యంతో సమస్యలను దాటుకొని అనుకూల ఫలితాలను సాధిస్తారు. సంతకాలు చేసిన ఖాళీ చెక్కులను ఇంట్లో ఉంచే సంప్రదాయానికి స్వస్తి చెప్పండి. వైరివర్గంతో హోరాహోరీ పోరాటం జరుపుతారు. తుదికంటా పోరాటంలో మీ శక్తియుక్తుల వల్ల మీరు బలపరిచిన వర్గం విజయం సాధిస్తుంది. మీ వల్ల ఉపయోగం పొందిన వారికంటే నష్టపోయిన వారే ఎక్కువగా గుర్తుపెట్టుకుంటారు. ఆహార నియమాలు పాటిస్తారు. చిన్నచిన్న అరోగ్యు సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొన్ని అవమానాలు ఎదురయ్యే పరిస్థితులున్నాయి. వ్యవసాయదారులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వాస్తవాలకు అతీతంగా, ఊహాలోకంలో మీరు తీసుకున్న నిర్ణయాలు సక్రమమైన ఫలితాలను ఇవ్వవు. ఏకపక్ష నిర్ణయాలు కలిసిరావు. ఉత్సాహంగా కొన్ని సామాజిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు లేక వాటి బాధ్యత తీసుకుంటారు. మీరు అభిమానించే వ్యక్తులు అభివృద్ధి చెందుతారు. కొంతకాలం వారు మీకు దూరంగా ఉంటారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాçసంస్థలు ప్రఖ్యాతి వహిస్తాయి. సాంస్కృతిక, క్రీడారంగాలలో ప్రతిభాపాటవాలు గుర్తింపుకు నోచుకుంటాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వయంకృషితో మంచి విజయాలను నమోదు చేసుకుంటారు. ఇతరుల మీద ఆధారపడి జీవించకుండా స్వతంత్రంగా ఉండాలని మీ భావన. ఇందుకు సంబంధించి మీరు చేసే కృషి ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో గట్టి పోటీ ఎదుర్కొనవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. లాభాలు, ప్రయోజనాలు సాధారణంగా ఉంటాయి. సహోదర సహోదరీవర్గానికి ఆర్థికంగా సహాయపడతారు. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉంటాయి. ఋణాలు చేయడం, తీర్చడం వంటివి జరుగుతూ ఉంటాయి. కార్యాలయంలో చిల్లర మల్లర రాజకీయాలు చికాకు కలిగిస్తాయి. ఎంతకష్టపడ్డా గుర్తింపు లభించదు. విలువైన వస్తువుల భద్రతా విషయంలో జాగ్రత్త వహించండి. చాలామందికి మీరు సంపాదిస్తున్న సంపాదన మీద చూపు తప్ప మీ మీద కాదని గ్రహించండి. కళా, సాంస్కృతిక రంగాలలో మంచి గుర్తింపు లభిస్తుంది. అవార్డులు, రివార్డులు లభిస్తాయి. అలంకార సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుుంటాయి.విద్యాసంబంధమైన విషయాలలో గట్టి పట్టుదలతో శ్రమించి అనుకూల ఫలితాలను సాధిస్తారు. మీ వంతు కర్తవ్యాన్ని మీరు సక్రమంగా నిర్వహిస్తారు. ఉద్యోగం సాధించాలన్న పట్టుదల సఫలం అవుతుంది. అయితే కాలేజీలో మీరు అనుకున్న మార్కుల కన్నా తక్కువ వస్తాయి. స్నేహితులలోనూ, బంధువులలోనూ మీ స్థాయిని నిలబెట్టుకుంటారు. మీ చెడు కోరుకునే వారు ఎవరో మీకు బాగా తెలుసు. వాళ్ళకు తగిన విధంగా గుణపాఠం చెబుతారు. విద్యార్థినులకు రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ కలిసి వస్తుంది. వృద్ధులు, పెద్దలు, తల్లిదండ్రులను గౌరవిస్తారు. వారికి కావలసిన సౌకర్యాలను ఏర్పరుస్తారు. కొన్ని విషయాలలో అలుపెరగని ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది. ఫలితాలు ఎలా ఉన్నా కృషిలో మాత్రం లోపం ఉండకూడదని నిర్ణయించుకుంటారు. నామినేటేడ్ పదవి లేదా రాజకీయ పదవి లభిస్తుంది. అన్య భాషలు నేర్చుకోవాలన్న కోరిక నెరవేరుతుంది. మార్షల్ ఆర్ట్స్, డ్రైవింగ్ నేర్చుకుంటారు. సంతాన పురోగతి సంతృప్తికరంగా ఉంటుంది. సంతానానికి మీరు చేసే హితబోధలకు విరుద్ధంగా ఇతరులు సంతానానికి లేనిపోనివి నూరిపోయటం మీ ఆవేదనకు కారణం అవుతుంది. ముఖ్యమైన విషయాలలో భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తాయి. ప్రేమ వివాహల పట్ల మీకున్న భ్రాంతి తొలగిపోతుంది. మీ పేరుమీద ఇతరులు చేసే వ్యాపారాలు లాభిస్తాయి. డాక్టర్లకు, చార్టర్డ్ అకౌంటెంట్లు, మ్యారేజ్ బ్యూరోలు నడిపేవారికి అనుకూల కాలం. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూల కాలం. గైనిక్ సమస్యలు కొద్దికాలం ఇబ్బంది పెడతాయి. చీటీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారం వల్ల నష్టపోతారు. స్వగృహం అనే కల నెరవేరుతుంది. వాహన సౌఖ్య ఏర్పడుతుంది. బ్యూటీపార్లర్లు నడిపేవారికి, వస్త్రవ్యాపారులకు, ప్రభుత్వ సహకారంతో చిన్నచిన్న చేతివృత్తులు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. -
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు
మెల్బోర్న్: 'చెంబులో చేయెందుకు పెట్టావ్?' అనే మాట మనల్ని ఇప్పటికీ నవ్విస్తుంటుంది. సరదాగా మనం కూడా అప్పుడప్పుడు అంటుంటాం. మనలాగే ఆస్ట్రేలియాలో ఓ తండ్రి తన కుమారుడిని ఇలాగే ప్రశ్నించాడు. అయితే చెంబులో అని కాకుండా వెండింగ్ మెషిన్లో చెయ్యెందుకు పెట్టావని. ఆస్ట్రేలియాలో బిస్కట్లు, చాక్లెట్లువంటివాటికి ప్రత్యేక వెండింగ్ మెషిన్లు ఉంటాయి. లోన్ స్డేల్ వీధిలోని ఓ కాంప్లెక్స్ వద్ద బిస్కెట్ల వెండింగ్ మెషిన్ వద్దకు వెళ్లిన లియో అనే నాలుగేళ్ల పిల్లాడు మెషిన్ లోపలికి చేయిపెట్టాడు. దాంతో అది కాస్త ఇరుక్కుపోయింది. ఎంతకీ భయటకు రాకపోవడంతో ఏడ్వడం మొదలుపెట్టాడు. చుట్టుపక్కల ప్రయత్నించారు. ఫలితం లేకుండాపోయింది. ఆఖరికి అగ్నిమాపక సిబ్బంది కూడా వచ్చారు. చివరకు వెండింగ్ మెషిన్‌ను కట్ చేసి ఆరు గంటల తర్వాత అతడి చేతిని భయటకు తీశారు. అతడు చిన్నపిల్లాడు కావడం, బిస్కెట్లు చూసి ఆకర్షణకు లోనై తెలియక లోపల చేయిపెట్టడం వల్ల ఈ సంఘటన జరిగిందని బాలుడి తండ్రి చెప్పాడు. -
చంద్రబింబం: మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. సన్నిహితుల నుంచి ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు ఊరిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మిత్రుల చేయూతతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. కోర్టు వ్యవహార ం ఒకటి అనుకూలంగా పరిష్కారం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక విషయాలు కొంత నిరాశ కలిగించినా క్రమేపీ అనుకూలిస్తాయి. వ్యవహారాలలో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికరంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. పనులలో ఆటంకాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ముఖ్యమైన పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త పనులకు శ్రీకారం. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆర్థికాభివృద్ధి. పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, సోదరులతో ఆనందంగా గడుపుతారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. పారిశ్రామికరంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. రుణయత్నాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) పనులు కొంత నెమ్మదిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. సోదరులు, మిత్రులతో నెలకొన్న వివాదాలు తీరతాయి. ఒక ప్రకటన విద్యార్థులను ఆకట్టుకుంటుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు సామాన్యం. వారం ప్రారంభంలో ఆకస్మిక ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో విందువినోదాలు. వాహన యోగం. స్థిరాస్తివృద్ధి. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా అనుకూలస్థితి. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) అనుకున్న విధంగా డబ్బు అందుతుంది. అరుదైన ఆహ్వానాలు రాగలవు. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సేవలకు గుర్తింపు రాగలదు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనుకోని ప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. -
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. -
చంద్రబింబం ఫిబ్రవరి 2 నుండి 8 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. గౌరవం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులలో విజయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. విద్యార్థులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం. వివాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థి కంగా బాగుంటుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. పరిశోధకులకు గుర్తింపు రాగలరు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఇంటిలో శుభకార్యాలు. బాకీలు అంది అవసరాలు తీరతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పనులు సమయానికి పూర్తి కాగలవు. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. బాధ్యతలు పెరుగుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో కొద్దిపాటి అవరోధాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విదార్థుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులలో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో అనారోగ్యం. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం జనవరి 12 నుండి 18 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) రావలసిన సొమ్ము ఆలస్యంగా అందుతుంది. కొన్ని పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. తరచూ ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆక స్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం. సన్నిహితుల సాయం అందుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. విలువైన వస్తువులు భద్రంగా చూసుకోవాలి. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులు, నిరుద్యోగులకు నిరుత్సాహం. శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. వారం చివరిలో ప్రయాణాలు. తగాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలలో పురోగతి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలం. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. ఇంటిలో విందువినోదాలు. వారం మధ్యలో చికాకులు. రుణ ఒత్తిడులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత హోదాలు. సినీ, టీవీనటులు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలిసిరావు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొనే అవకాశం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశకు గురిచేస్తాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. నిరుద్యోగులకు ఒక ప్రకటన గందరగోళం కలిగిస్తుంది. వారం ప్రారంభంలో ధనలాభం. కుటుంబసౌఖ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరప్రయాణాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. బంధువర్గం నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమ తప్పదు. వారం చివరిలో శుభవార్తలు. ఆర్థిక లాభాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు. కొత్త వ్యక్తులతో పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఒక సమస్య నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. కళాకారులకు సన్మానయోగం. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణయత్నాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి విషయాలలో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం చివరిలో వాహనయోగం. పరపతి పెరుగుతుంది. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఆశయాల సాధనలో అవరోధాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. సినీ, టీవీ కళాకారులకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి విజయాలు సాధిస్తారు. ఖరీదైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. దూరమైన ఆప్తులు లేదా స్నేహితులు మీ దరికి చేరతారు. ఆరోగ్యం కుదుటపడి ఊపిరి పీల్చుకుంటారు. ద్వితీయార్థంలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... భానుప్రియ, నటి పుట్టినరోజు: జనవరి 15 -
చంద్రబింబం డిసెంబర్ 29నుండి జనవరి 04 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు నెరవేరే సమయం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) దూరప్రాంతాల సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉంటాయి. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొందరికి పదవీయోగాలు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనుల్లో జాప్యం తప్పదు. బంధువులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. విద్యార్థులకు గందరగోళం తొలగుతుంది. వారం ప్రారంభంలో శుభకార్యాలకు హాజరవుతారు. ధన, వస్తులాభాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించవచ్చు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సోదరులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిరకాల స్వప్నం నెరవేరతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. బంధువుల నుంచి ధనలాభం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు విధుల్లో ప్రశంసలు పొందుతారు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం. ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... మీ కృషి ఫలించే సమయం. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు, ఇళ్లు సమకూరుతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు. ద్వితీయార్థంలో ఊహించని పురస్కారాలు. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... విద్యాబాలన్, నటి పుట్టినరోజు: జనవరి 1 -
చంద్రబింబం డిసెంబర్ 22 నుండి 28 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. పరపతి పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. సంఘంలో ఎనలేని గౌరవం. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు కనిపిస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శ్రమ ఫలిస్తుంది. నూతన వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో అకారణ వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో ప్రగతి. వాహనయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలు తెలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. పనుల్లో ఆటంకాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సమస్యలు తీరతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులు ర్యాంకులు సాధిస్తారు. వారం చివరిలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. గృహ, వాహనయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కళాకారులకు సన్మానయోగం. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో వివాదాలు. పనుల్లో ఆటంకాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అందుతుంది. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పరపతి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) అవసరాలకు సొమ్ము అందుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. నిర్ణయాలలో తొందరపాటువద్దు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఆస్తి విషయాలలో సోదరులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యభంగం. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. కళాకారులకు ఊహించని పురస్కారాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. పనుల్లో విజయం. ఆరోగ్య సమస్యలు తీరతాయి. వాహన, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలలో నూతనోత్సాహం. విద్యార్థులు అవకాశాలు దక్కించుకుంటారు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... కార్యక్రమాలు ప్రథమార్థంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది. చర, స్థిరాస్తులను సమకూర్చు కుంటారు. విజయాల బాటలో నడుస్తారు. ప్రత్యర్థులు సైతం తోడుగా నిలుస్తారు. అవకాశాలు దగ్గరకు వస్తాయి. ద్వితీయార్థంలో మరింత అనుకూలత. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... సల్మాన్‌ఖాన్ పుట్టినరోజు: డిసెంబర్ 27 -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం : డిసెంబర్ 15 నుండి21 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. వ్యవహారాలు ముందుకు సాగవు. అనారోగ్య సూచనలు. ఒక సమాచారం కొంత ఊరట కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు విధులు. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినీయవు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు.ధనవ్యయం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. సోదరులు, బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు సర్దుబాటు వైఖరితో సాగడం మంచిది. వారం ప్రారంభంలో వాహనయోగం. వస్తులాభాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో కీర్తిప్రతిష్టలు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. విభేదాలు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో విజయం. విద్యార్థులు, నిరుద్యోగులకు నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) వివాదాలు తీరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకర సంఘటనలు ఎదురవుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. ఇంటి నిర్మాణాలు ప్రారంభిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి. వారం ప్రారంభంలో చికాకులు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగులకు మార్పులు జరిగే అవకాశం. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) రావలసిన సొమ్ము ఆలస్యమై ఇబ్బంది పడతారు. ఇంటా బయటా ఒత్తిడులు. బాధ్యతలు పెరుగుతాయి. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. వారం ప్రారంభంలో విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) కొత్త పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఇతరుల నుంచి రావలసిన సొమ్ము సైతం అందుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ, వాహనయోగాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులు లక్ష్యాలు సాధిస్తారు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) నూతన పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు. మీ కార్యదక్షత నిరూపించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులు హోదాలు పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వారం ప్రారంభ ంలో దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. రుణాలు చేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. దూరప్రయాణాలు ఉంటాయి. ఆస్తి వివాదాలు ఏర్పడవచ్చు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. నిరుద్యోగుల యత్నాలు ముందుకు సాగవు. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. కుటుంబసభ్యులతో వివాదాలు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకోవలసిన సమయం. విద్యార్థులకు అసంతృప్తి. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. శుభవార్తలు. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... వ్యవహారాలు విజయవంతంగా పూర్తి కాగలవు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడతారు. కోర్టు కేసు ఒకటి పరిష్కారమవుతుంది. రాబడికి లోటు ఉండదు. సంఘంలో విశేష ఆదరణ. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. వచ్చే జూన్ తరువాత ఆరోగ్య విషయంలో కొంత మెలకువ పాటించాలి. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... తమన్నా పుట్టినరోజు: డిసెంబర్21