చంద్రబింబం డిసెంబర్ 29నుండి జనవరి 04 వరకు | astrology december 29 to january 04 | Sakshi
Sakshi News home page

చంద్రబింబం డిసెంబర్ 29నుండి జనవరి 04 వరకు

Published Sun, Dec 29 2013 3:24 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 AM

చంద్రబింబం డిసెంబర్ 29నుండి జనవరి 04 వరకు

చంద్రబింబం డిసెంబర్ 29నుండి జనవరి 04 వరకు

 మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
 ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు నెరవేరే సమయం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు.
 
 వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
 దూరప్రాంతాల సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉంటాయి.
 
 మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
 ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు.
 
 కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 రావలసిన డబ్బు అంది  అవసరాలు తీరతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.  వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొందరికి పదవీయోగాలు.  వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు.
 
 సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
 పనుల్లో జాప్యం తప్పదు. బంధువులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి.  కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. విద్యార్థులకు గందరగోళం తొలగుతుంది. వారం ప్రారంభంలో శుభకార్యాలకు హాజరవుతారు. ధన, వస్తులాభాలు.
 
 కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,)
 పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించవచ్చు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.  సోదరులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం.
 
 తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.)
 దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.  వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం.
 వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
 పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం.
 
 ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
 బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు.  కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం.
 
 మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
 పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిరకాల స్వప్నం నెరవేరతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 
 కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
 ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం.
 
 మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. బంధువుల నుంచి ధనలాభం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు విధుల్లో ప్రశంసలు పొందుతారు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం.
 
 ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి...
 మీ కృషి ఫలించే సమయం. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు, ఇళ్లు సమకూరుతాయి.  కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు. ద్వితీయార్థంలో ఊహించని పురస్కారాలు.
 
 మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ...
 విద్యాబాలన్, నటి
 పుట్టినరోజు: జనవరి 1
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement