aries
-
Yearly Horoscope: ఈ ఏడాది రాశి ఫలాలు.. పూర్తి వివరాలు
రాశి ఫలాలు- 2023.. పూర్తి వివరాలు మేషరాశి ఈ రాశిలో జన్మించి స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. సులువుగా అవుతాయనుకున్న వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. వైరాగ్యం, వేదాంతం చోటు చేసుకుంటాయి. సంతానం వల్ల ప్రఖ్యాతి లభిస్తుంది. వ్యాపారంలో లాభాలు రొటేషన్ల రూపంలో ఉంటాయి. వాహనం మార్పు చేయాలన్ని ఆలోచనలు బలపడతాయి. సఖ్యతలేని వ్యక్తుల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నాలతో విసిగి పోతారు. ఆదాయ, వ్యయాలు ప్రధానాంశాలవుతాయి. కొన్ని విషయాలలో మొండిగా ప్రవర్తిస్తారు. వస్త్రాలను సౌందర్య సాధక సామాగ్రిని కొనుగోలు చేస్తారు. మీకు మేలు చేకూర్చే ఉత్తర్వులలో జాప్యం చోటు చేసుకుంటుంది. అష్టమూలికా తైలంతో లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇబ్బందులను అధిగమించి, విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. శత్రువర్గంపైన విజయం సాధిస్తారు. విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభకార్యాలు ముడిపడతాయి. జీవితశాయాన్ని నెరవేర్చుకో గలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. ప్రజాసంబంధాలు, రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. పోటీపరీక్షలన్నింటిలో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. ప్రతిరోజూ హనుమాన్ సింధూర్ నుదుటన ధరించండి. రాజకీయాలలో రాణిస్తారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్ ఎగుమతి, దిగుమతికి సంబంధించిన వ్యవహారాలలో కొంత మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలూ, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎటువంటి బెట్టింగ్‌లలో పాల్గొనవద్దు, నష్టపోతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ద అవసరం. ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 1 వృషభ రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు చాలా బాగుంది. ఆర్థికంగా కొంత పురోభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేయడానికి గాను ముందు చూపుతో వ్యవహరిస్తారు. జమాఖర్చులు, పద్దులు రొటీన్ సంతకాల విషయంలో మెలకువగా వ్యవహరించండి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల పరంగా సానుకూల ఫలితాలను సాధించగలుగుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెంపొందుతాయి. ప్రత్యర్థి వర్గంలోని కొందరు మీతో స్నేహ బంధాలను పెంచుకుంటారు. ఈ పరిణామం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. విదేశీ విద్య, ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. వివాహాది శుభకార్యాలలో మీ మాటను అందరూ గౌరవిస్తారు. అనుకోని అవకాశాలు లభిస్తాయి, వాటిని సద్వినియోగం చేసుకుంటారు. మీ వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాలని గట్టి పట్టుదలతో ఉంటారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పూజలలో, శుభకార్యాలలో సుగంధసిద్ధగంధాక్షింతలను ఉపయోగించండి. విలువైన స్థిరాస్థులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. శుభకార్యాలు ముడిపడతాయి, మంచి సంబంధం కుదురుతుంది. సంతానపరమైన విషయంలో కొంత ఇబ్బంది వున్నా, ద్వితీయార్ధంలో సంతానం పరిస్థితి బాగుంటుంది. విద్యారంగంలో పిల్లలు మంచి విజయాలు సాధిస్తారు. వాహనాల విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రజల అభిమానంతో ముడిపడిన వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థికక్రమశిక్షణ బాగా పాటిస్తారు. పూజలలో హరిచందనం ఉపయోగించండి. కళా, సాహిత్య, రాజకీయరంగాలలో రాణిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. మీ జీవితాశయం నెరవేర్చుకుంటారు. సంతానాన్ని క్రమశిక్షణలో పెట్టగలుగుతారు. అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలలో మోసపోయే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఋణాలు ఇవ్వడం తీసుకోవడం తగ్గించండి. ఇటువంటి లావాదేవీలు మీకు అనుకూలించవు. ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 1 మిధున రాశి ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వివాదాస్పద అంశాలు సానుకూల పడతాయి. సంస్థలను విస్తరింప చేసుకునే యత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లేక అనుకూలమైన బదిలీ సూచనలు గోచరిస్తున్నాయి. అయితే మితిమీరిన ఆత్మ విశ్వాసం వల్లచిక్కులు రాకుండా జాగ్రత్తలు వహించండి. వ్యక్తిగత గౌరవానికి విశేష ప్రాముఖ్యతనిస్తారు. మీరు అడక్కుండానే తమకు తాముగా సలహాలు, సూచనలు ఇచ్చే వారు అధికమవుతారు. నిత్యం సిద్ధగంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. పాతఋణాలను చాలా వరకు తీర్చి వేస్తారు. ఏమాత్రం పరిచయం లేని వారి వలన లాభపడగలగడం మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయ, సినీ, కళారంగాలలోని వారికి కాలం అనుకూంగా ఉంది. విద్యాసంబంధమైన విషయాలు, సాంకేతికవిద్యకు సంబంధించిన అంశాలు, గణిత విద్యకు సంబంధించిన అంశాలు బాగున్నాయి. మెడిసిన్ సీటు లభిస్తుంది. సినిమావ్యాపారం కలిసి వస్తుంది. ఫ్యాక్టరీ, దాల్‌మిల్స్, రైస్‌మిల్స్, షుగర్ ఫ్యాక్టరీల వ్యాపార విషయాలు బాగున్నాయి. అక్వారంగంలో, పౌల్ట్రీరంగంలో కలిసిరాదు. ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలు దూరప్రాంతంలో మీరు కోరుకున్న విధంగా లభిస్తాయి. పోటీపరీక్షలోలలో విజయం సాధిస్తారు. కళాసాంస్కృతిక రంగాలలో ఉన్నవారికి కీర్తిప్రతిష్ఠలు, అవార్డులు వస్తాయి. పూజలలో, అభిషేకాలలో జువ్వాదిని ఉపయోగించండి. పలుకుబడి ఉపయోగించి ఈ అవార్డులు సంపాదించారని మీపై దుష్ప్రచారం జరుగుతుంది. స్త్రీ సంతానం పట్ల విశేషమైన ప్రేమతో విలువైన బహుమతులను కొనిస్తారు. ఆహారం విషయంలో నియమాలు పాటించండి. మీ సిద్ధాంతాలకు, అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ప్రయోజనాల పరిరక్షణ కోసం కొన్ని అమలు చేయమని మీ ఆత్మీయవర్గం ఒత్తిడి చేస్తారు. ప్రయోజనాలను వదులుకుంటారు కానీ మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పనీ చేయరు. పనిలో పనిగా మీ వైరీవర్గానికి బెదిరింపు సంకేతాలు పంపిస్తారు. మీరంటే భయం, గౌరవం ఏర్పడే విధంగా పరిస్థితులను మార్చుకుంటారు. ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 2; అవమానం 4 కర్కాటక రాశి ఆదాయం 11; వ్యయం 8; రాజపూజ్యం 5; అవమానం 4 కర్కాటకరాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంటుంది. కార్యా లయాలలో స్వయంకృతాపరాధాలు చోటు చేసుకున్నప్పటికీ చెప్పుకోదగిన ఒడిదుడుకులేవీ ఏర్పడవు. ఆదాయ, వ్యయాలలో సమతుల్యత లోపించకుండా తగు జాగ్రత్తలు తీసుకోగలుగుతారు. పొదుపుపైన దృష్టిని సారిస్తారు. సంతాన పురోభివృద్ధి మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. శుభవార్తాశ్రవణం చేస్తారు. అన్ని అనుకూలంగా ఉన్నప్పటికీ మానసిక సంఘర్షణ చోటు చేసుకుంటుంది. సామాజిక, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులలోని ఒక వర్గంతో సత్సంబధాలను మరింత బలపరచుకుంటారు. మీ సహాయసహకారాలతో ఉన్నతపదవిని అలంకరించిన వారు కీలక సమయంలో కొద్దిపాటి సహాయం మాత్రమే చేస్తారు. మీకు కోపం, ఆశ్చర్యం రెండూ కలుగుతాయి. ఏరు దాటి తెప్పను తగలేసే వ్యక్తులు ఈ సంవత్సరం ఇబ్బంది పెడతారు. మీ మనోవేదనకు కారణం అవుతారు. ఎవరిని నమ్మాలన్న భయం కలుగుతుంది. మెడిసిన్ సీటు వస్తుంది. భగవంతునిపై భారం వేసి చాలా కార్యక్రమాలు చేస్తారు. సర్పదోషనివారణా చూర్ణములో సర్వరక్షా చూర్ణాన్ని కలిపి స్ననం చేయండి (తలస్నానం చేయరాదు). పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. ఉద్యోగం చేసే చోట వాతావరణం కలుషితం అవుతుంది. కుల, మత, వర్గ, ప్రాంతీయ రాగద్వేషాలు చోటు చేసుకుంటాయి. జీవితంలోకి ఆహ్వానిద్దాం అన్న వ్యక్తి కొన్ని కారణాల వల్ల ఆహ్వానించలేడు. కొత్తకొత్త రంగాలలో ఉన్న నైపుణ్యాన్ని తెలుసుకుంటారు. వైద్యవిద్య, సాంకేతిక విద్య, చార్టెడ్ అకౌంటెంట్ ఇలాంటివన్నీ కూడా కలిసొస్తాయి. విదేశీయాన సంబంధిత విషయాలు లాభిస్తాయి. విదేశాలలో ఉద్యోగం చేయాలన్న కోరిక నెరవేరుతుంది. అవివాహితులైన వారికి వివాహప్రాప్తి. సంతానం లేనివారికి సంతానం కలుగుతుంది. గైనిక్ ప్రాబ్లవ్సును అధిగమిస్తారు. సంతానం క్రమశిక్షణ తప్పడం కొద్దికాలం ఆందోళనకు కారణం అవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆర్థికపరిస్థితులు మెరుగుపడతాయి. చాలా శ్రమించి ఎన్నోబాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి వస్తారు. సింహ రాశి ఆదాయం 14; వ్యయం 2; రాజపూజ్యం 1; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా అధికంగా శ్రమించినప్పటికీ అంతంతమాత్రపు ఫలితాలతో సరిపుచ్చుకోవలసి ఉంటుంది. అడ్వాన్స్ ఇచ్చి రిజిష్ట్రేషన్ చేయించుకున్న ఓ ఆస్తి వల్ల పరోక్షంగా లాభపడతారు. కోర్టు కేసులు వాయిదాలలో ఉంటాయి. కొంత ఆత్మనూన్యతాభావానికి లోనవుతారు. ఒక సందర్భంలో స్వయం కృతాపరాధాల వలన తాత్కాలిక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది. శుభవార్తలను వింటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మీ సలహాలు, సూచనలు అందరి మన్ననలు అందుకుంటాయి. ప్రతిరోజూ నుదుటన నాగసింధూరం ధరించండి. పనులలో చురుకుదనం లోపిస్తుంది. ఆధ్యాత్మిక గ్రంధాలను కొనుగోలు చేస్తారు. రాజకీయరంగ ప్రవేశం చేయాలనే ఆలోచనలు బలపడతాయి. కష్టపడి అనుకున్నది సాధిస్తారు. మీరు అనుకున్న పనులు కాస్త అటు–ఇటుగా పూర్తవుతాయి. సాంకేతికవిద్యలో రాణిస్తారు. ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలో సీటు డొనేషన్ ప్రాతిపదికన లభిస్తుంది. ఆర్థికసంస్థలలో పనిచేస్తున్న వారు ప్రతివిషయంలోనూ జాగ్రత్త వహించాలి.ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. బదిలీ వేటు తప్పకపోవచ్చు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. గతంలో చేసినటువంటి పొదుపు పథకాలు ఎంతగానో అక్కరకు వస్తాయి. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. నిర్మాణ సంబంధమైన పనులు చురుకుగా సాగటం వల్ల ఆర్థికపరిస్థితి ఓ దారిన పడుతుంది. లైసెన్సులు, లీజులు పొడిగింపబడతాయి. ఉన్నతాధికారులు, ఉన్నతస్థాయిలో ఉన్న స్నేహితుల వల్ల మేలును పొందగలుగుతారు. కుటుంబంలోని వారి ఆరోగ్యవిషయమై ప్రత్యేక శ్రద్ధ, ఖర్చులు సూచిస్తున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితం కొన్ని సందర్భాలలో లభిస్తుంది. కీర్తిప్రతిష్టలు కూడా దక్కుతాయి. మీకు లభించిన స్థానానికి సంతోషించలేని పరిస్థితిగా పరిణమిస్తుంది. పలురంగాలలో మీరు చేసిన కృషికి, చేస్తున్న కృషికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తాయి. ఈ సంవత్సరం మీ జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారపరంగా భాగస్వాములతో అప్రమత్తంగా మెలగండి. కన్యా రాశి ఆదాయం 2; వ్యయం 11; రాజపూజ్యం 4; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు స్త్రీలకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు సూచిస్తున్నాయి. స్థిరాస్తిని వృద్ధి చేసుకోవడానికి గాను ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఇందుకు గాను అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సానుకూల ఫలితాలను కూడా సాధించగలుగుతారు. అయితే ప్రతివిషయం కొంత నిదానంగా సాగినప్పటికీ తుది ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. జీవిత భాగస్వామితో స్వల్పమైన భేదాభిప్రాయాలను గ్రహస్థితి సూచిస్తోంది, జాగ్రత్తలు వహించండి. వృత్తి, ఉద్యోగాలపరంగా బరువుబాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలను, శుభకార్యాలను నిర్నిఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. క్రయవిక్రయాలు లాభిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీరు ఇతరులకు ఇచ్చిన వాగ్ధానాలను సకాలంలో నిలబెట్టుకోగలుగుతారు. ఆరావళి కుంకుమతో మహాలక్ష్మీదేవిని పూజించండి. రాజకీయంగా కలిసివస్తుంది. పరాయి స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. వృత్తి–ఉద్యోగాలలో మంచి పురోగతి కలిగి ఉంటారు. సాంకేతిక, న్యాయసంబంధిత, యంత్ర సంబంధిత ఉద్యోగ, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. గనుల వ్యాపారం, నూనెల వ్యాపారం లాభిస్తాయి. ప్రింటింగ్, చిట్‌ఫండ్స్ వ్యాపారాలు మధ్యస్థంగా ఉంటాయి. పాడిపరిశ్రమలో నూతన ప్రయోగాలు లాభిస్తాయి. ఎందరికో ఉపాధి కల్పిస్తారు. కుటుంబంలో ఐక్యత, ప్రశాంతత ఉన్నంతవరకూ బైట అన్ని విషయాలను విజయపథంలో నడిపించగలరు. పోటీపరీక్షలలో మీరుపడ్డ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మీవల్ల కాదని అందరూ అనుకున్న సీటు మీకు లభిస్తుంది. అదే కోణంలో మీవల్ల కాదని అందరూ భావించిన కొన్ని కార్యక్రమాలని మీరు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. పూజలలో మరియు ఇంట్లో నాగబంధం అనే కుంకుమను ఉపయోగించండి. లీజులు, లైసెన్స్‌లు, రెన్యువల్స్ మీకు అనుకూలంగా మారుతాయి. జ్యేష్ఠ సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. మొండివాళ్ళను సరైన దారిలో పెట్టవలసిన బాధ్యత మీపై పడుతుంది. ఎంతోకాలంగా సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సంవత్సరం సంతాన ప్రాప్తి కలుగుతుంది. స్వంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. తులారాశి ఆదాయం 14; వ్యయం 11; రాజపూజ్యం 7; అవమానం 7 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంది. ఆర్థికాభివృద్ధిని సాధించడానికి గాను వినూత్నమైన ఆలోచనలు సాగిస్తారు. కార్యరూపంలో కూడా అమలు పరుస్తారు. సమర్ధవంతమైన పనివారిని సమకూర్చుకోవడం వలన వ్యాపారస్తులు లాభపడగలుగుతారు. స్త్రీలతో ఏర్పడ్డ విభేదాలు తొలగి పోవడం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. ఇంట్లోనూ, వ్యాపార ప్రదేశాలలోనూ అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి. స్వగృహ నిర్మాణం అనే కల నెరవేరుతుంది. పాత శత్రువులే నూతన కోణంలో తారసపడతారు, వారిని ఎదుర్కొవలసిన పరిస్థితి ఉంటుంది శత్రువర్గానికి బలమైన అండదండలు ఉండవు, ఇది మీకు లాభించే అంశం. స్త్రీలతో వైరానికి ముందుకు దూకవద్దు. సాధ్యమైనంత వరకు చర్చలు వాయిదా వేయడం, తప్పుకోవడం మంచిది. వివాదస్పద విషయాలన్ని మధ్యవర్తుల సహాయసహకారాలతో, రాజకీయ పరపతితో పరిష్కారం అవుతాయి. మహోన్నతమైన ఆశయాలను అమలు చేసి మంచి ఫలితాలను సాధించడానికి ఉన్నతస్థాయి వ్యక్తులే కాక, సామాన్య జనం వల్ల కూడా సాధించవచ్చు అని నిరూపిస్తారు. సంతాన క్రమశిక్షణ విషయంలో సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడుతాయి. మీ తెలివితేటలతో, నైపుణ్యంతో వాటిని సరిదిద్దగలుగుతారు. మీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాసంస్థలు, మీ వ్యాపారాలు విస్తరణ చెందుతాయి. ఆరావళి కుంకుమ, లక్ష్మీచందనంతో మహాలక్ష్మీదేవికి పూజ చేయండి. విద్యారంగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. మంచి మార్కులు వస్తాయి. పోటీపరీక్షలలో విజయం సాధించినా, ఇంటర్వ్యూలలో మాత్రం చేదు అనుభవాలు ఎదురవుతాయి. ఎట్టకేలకు మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. స్వయం శక్తితో కష్టించి ఉద్యోగం సాధిస్తారు. స్వయంశక్తితో స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన విషయాలలో ఆశాభంగం కలుగుతుంది. క్రీడా సాహిత్య సాంస్కృతిక రంగాలలో మంచి రాణింపు ఉంటుంది. ఖచ్చితమైన ఆదాయమార్గం దొరుకుతుంది. వృశ్చిక రాశి ఆదాయం 5; వ్యయం 5; రాజపూజ్యం 3; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం బాగుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఊరట కలిగించే పరిణామాలు చోటు చేసుకుంటాయి. శ్రమకు తగిన ప్రతిఫం ప్రతిపనిలోనూ ఎంతోకొంత అంది వస్తుంది. మంచి వ్యక్తిగా ముద్రవేసుకోవడానికి అన్ని రకాలుగా కృషి చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్నేహితులను కలుపుకుని నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనే మీ ఆలోచనలకు కార్యరూపాన్ని ఇవ్వగలుగుతారు. నాగసింధూరం ప్రతిరోజూ నుదుటన ధరించడం వలన నరదిష్టి, నరఘోష తొలగిపోతుంది. జీవిత భాగస్వామి సలహాలను, సంప్రదింపులను పాటిస్తారు. సమాజంలో మీ ప్రతిష్ఠ పెంచే విధంగా ఓ మంచి అవకాశం వస్తుంది. ఉన్నత ఉద్యోగం లభిస్తుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. సంతానపరంగా చిక్కులు ఏర్పడినా వాటిని అధిరోహించగలుగుతారు. సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. ఇందుకు సంబంధించి రుణాలు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతంది. అడిగి అడగకుండానే ఋణాలు లభిస్తాయి. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. పేరుప్రఖ్యాతులు, దూరప్రాంతం నుండి ఆర్థిక సహాయం లభిస్తాయి. వీలైనంత వరకు వివాదాలకు, వివాదస్పద చర్చలకు దూరంగా ఉండండి. అనువంశిక ఆస్తుల విషయమైన డాక్యుమెంట్స్‌లో ఉన్న విషయాలు అస్పష్టంగా ఉండడంతో విభేదాలకు, వివాదాలకు దారితీస్తుంది. డాక్యుమెంట్స్‌లో స్పష్టత ఉండదు, ఇదీ సమస్య. చెవి, ముక్కు, గొంతు సంబంధమైన అనారోగ్యాలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలలో అయినవాళ్ళను, బంధువులను దూరంగా ఉంచి లాభపడతారు. ఆర్థిక ప్రయోజనాలను బంధుత్వాలను వేరువేరుగా చూస్తారు. సాంకేతికపరమైన విద్యారంగంలో రాణిస్తారు. అత్యున్నత సాంకేతిక విద్యను అభ్యసించడానికి అవకాశాలు కలిసివస్తాయి. సినీ,కళా, పరిశ్రమలో ఉన్నవారికి పరిస్థితులు అంత అనుకూలంగా ఉన్నాయి. ధనుస్సు రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 6; అవమానం 3 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలక ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యత బాగున్నప్పటికీ కార్యాలయాలు, వ్యాపార కేంద్రాలలో స్వల్పమైన ఒడిదుడుకులేర్పడతాయి. సమస్యలు పరిష్కారానికి గాను చేసే చర్చలు చర్చలుగానే మిగులుతాయి. నిర్మాణాత్మక వ్యవహారాలలో స్వల్పమైన పురోభివృద్ధి కనబడుతుంది. సంతాన విషయమై ప్రత్యేక శ్రద్ధ కనబరచవలసి వస్తుంది. జీవితశాయం నెరవేర్చుకోవడానికి మీరు చేసే ప్రతిప్రయత్నం సఫలీకృతమవుతుంది. స్వగృహ యోగం ఏర్పర్చుకోగలుగుతారు. నూతన వ్యాపారం మొదలుపెట్టడం కోసం మీరు చేసే ప్రయత్నాలు మంచిఫలితాలను ఇస్తాయి. వ్యాపారాభివృద్ధి కోసం మీరు ప్రయత్నాలు, ప్రయాణాలు సఫలీకృతమవుతాయి. నూతనమైన అగ్రిమెంట్స్‌ను చేసుకుంటారు. కాంట్రాక్టులు, బిల్స్, క్లైవ్సు మొదలయినవి మొత్తం చేతికందివస్తాయి. స్త్రీలతో విభేదాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది. దూరప్రాంతయత్నాలు, విదేశాలలో ఉద్యోగ, విద్య యత్నాల కొరకు మీరు చేసే ప్రయత్నాలు రెండవ ప్రయత్నంలో ఫలిస్తాయి. విలువైన వస్తువుల భద్రత గురించి జాగ్రత్త వహించండి. ఇన్సూరెన్స్ సేవలను ఉపయోగించుకోండి. రాజకీయంగా, ఉన్నతస్థానాలలో ఉన్నవారు, ముఖ్యమైన అధికారులు మిమ్ములను ఆదరిస్తారు. వైరివర్గానికి చెందిన రహస్య సమాచారం మీకు తెలుస్తుంది. తద్వారా లాభపడతారు. ప్రింట్ మీడియా వల్ల ఎలక్ట్రానిక్ మీడియా వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. నానారకాలు అరిష్టాలు, చికాకులు పోవడానికి, శత్రుబాధలు, బాధలు నశించడానికి త్రిశూల్‌ని ఉపయోగించండి. ఇది అత్యంత శక్తివంతమైనది. ఆరోగ్యపరమైన విషయాలలో స్వల్ప జాగ్రత్తలు అవసరము. తల్లిదండ్రులతో, పెద్దలతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండండి. ప్రజాసంబంధాలు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలు చేసినా అవి ఫలించవు. నిష్కారణమైన ఈర్షాద్వేషాలు, విమర్శలు ఎదురవుతాయి. అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేస్తారు. అవసరమైన విషయాల మీద దృష్టి సారిస్తారు. మకర రాశి ఆదాయం 11; వ్యయం 5; రాజపూజ్యం 2; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన పురుషులకు, స్త్రీలకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. రాజకీయ నాయకులు, అధికారుల అండదండలు లభిస్తాయి. సమాజం పోకడ మీద నమ్మకం పోతుంది. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడం అత్యంత కష్టమైన పని అవుతుంది. ఆప్యాయతలు, అనుబంధాలు, స్నేహాలు, బంధుత్వాలు ఇవన్నీ డబ్బుల ముందు ఎందుకూ కొరగానివని తెలుసుకుంటారు. సంతాన పురోగతి బాగుంటుంది. సంతాన విద్యా విషయమై శక్తికి మించి ఖర్చు చేస్తారు. కాంట్రాక్టులు, లీజులు మీకు లాభిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులు జ్ఞానచూర్ణాన్ని సేవించడం, సరస్వతీ తిలకాన్ని నుదుటన ధరించడం, మేధాదక్షిణామూర్తి రూపును మెడలో ధరించడం వలన మంచి ఫలితాలు పొందగలుగుతారు. కృషికి తగిన విధంగా ఫలితాలు వస్తాయి. వృత్తి,ఉద్యోగాలపరంగా అభివృద్ధి కనిపిస్తుంది. రావాల్సిన ధనం వసూలు అవుతుంది. అన్యభాషలను నేర్చుకునే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉన్నతవిద్యను అభ్యసిస్తారు. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. ఈ రాశికి చెందిన భార్యాభర్తల మధ్య ఓర్పు, సహనం చాలా అవసరం. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. పరస్పరం అర్థం చేసుకునే పరిస్థితి నెలకొల్పుకోవాలి. ఐ.ఐ.టి, మెడిసిన్, సాంకేతికరంగం, సివిల్ సర్వీస్‌లు, గ్రూప్ సర్వీస్‌లు మొదలైనవి మీకు అనుకూలిస్తాయి. ప్రతివిషయంలోను బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారు. సెల్ఫ్‌డ్రైవింగ్, స్విమ్మింగ్, జ్యోతిష్యం పట్ల ఆసక్తి పెరుగుతుంది. నేర్చుకునే ప్రయత్నాలు చేస్తారు. విదేశాలలో ఉద్యోగ ప్రయత్నాలు వస్తాయి. ఉద్యోగం చేస్తారు. అయితే మానసిక సంతృప్తి ఉండదు. మీరు నిర్ణయం తీసుకుని సంతకం చేసేటప్పుడు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించి సంతకం చేయండి. ఫర్నిచర్ వ్యాపారం, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం, బేకరీలు, హాస్టల్ మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. మ్యారేజ్ బ్యూరోలు నడిపే వారికి కాలం అనుకూలంగా వుంది. చిట్టీల వల్ల, ఫైనాన్స్ వ్యాపారాల వల్ల నష్టపోతారు. కుంభ రాశి ఆదాయం 11; వ్యయం 2; రాజపూజ్యం 5; అవమానం 6 ఈ రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. సమాజంలోని ఉన్నత స్థాయి వారితోటి స్నేహసంబంధాలను బలపరచుకుంటారు. ఒకానొక అనుకూలమైన అధికార పత్రం ద్వారా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ లాభపడతారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ మాటకు వక్రభాష్యాలు చెప్పేవారు అధికమవుతారు. దూరప్రాంత ప్రయాణాలు ఒకే సమయంలో అనేక పనులను సానుకూల పరచుకోవలసి రావడం వంటి అంశాలు వత్తిడికి గురి చేస్తాయి. దైవం మీద భారం వేసి మీ శక్తికి మించి పెట్టుబడులను పెడతారు. సంతాన పురోగతిపై దృష్టి కేంద్రీకరించవలసిన అవసరం ఏర్పడుతుంది. స్త్రీలతో విభేదాలు సంవత్సర ద్వితీయార్థంలో సమసిపోతాయి. పూజలలో, అభిషేకాలలో హరిచందనం ఉపయోగించండి. బంధువర్గంలో, సమాజంలో ప్రతిష్ఠ కాపాడుకోవడానికి చాలా శ్రమిస్తారు. భాగస్వాములు, సన్నిహిత సహచరులు మీ విజయంలో, అభివృద్ధిలో భాగస్వాములు అవుతారు. తెలివిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే వ్యక్తులు దగ్గరవుతారు. వైరివర్గం వల్ల వృత్తి,ఉద్యోగాల పరంగా చికాకులు సంభవిస్తాయి. శుభకార్యాల నిర్వహణకు శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. ఇందుకు సంబంధించి, అంతిమ నిర్ణయాలు చేసే అవకాశం లభించదు. మీ వాదనలను, అభిప్రాయాలను ఆత్మీయులు తిరస్కరిస్తారు. రాజకీయ పదవులకు నామినేట్ అవడం రాజకీయ అధికారగణానికి దగ్గరవ్వడం సంభవం. సౌకర్యవంతమైన వస్తువులను, అధునాతన సామాగ్రిని కొనుగోలు చేస్తారు. ప్రభుత్వపరంగా ప్రైవేట్ పరంగా రావాల్సిన పెండింగ్ బిల్స్ ఓ దారికి వస్తాయి. విలువైన వస్తువులను, గృహాన్ని ఏర్పర్చుకోగలుగుతారు. కొన్ని సందర్భాలలో ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా నైరాశ్యం, నిరాశ, కోపం కలుగుతాయి. వీటిని అదుపులో ఉంచండి. తప్పక దైవానుగ్రహం లభిస్తుంది. విదేశాలలో ఉన్నవారికి గ్రీన్ కార్డు లభిస్తుంది. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా కుటుంబానికి సహాయపడతారు. మీ సంపాదనలో కొంత భాగం దుబారాగా ఖర్చు అవుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. మీన రాశి ఆదాయం 8; వ్యయం 11; రాజపూజ్యం 1; అవమానం 2 ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు, పురుషులకు ఈ సంవత్సరం చాలా బాగుంది. గృహ, నిర్మాణ ఆలోచనలు అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. సంతానంనాకు నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామిక, కళా రంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకూ విశ్రమించరు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. హనుమాన్ వత్తులును అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వలన సమస్యలు కొంత వరకు తీరుతాయి. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. ఇంతకాలం పడ్డ శ్రమ ఫలిస్తుంది. కళా, సాహిత్య రంగాలలో మంచిగా రాణిస్తారు. అవార్డులు, రివార్డులు వస్తాయి. విలువైన బహుమతులు లభిస్తాయి. అనుకూలమైన కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పూజలలో ప్రథమతాంబూలాన్ని వాడండి. పునర్వివాహ ప్రయత్నాలు చేసే వారికి, గ్రీన్ కార్డు కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. జ్యేష్ఠ కుమార్తె విషయంలో ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ జ్ఞాపకశక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడటానికి ఈ జ్ఞాపకశక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసివస్తాయి. కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలని తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్‌గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా మందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయరంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థికభారం తేలికవుతుంది. ప్రభుత్వపరంగా, ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టుతీర్పులు అనుకూలంగా వస్తాయి. -పంచాంగకర్త: శ్రీమతి ములుగు శివజ్యోతి (కీ.శే. శ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి గారి కుమార్తె) సంగ్రహణ: సాక్షి క్యాలెండర్ 2023. -
మేష రాశి ఫలాలు 2022-23
అశ్వని 1,2,3,4 పాదములు (చూ, చే, చో, లా) భరణి 1,2,3,4 పాదములు (లీ, లూ, లే, లో) కృత్తిక 1వ పాదము (ఆ) ఈ సంవత్సరం గురువు ఏప్రిల్ 13 వరకు కుంభం (లాభం)లోను తదుపరి మీనం (వ్యయం)లోను సంచరిస్తారు. శని ఏప్రిల్ 28 వరకు జూలై 12 నుంచి 2023 జనవరి 17 వరకు మకరం (దశమం)లోనూ మిగిలినకాలం అంతా కుంభంలోనూ సంచరిస్తారు. ఏప్రిల్ 12 వరకు రాహువు వృషభం (ద్వితీయం) కేతువు వృశ్చికం (అష్టమం)లోను తదుపరి రాహువు మేషం (జన్మం) కేతువు తుల (సప్తమం)లో సంచరిస్తారు. 2022 ఆగుస్టు 10 నుండి 2023 మార్చి 12 వరకు కుజుడు వృషభం (ద్వితీయం)లో స్తంభనం. మొత్తం మీద ఈ గోచారం సంవత్సరం అంతా ప్రోత్సాహకరంగానే ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉంటాయి. శని మకరంలో ఉన్నప్పటి కంటే కుంభంలో సంచరించే సమయంలో బాగా అనుకూలిస్తాడు. శుభకార్యముల నిమిత్తం తరచుగా ధనవ్యయం అవుతుంటుంది. ఇతరుల మీద ఆధారపడని వారికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైన సలహాలు తీసుకొని, చికాకులు పడుతుంటారు. అందువలన ఈ సంవత్సరం ప్రతిపనీ స్వయంగా చేసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో నష్టాలు ఉండవుగాని, మనస్పర్థలకు అవకాశం ఎక్కువ. ఆర్థిక వనరులు వచ్చే మార్గం చిన్నదిగాను ఖర్చు అయ్యే మార్గం పెద్దదిగా ఉన్న కారణం చేత ఆర్థిక వ్యవహారాల్లో చికాకులు పడతారు. ఎక్కువగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చాలాకాలం పుణ్యకార్యాచరణ లేదా పుణ్యక్షేత్ర సందర్శన మీద దృష్టి ఉంచే అవకాశం ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా పూర్తి అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో నమ్మకద్రోహానికి గురవుతారు. ఉద్యోగంలో స్థానచలన ప్రయత్నాలలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. వ్యాపారులకు సంవత్సరం అంతా హెచ్చుతగ్గులు తప్పవు. లాభాలు తక్కువ. ఉద్యోగాల్లో స్థిరం తగ్గుతుంది. ప్రమోషన్లు దగ్గరకు వచ్చి మిస్ అవుతాయి. మీకు శ్రమకు తగిన లాభం, శ్రమకు తగిన గుర్తింపు అందవు. అధికారుల నుంచి సహకారం తక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా పెద్ద ఇబ్బందులేవీ ఉండవు. అయితే మానసిక రుగ్మతలు ఉన్నవారు తరచుగా యిబ్బందులకు లోనవుతారు. మిగిలిన వారు గురువు వ్యయం దృష్ట్యా స్వల్ప జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటింపకపోతే మోసపోయే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు సరిగా సాగకపోవడం వల్ల నిరుత్సాహ పడతారు. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చాలా ఇబ్బందులతో పనులు పూర్తి అవుతాయి. షేర్ వ్యాపారులకు, ఫైనాన్స్ వ్యాపారులకు ఈ సంవత్సరం మే నుంచి చాలా చికాకులు ఎదురవుతాయి. విద్యార్థులకు విద్యావ్యాసంగం కంటే ఇతర వ్యవహారాలు ఎక్కువై విద్యాభంగం పొందుతారు. రైతులకు శ్రమ ఎక్కువ అవుతుంది. గర్భిణీస్త్రీలు మే నెల నుంచి బహు జాగ్రత్తలు పాటించాలి. ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఎక్కువ. అశ్వినీ నక్షత్రం వారికి శుభపరిణామాలు ఎక్కువ. బాగా కృషి చేస్తారు. వృత్తిపరంగా మంచి ఫలితాలు అందుకుంటారు. జన్మ రాహువు, వ్యయ గురువుల ప్రభావం ఈ నక్షత్రం మీద తక్కువ అనే చెప్పాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అందరికీ సాయం చేస్తూ మంచి ఫలితాలు, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు. భరణీ నక్షత్రం వారికి అనవసర ఆలోచనలు, వృథా కాల క్షేపాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. రాహువు భరణీలో సంచారం వల్ల మానసిక రుగ్మతలు తలెత్తుతాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు వుంటాయి. ధనవ్యయం ఎక్కువగా వుంటుంది. కృత్తికా నక్షత్రం వారు ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభించి, వేగంగా పూర్తి చేసుకుంటారు. అన్ని అంశాలలోనూ అవరోధాలు తొలగుతాయి. ఉద్యోగంలో చికాకులు వుంటాయి. తెలివిగా సరి చేసుకుంటారు. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. పదిమందికీ సాయంచేసి సంఘంలో మంచిపేరు తెచ్చుకుంటారు. శాంతి : ఏప్రిల్ 12 తరువాత రాహు, కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ ప్రదోషకాలంలో శివాలయంలో 11 ప్రదక్షిణలు చేసి దుర్గా సప్తశ్లోకీ 11 సార్లు పారాయణ చేయడం వలన చాలావరకు దుష్ఫలితాలు తొలగుతాయి. పంచముఖ రుద్రాక్షలు ధరించడం శ్రేయస్కరం. ఏప్రిల్: ఆర్థిక వెసులుబాటు తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మంచి పరిణామములు చోటు చేసుకుంటాయి. అలంకరణ వస్తువుల కొనుగోలు, ప్రయణాల కోసం ఖర్చు ఎక్కువగా ఉంటుంది. రాహుకేతు శాంతి చేయించండి. ఉద్యోగం ఒత్తిడితో ఉంటుంది. దైనందిన కార్యకలాపాలు అస్తవ్యస్తంగా ఉంటాయి. మే: క్రమక్రమంగా పని ఒత్తిడి పెరుగుతుంది. శుక్రుడు వ్యయంలో ఉన్న కారణంగా ప్రయాణ అసౌకర్యాలు ఎక్కువ అవుతాయి. అలంకరణ వస్తువులు కొనుగోలు విషయంలో ధనవ్యయం ఎక్కువవుతుంది. అధికారులతో ఒత్తిడి పెరుగుతుంది. అనవసర విషయాల వలన మానసిక చికాకులు ఉంటాయి. కొత్త ప్రయోగాలు ఏమీ చేయవద్దని సూచన. జూన్: సాధారణ స్థాయి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహిస్తారు. కుటుంబ విషయాలు చాలావరకు మంచి ఫలితాలతో ఉంటాయి. ఖర్చులను నియంత్రించగలుగుతారు. ఉద్యోగం, వ్యాపారం అంతా సాధారణ స్థాయి ఫలితాలతో ఉంటాయి. అభివృద్ధిపథంలో ప్రయాణం సాగుతుందనే చెప్పాలి. జూలై: ఎంత లాభదాయకంగా ఉన్నా, లేకున్నా వ్యాపారులు చాలా జాగ్రత్తలు వహిస్తూ వ్యాపారాలు చేయాలి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుంచి తరచుగా చికాకులు వస్తుంటాయి. మితభాషణ మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా ఖర్చులు నియంత్రించలేని స్థితి ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ఆగస్టు: చాలావరకు సానుకూల వాతావరణం ఉంటుంది. కొత్త ప్రయోగాలేవీ చేయవద్దని సూచన. శుభ వార్తలు వింటారు. అందరి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శుభ కార్యాలు, పుణ్యకార్యాల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. సెప్టెంబర్: చాలా ప్రశాంతంగా ఉంటుంది. 15వ తేదీ నుంచి 24 వరకు కాలం మరింత అనుకూలం. అందరూ బాగా గౌరవిస్తారు. ధనవ్యయం అధికంగానే ఉన్నా, అవసరానికి తగిన ఋణం లభిస్తుంటుంది. కుటుంబం, ఉద్యోగం రెండు అంశాలనూ చాలా ఓర్పుగా నేర్పుగా సాగించుకుంటూ ముందుకు వెడతారు. అక్టోబర్: గురు, బుధ, శుక్ర సంచారం అనుకూలం తక్కువ. ప్రయాణాలలో వస్తువులు పోగొట్టుకోవడం జరుగుతుంది. బంధు మిత్రులు కలిసినప్పుడు వ్యవహార విషయాల మీద చర్చలు చేయవద్దు. ఆర్థిక లావాదేవీలు సరిగా సాగవు. అలంకరణ వస్తువుల కొనుగోలులో ధనవ్యయం అధికం అవుతుంది. వృత్తి సౌఖ్యం బాగానే ఉంటుంది. నవంబర్: కనబడుతున్న అన్ని అంశాలూ నిజం కాదు అని గ్రహించండి. ప్రతి విషయంలోనూ స్వయం శోధన అవసరం. ఈ నెలలో వృత్తి వ్యవహారాలు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడితే ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కలహం పెరిగినా వారితోనే ఎక్కువ సమయం కేటాయించండి. డిసెంబర్: క్రమంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు. ప్రతిరోజూ అధిక శ్రమ ఉంటుంది. అయితే శ్రమకు తగినట్లు లాభదాయకంగా ఉంటుంది. ప్రధానంగా మీ విజ్ఞానం మీకు గౌరవం తెచ్చి పెడుతుంది. మిత్రలాభం చేకూరుతుంది. అనుకోని లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, అలంకరణ వస్తువుల కొనుగోలులో ఖర్చు పెరుగుతుంది. జనవరి: శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. వృత్తిరీత్యా ఇబ్బందులు వుండవు. అన్ని వ్యవహారాల్లోనూ మీకు అందరూ సహకరిస్తారు. ధనం వెసులుబాటు బాగుంటుంది. ప్రత్యేక జాగ్రత్తలతో కాలం సానుకూలం చేసుకుంటారు. ఎవరి మీదా ఆధారపడకుండా చేసే పనులు మిమ్మల్ని విజయపథంలోకి తీసుకువెడతాయి. ఫిబ్రవరి: చాలా మంచి కాలం. క్రమంగా ఓర్పుతో సర్వకార్యసాధన చేస్తారు. ప్రధానంగా కుటుంబ విషయంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయి. రాహు, కేతు, గురువులు బాగాలేని ఈ కాలంలో కూడా మిగిలిన గ్రహాల అనుకూలత దృష్ట్యా ఆర్థిక, ఆరోగ్య విషయాలలో మంచి అనుకూలస్థితి సాధిస్తారు. ఋణ సదుపాయం బాగుంటుంది. మార్చి: పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి, కుటుంబ విషయాలకు సమన్యాయం చేయలేక బాగా చికాకుకు గురి అవుతారు. బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా ఏ సలహాలూ తీసుకోవద్దు. ఓర్పు చాలా అవసరం. ఆరోగ్య విషయంలో బహు జాగ్రత్తలు పాటించాలి. ఇతరుల వ్యవహారాల్లోనూ కలుగజేసుకోవద్దని ప్రత్యేక సూచన. మీ జాతకానికి ఈ గోచారాన్ని మీ జ్యోతిషవేత్త ద్వారా అన్వయం చేయించుకోండి. దశ అంతర్దశ ప్రభావానికి, గోచారానికి పోలిక చేసి ఫలితములు తెలుసుకోండి. శ్రీ శుభకృత్ నామ సంవత్సర 2022 – 23: మీ రాశిఫలాలు కోసం క్లిక్ చేయండి.. -
శార్వరి నామ సంవత్సర (మేష రాశి) రాశిఫలాలు
మేషరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికస్థితి బాగున్నప్పటికీ ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు అవసరం అవుతాయి. గృహసంబంధమైన వ్యాపారాలు కొంత నత్తనడకన నడిచినా కొన్ని ప్రాజెక్టులలో లాభాలకు ఇబ్బంది ఉండదు. వెబ్‌సైట్స్ వల్ల లాభపడతారు. సంవత్సర ద్వితీయార్ధంలో మీ అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఆర్థిక ప్రయోజనాల కోసం కొన్ని కార్యక్రమాలు చేస్తారు. ఆఫీస్‌కు సంబంధించి బ్రాంచీలు ఏర్పాట్లు చేస్తారు. పెట్టుబడికి వెనుదిరగరు. కొత్తవారిని నియమిస్తారు. అన్నివిధాలా బాగానే చూసుకున్నా కొంతమంది వ్యక్తులు నిత్యం సణుగుతూనే ఉంటారు. వారివల్ల ప్రయోజనం ఉండదు. అయినా భరించక తప్పదు. ఏ దేవుడికైనా, దేవతకైనా పూజ చేసేటప్పుడు అభిషేకంలో మహాతీర్థం పొడిని ఉపయోగించండి. మీరు ఎంతో రహస్యంగా ఉంచిన మీ వ్యక్తిగత విషయాలు బయటకు పొక్కుతాయి. ఇది మీకు మనస్తాపం కలిగిస్తుంది. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న మీ ఫైళ్ళపై ఉన్నతాధికారులు సంతకాలు చేస్తారు. సంతాన విద్యావిషయాలు, వ్యక్తిగత విషయాలు అన్నీ సాధ్యమైనంతవరకు మీరే దగ్గరుండి చూసుకుంటారు. సంవత్సర ద్వితీయార్ధంలో ఫలితాలు చాలా బాగుంటాయి. కాలమే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతుంది. భగవంతుని సంకల్పం ప్రకారం నడుస్తుందని నమ్మకం కలిగి ఉంటారు. మానసిక దైవారాధన పెరుగుతుంది. మీ ఆలోచనలకు కార్యరూపం ఇస్తున్న ఒక కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటారు. గాలిలో దీపం పెట్టి దేవునిపై భారం వేయరు. కష్టం, అంకితభావం ఈ రెండూ దైవమని నమ్ముతారు. జీవితాశయాన్ని సాధిస్తారు. అఖండ ఖ్యాతి లభిస్తుంది. ఈ సంతోష సంబరాలను మీరు ఆస్వాదించలేరు. నా ఉన్నతిని చూసి గర్వపడే నా ఆత్మీయుడు, సన్నిహితుడు నాకు శాశ్వతంగా దూరమైనప్పుడు ఈ విజయోత్సవాలు, విందులు, వినోదాలు దేనికి? ఎవరు చూసి సంతోషించడానికి? అనే వేదన మనస్సులో చెలరేగుతుంది. ‘నా స్థితిని చూసి కృత్రిమంగా ఆత్మీయతలు చూపే వారు నా హితులా? కాదు అధికారం చుట్టూ తిరిగే ఈ భజనపరులు వీళ్ళు ఎన్నటికీ నా వారు కాదు. నా వాడు పోయాడు, నాకు శాశ్వత దుఃఖాన్ని మిగిల్చాడు. ఇలాంటి ఆలోచనలు తీవ్రమైన మనోవేదనకు కారణం అవుతాయి కొంతమంది విషయంలో. సాధించిన కీర్తిప్రతిష్ఠలు కాపాడుకోవడానికి మరింత శ్రమించవలసి వస్తుంది. ఎక్కడా విశ్రాంతికి తావులేకుండా శ్రమిస్తారు. నమ్మకస్తులైన సహచరవర్గం మీ ఆశయాలు సాధించడానికి మీతో సహకరిస్తారు. మీరు సహకరిస్తున్న ఆప్తులు వెళ్ళిపోతారేమోనన్న దిగులు మనసులో ఉంటుంది. మీరిచ్చే ధనానికి, వారు చేసే శ్రమకు చాలా వ్యత్యాసం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు ఘనంగా నిర్వహిస్తారు. కొన్ని విషయాలపై ఎడతెరపి లేని రాజీలేని చర్యలు చోటు చేసుకుంటాయి. మూర్ఖులను మార్చలేమని గ్రహిస్తారు. కండరాలు, కీళ్ళనొప్పులు బాధిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు తీసుకుని అందరి మెప్పు పొందుతారు. మేధావిగా పేరు వస్తుంది. పైకి శాంతంగా కనిపించినా కటువుగా కనిపించకపోయినా మనస్సులో ఉన్న పగ, ప్రతీకారాన్ని ఎంతో కాలం పోషిస్తారు. అంతర్గతమైన అసహనం, పడినటువంటి పాట్లు జరిగిన అవమానాలు మరిచిపోలేరు. విదేశాల నుండి మీరు కోరుకున్న శుభసమాచారం అందుకుంటారు. కార్యానుకూలతకు కృషితో పాటు లౌక్యం కూడా అవసరమని గ్రహిస్తారు. కనీస లౌక్యం లేకుండా ప్రవర్తించి మీరే విచార పడతారు. లౌక్యం అనే విద్యను ఏ విధంగానైనా సాధించాలన్న పట్టుదల మీలో కలుగుతుంది. దైనందిన జీవితం రొటీన్‌గా ఉండకూడదని మార్పులు చేయాలని నిర్ణయించుకుంటారు. పిల్లల విషయంలో ఒక దిగులు ఆలోచన ఉంటుంది. ఇంట్లోను, వ్యాపార ప్రదేశాలలోను అష్టమూలికా గుగ్గిలంతో ధూపం వేయండి, శుభప్రదం. ఉదర సంబంధ వ్యాధులను నిర్లక్ష్యం చేయవద్దు. గొప్పలు చెప్పుకునే కొందరు స్వార్థపరులు స్థిరాస్తుల విషయంలో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించి భంగపడతారు. పరోపకారం చేసే వారిని మీరు ప్రోత్సహిస్తారు. ఇందువల్ల అనుకోని కొందరు ముఖ్యమైన వ్యక్తులు దగ్గరవుతారు. అడ్డంకిగా మారినటువంటి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు చర్చకు వస్తాయి. స్వయంకృతాపరాధాలు మీ నష్టాన్ని పూరించుకోవడానికి కఠినమైన క్రమశిక్షణతో మిమ్ములను మీరే సరిదిద్దుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త మిత్రులు దూరమవుతారు. పాతమిత్రులు దగ్గరవుతారు. రాజకీయపరమైన విషయాలలో మీ జోక్యం అనివార్యమవుతుంది. ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగాకానీ మీ రాజకీయ ప్రవేశం ఉంటుంది. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తి విలువ పెరుగుతుంది. ఉన్నతమైన ఆశయాలు కలిగిన వ్యక్తితో కలిసి పనిచేయాలనుకునే మీ ఆరాటం ఫలిస్తుంది. సమాజంలో ఉన్నతస్థానంలో ఉన్న వారికి మీ సలహాలు, సంప్రదింపులు అవసరం అవుతాయి. మొండితనంతో ఓ అధికారి ఎంతమంది ప్రముఖులు చెప్పినా మీ ప్రయోజనాలకు అడ్డుపడుతున్న ఆ అధికారికి స్థానచలనం సంభవిస్తుంది. దాంతో మీ సమస్య తీరుతుంది. మీరు కోరుకున్న మంచి ఉద్యోగ అవకాశం లభిస్తుంది. సాఫ్ట్వేర్ రంగంలోని వారికి శక్తిసామర్థ్యాలకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలలో చదువుకోవాలనే మీ కోరిక ఈ సంవత్సరం నెరవేరుతుంది. అంతేగాక విదేశాలలో ఉద్యోగం చేయడానికి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారికి అటువంటి అవకాశాలు లభిస్తాయి. మీ కార్యక్రమాలన్నీ క్రమశిక్షణాయుతంగా, రహస్యంగా ముందుకు సాగుతాయి. తోడబుట్టిన వాళ్ళకు మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా ఆర్థిక సహాయం చేస్తారు. విలువైన భూమిని కొనుగోలు చేస్తారు. కమర్షియల్ ఏరియాలో ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేస్తారు. మీ కొనుగోళ్ళు అన్నీ గోప్యంగా ఉంటాయి. ఉద్యోగంలో బదిలీ వేటు తప్పకపోవచ్చు. అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల మీ బదిలీ ఆగిపోతుంది. విద్యాపరంగా బాగుంటుంది. పోటీపరీక్షలో విజయం సాధిస్తారు. ఒక ముఖ్యమైన వ్యక్తికి మీరు అంతరంగికులు కావడం వల్ల ఆ వ్యక్తి చేసే తప్పుడు పనులకు మీరే కారణం అని వైరివర్గం భావిస్తారు. అయితే వాస్తవరూపంలో ఇది కొంతవరకు మాత్రమే నిజం. పోలీస్ స్టేషన్స్, కోర్టులు, తగాదాలు, వివాదాలు, మధ్యవర్తి పరిష్కారాలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. రుద్రజడ ఉపయోగించండి. పునర్వివాహ ప్రయత్నాలు తృటిలో తప్పిపోతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామిని పూజించడం చెప్పదగిన సూచన. కుటుంబంలో ఐకమత్యం సాధించడానికి మీరు చేసే ప్రయత్నాలు విఫలం అవుతాయి. కొన్ని అన్యాయాలను మీరు నిరోధించలేకపోతారు. ధనం ఒక్కటే శాశ్వతమని భావించిన వ్యక్తులకు మీ ధర్మసూత్రాలు నచ్చవు. సామాజిక పోకడలు మీపై ప్రత్యక్షంగాకానీ, పరోక్షంగా కానీ ప్రభావం చూపుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలపైన వాటి ప్రభావం ఉంటుంది. సమ్మెలు, బంద్‌లు, ఉద్యమాలు వాటి వల్ల కొన్నిసందర్భాలలో లాభపడతారు. కొన్ని సందర్భాలలో నష్టపోతారు. కార్యాలయంలో మీకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు లభిస్తాయి. ఉన్నతాధికారులు మీకు స్వేచ్ఛను ఇస్తారు. దాని వలన దీర్ఘకాలికంగా అన్యాయానికి గురి అవుతున్న వారికి మీ వల్ల న్యాయం జరుగుతుంది. అదేవిధంగా మీ ఉత్తర్వులు వివాదస్పదమవుతాయి. కొందరు కోర్టుకు ఎక్కుతారు. ఇందులో మీకు ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు లేవు గనుక నిశ్చింతగా ఉంటారు. సివిల్ సర్వీస్‌లకు ఎంపిక అవుతారు. మీ ఆధ్వర్యంలో నడిచే విద్యాసంస్థలు, సేవాసంస్థలు పురోగమనంలో ఉంటాయి. ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారికి మంచి కీర్తిప్రతిష్ఠలు, ధనం లభిస్తాయి. మీ పాండిత్యానికి, కృషికి అన్నివిధాలుగా తగిన గుర్తింపు లభిస్తుంది. సిద్ధ గంధం ధరించండి. -
వికారినామ సంవత్సర (మేషం) రాశిఫలాలు
మేషరాశివారికి ఈ సంవత్సరం చాలా బాగుంది. భాగ్యంలో గురు, శని, కేతువుల సంచారం, మూడింట రాహుగ్రహ సంచారం, గురువు భాగ్యదశమ రాశి సంచారం, మూఢమి, గ్రహణాలు ప్రధానౖ ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశివారికి ఆర్థికంగా బాగుంది. ఆరోగ్యం బాగుపడుతుంది. రాజకీయ విషయాలు బాగుండవు. డబ్బులతో అన్నీ సాధించలేమని గుుర్తిస్తారు. మీ వ్యూహానికి ప్రత్యర్థులు అంతకంటే గొప్ప వ్యూహాన్నే రచించి అమలు చేస్తారు. రాజకీయ నిర్ణయాలు అగ్నిపరీక్షలా నిలుస్తాయి. వర్గాన్ని కూడగట్టలేరు. ప్రజాకర్షణ తగ్గుతుంది. గ్రూపురాజకీయాలు ఫలించవు. పోటీపరీక్షల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. మధ్యవర్తిత్వం అంగీకరించరు. ఇందువల్ల ఇరువర్గాలకు దూరమవుతారు. అదే సమయంలో ఇంట్లోవాళ్ళు సన్నిహితమవుతారు. నూతన వ్యాపారం లాభిస్తుంది. స్పెక్యులేషన్, ఎగుమతి, దిగుమతి వ్యవహారాలలో మెలకువ అవసరం. క్రెడిట్ కార్డులు, బ్యాంకు వ్యవహారాలు, పొదుపు డిపాజిట్లు తదితర వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండటం మంచిది. బెట్టింగ్‌లలో నష్టపోతారు. ఇతరుల బరువుబాధ్యతలు మీపై వేసుకోవద్దు. బంధువులకు సహాయం చేయడం వల్ల ఇంట్లో చికాకులు ఎదురవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు అవసరం. వ్యాపారంలో అధునాతనమైన పద్ధతులను అవలంబించి అభివృద్ధి సాధిస్తారు. ప్రభుత్వ ఉత్తర్వులు, కాంట్రాక్టులు మీ అంచనాల మేరకు ఫలిస్తాయి. మీరు కొన్న స్థిరాస్తుల విలువ అనూహ్యంగా పెరుగుతుంది. మీ సంస్థలోని భాగస్వాములు, కార్యాలయంలోని సహోద్యోగులు, ఓర్వలేని వారై ఉంటారు. ఆరోగ్యపరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం. పార్శ్వపు నొప్పి బాధించే అవకాశం ఉంది. ఈఎన్టీ సమస్యలు రావచ్చు. సంవత్సర ద్వితీయార్ధంలో ఆర్థికప్రణాళికలు కొత్త రూపురేఖలు దిద్దుకుంటాయి. స్త్రీల వలన కొన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇంటి ఖర్చు తగ్గించడానికి చేసే ప్రయత్నాలు బెడిసికొడతాయి. స్థలాలు, కట్టడాలు, జలసంబంధిత వ్యాపారాలు కలిసివస్తాయి. స్వయం పర్యవేక్షణ లేక ఇతరుల మీద పూర్తిగా బాధ్యతలు వదిలి వేయడం వల్ల కొన్ని అనుభవాలు నేర్చుకుంటారు. మంచితనం, కుటుంబ, వంశ గౌరవం చాలా సందర్భాలలో ఆదుకుంటుంది. సామర్థ్యం లేని వ్యక్తులను ప్రోత్సహించడం ద్వారా కార్యనష్టం, కాలహరణం జరుగుతుంది. ఎవరిని ఏ పనికి ఉపయోగించుకోవాలో అంచనా వేయడంలో పొరబడతారు. స్వజనులు, బంధువర్గం లేక కులవర్గానికి చెందిన ఓ వ్యక్తి వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. నిష్కారణ శత్రుత్వం ఏర్పడుతుంది. మనుషుల మనోభావాలను స్పష్టంగా చదవగలరు. సంతానం విషయంలో కఠినమైన నిర్ణయాలు అనివార్యం అవుతాయి. ప్రేమవివాహాలు విఫలం అవుతాయి. విద్యారంగంలో కృషి చేసేవారికి ఆరంభంలోనే ఉద్యోగం వస్తుంది. కుల మత వర్గాలకు అతీతంగా శక్తి సామర్థ్యాలకు పెద్దపీట వేస్తారు. మధ్యవర్తిత్వం చేయడం వల్ల కొన్ని చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు. వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు ఖర్చులు ఎక్కువవుతాయి. కుల రాజకీయాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల సలహాలు నచ్చేవి అమలు చేయండి. ఇతరులు సలహాలు చెప్పడానికి భయపడే వాతావరణం కలిగించవద్దు. పట్టుదలతో పాటు, పట్టువిడుపులు కూడా మంచికి దారితీస్తాయని గ్రహించండి. ప్రభుత్వపరంగా, ప్రైవేట్‌పరంగా రావలసిన బిల్లులు ఆలస్యం అవుతాయి. ఆర్థికసంస్థల నుండి, బ్యాంకుల నుండి లోనులు తీసుకుంటారు. అతికష్టం మీద ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. ప్రాధాన్యతలేని సీటుకు తాత్కాలికంగా బదిలీ అవుతారు. ఒక పదవికి సంబంధించి మీ పేరు పరిశీలనలో ఉంటుంది. వైరివర్గం గురించిన రహస్య సమాచారం మీ చేతికి అందుతుంది. తొందరపడకుండా సమయ సందర్భాల కోసం ఎదురు చూస్తారు. ప్రేమపెళ్లిళ్లకు సంబంధించిన వ్యవహారాలు చికాకు కలిగిస్తాయి. పునర్వివాహం చేసుకోవాలనుకునేవారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని అమ్మకాలకు సంబంధించిన విషయాలలో లాభపడతారు. ఋణాలు తీరుస్తారు. తనఖాలు విడిపిస్తారు. విలువైన వస్తువులను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అనుకూలమైన ఫలితాలు మొత్తం మీకే దక్కవు. వ్యవహారాలకు ఏమాత్రం సంబంధించని వ్యక్తులకు వాటాలు పంచవలసి వస్తుంది. పన్నులు వసూలు చేసే అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేవారికి కాలం అనుకూలంగా ఉంది. ఉపయోగంలేని వ్యక్తుల సాంగత్యం ఇబ్బందికరంగా మారుతుంది. మేలు చేస్తారని భావించిన వ్యక్తులు ముఖం చాటేస్తారు. కీడు చేస్తారనుకున్న వ్యక్తులు మేలు చేస్తారు. మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. స్త్రీ సంతానం పురోగతి బాగుంటుంది. మీ విలువ అందరికీ తెలిసివస్తుంది. స్త్రీలతో ఏర్పడిన సమస్యలు సమసిపోతాయి. అసత్య ప్రచారం చేస్తున్న ప్రత్యర్థులు మీకన్నా బలవంతులైనా లెక్కచేయరు. పరిస్థితులను అంచనావేసి తగిన వ్యూహాలను అమలుచేస్తారు. సాంకేతిక పోటీపరీక్షలలో విజయం సాధిస్తారు. భూ వ్యవహారాలు, మరికొన్ని ముఖ్య వ్యవహారాలు మీకు అనుకూలంగా మారడం వల్ల సాటివారికి అసూయ పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో చదివిన చదువుకు, చేసే ఉద్యోగానికి సంబంధం ఉండదు. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ, సాఫ్ట్వేర్ రంగాలలో రాణిస్తారు. నమ్మకద్రోహులు అడుగడుగునా ఎదురవుతారు. జలక్రీడలు, ఈతలకు దూరంగా ఉండటం మంచిది. పార్ట్‌టైమ్, టెంపరరీ ఉద్యోగాలు చేస్తున్నవారికి పర్మినెంట్ ఉద్యోగం లభిస్తుంది. ప్రాంతీయ విభేదాలు మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకుండా ఏదైనా పని చేసేటప్పుడు సన్నిహితులను, నిపుణులను సంప్రదించండి. ప్రతి విషయంలోనూ జీవితభాగస్వామికి సంజాయిషీ ఇవ్వవలసి రావటం మీ మనోవేదనకు కారణం అవుతుంది. లాభాలు పంచుకునే విషయంలో పనిచేయని వ్యక్తులకు, సోమరిపోతులకు భాగాలు ఇవ్వవలసిన పరిస్థితిని జీర్ణించుకోలేకపోతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కుటుంబపరంగా సమష్టి నిర్ణయం తీసుకుంటారు. పార్టీ మారడం వల్ల మంచి రాజకీయ ఫలితాలు పొందగలుగుతారు. చిన్నాచితకా వ్యాపారాలు, చేతివృత్తులు, ఆధ్యాత్మిక వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. అరిష్ట ఉద్వాసనకు నల్లవత్తులతో దీపారాధన చేయండి. సర్పదోష నివారణ కంకణం ధరించండి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. సువర్ణాభరణాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. సొంతవారితో మాట్లాడడానికి తీరికలేని పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. సంవత్సర ద్వితీయార్ధంలో వ్యక్తిగత శ్రమ, జీవితభాగస్వామి అదృష్టం తోడై మంచితనంతో ఆస్తి, ధనం సంపాదిస్తారు. సంతానం వల్ల కుటుంబానికి కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. మీ వ్యక్తిగత పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా పెరుగుుతారు. సమాజంలో ఒక స్థాయి కలిగినవారు మీపై నిష్కారణ ద్వేషం పెంచుకుంటారు. స్త్రీల వల్ల కొన్ని ఉపయోగాలు ఏర్పడతాయి. స్త్రీలకు ప్రత్యేకం: ఈ రాశిలో జన్మించినవారికి ఈ సంవత్సరం బాగుంది. విద్యార్థినులకు మెరిట్ మార్కులు, స్కాలర్షిప్స్ వస్తాయి. రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ లాభిస్తాయి. ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్ లభిస్తుంది. సివిల్స్ స్థాయి పోటీ పరీక్షల కోసం పట్టుదలతో శ్రమించి, విజయం సాధిస్తారు. మెడిసిన్ సీటు లభిస్తుంది. పునర్వివాహ ప్రయత్నాలు చేసేవారికి మధ్యవర్తుల వల్ల మేలు జరుగుుతుంది. అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానంలేని వారికి సంతానప్రాప్తి కలుగుుతుంది. కొందరికి జీవితభాగస్వామి లేదా తత్సమానమైన వ్యక్తితో విభేదాలు తీవ్రతరం అవుతాయి. వ్యాపారంలో మీరు ప్రవేశపెట్టిన కొత్త ఉత్పత్తులు ప్రజాదరణకు నోచుకుంటాయి. సన్నిహితులు, స్నేహితులు, బంధువుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. పొదుపు పథకాల ద్వారా లబ్ధి పొందుతారు. విలువైన వస్తువుల భద్రత గురించి ఎక్కువ శ్రద్ధ చూపండి. బ్యూటీ పార్లర్స్, అలంకార సామాగ్రి వ్యాపారాలు లాభిస్తాయి. కళా, సాంస్కృతికరంగాలలో రాణిస్తారు. పరిమళగంధంతో, సుగుంధ సిద్ధగంధాక్షతలతో పూజ చేయండి. చలనచిత్ర, టీవీ రంగాలలో అవకాశాలు లభిస్తాయి. పిల్లలను అతి గారాబం చేయడం వల్ల చేదు అనుభవాలు ఎదురవుతాయి. సంతాన సాఫల్యకేంద్రాల వల్ల, దొంగ స్వామీజీల వల్ల మోసపోతారు. సంతాన విద్యా విషయమైన ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వాళ్ళ మీద ఇతరుల ప్రభావం పడకుండా జాగ్రత్తపడండి. సన్నిహితులతో, ముఖ్యమైన వ్యక్తులతో సంప్రదించి ఏ కార్యక్రమాలలోనైనా నిర్ణయం తీసుకోండి. ఎవరికీ లొంగి ఉండాల్సిన అవసరం లేదని భావిస్తారు. మిమ్మల్ని నియంత్రించి గుప్పెట్లో పెట్టుకోవాలనే వారికి భంగపాటు తప్పదు. గతించిపోయిన ఆత్మీయుల జ్ఞాపకాలు మనసుని బాధిస్తాయి. సౌందర్య చిట్కాలు, యోగాభ్యాసాలు, మెడిటేషన్ మొదలైన వాటి వల్ల ప్రయోజనం పొందుతారు. మీ సిద్ధాంతాలను పక్కన పెట్టవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కొంతకాలం అంతరాత్మ సాక్షికి విరుద్ధంగా ఇష్టంలేని వ్యక్తులతో కలసి పనిచేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ కూడా మీ శక్తిసామర్థ్యాలు గుర్తింపబడతాయి. మీ పట్ల హేళన భావన కలిగిన వారికి మీ ఉన్నతస్థితితో తగిన సమాధానం చెప్పగలరు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు సుబ్రహ్మణ్య పాశుపత కంకణం ధరించాలి, సర్పదోష నివారణ రూపు మెడలో ధరించాలి. ఇతరుల పేరు మీద చేసే వ్యాపారాలు బాగుంటాయి. కాంట్రాక్టులు, వర్క్ఆర్డర్లు, సబ్‌కాంట్రాక్టులు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయరంగంలో రాణిస్తారు, పదవి లభిస్తుంది. సొంతవాళ్ళుగా భావించిన వ్యక్తులు మీ దగ్గరే రహస్యాలు దాచిపెట్టడం మీ కోపానికి కారణం అవుతుంది. ప్రతి శుక్రవారం అరావళి కుంకుమతో, లకీ‡్ష్మచందనంతో శ్రీ మహాలకీ‡్ష్మదేవిని పూజించండి. కొత్త కొత్త ఆహార నియమాలు పాటించడం వలన ప్రయోజనం కలగకపోగా ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. బిజినెస్ మేనేజ్మెంట్, ఐటీ రంగాలలోనివారు రాణిస్తారు. ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ కనబరుస్తారు. -
మేషంలో పుట్టారా? అసహనం ఎక్కువే!
ఆస్ట్రోఫన్డా రాశుల స్వభావం, రాశిచక్రం గురించి సంక్షిప్తంగా చెప్పుకుందాం. రాశిచక్ర ప్రమాణం 360 డిగ్రీలు. ఇందులో పన్నెండు రాశులు ఉంటాయి. ఒక్కో రాశి ప్రమాణం 30 డిగ్రీలు. రాశిచక్రంలో 27 నక్షత్రాలు ఉంటాయి. ఒక్కో నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఉంటాయి. అంటే, రాశిచక్రంలోని మొత్తం 108 నక్షత్ర పాదాలు ఉంటాయి. ఒక్కో రాశిలో తొమ్మిదేసి నక్షత్ర పాదాలు ఉంటాయి. ఈ లెక్కన ఒక్కో నక్షత్ర ప్రమాణం 13 డిగ్రీల 20 మినిట్స్. ఒక్కో నక్షత్ర పాద ప్రమాణం 3 డిగ్రీల 20 మినిట్స్. రాశిచక్రంలో మొదటిది మేషరాశి. ఇందులో అశ్విని నాలుగు పాదాలు, భరణి నాలుగు పాదాలు, కృత్తిక ఒకటో పాదం ఉంటాయి. ఇది బేసి రాశి, పురుష రాశి, అగ్నితత్వం, క్షత్రియ వర్ణం, క్రూరస్వభావం కలిగిన చరరాశి. ఈ రాశి చిహ్నం మేక. ఇది వనచరం అంటే, అడవులు, పర్వతప్రాంతాలలో సంచరించేది. ఈ రాశికి అధిపతి కుజుడు. బ్రిటన్, డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్, సిరియా, పెరూ దేశాలు ఈ రాశి పరిధిలోకి వస్తాయి. ముఖం, మెదడుపై ఈ రాశి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీని లోహం బంగారం, రంగు ఎరుపు, ధాన్యం కందులు. చంద్రుడు మేషంలో ఉండగా జన్మించిన వారికి మేషం జన్మరాశి అవుతుంది. మేషరాశిలో జన్మించిన వారికి నాయకత్వ లక్షణాలు, దూకుడు స్వభావం కలిగి ఉంటారు. స్వేచ్ఛాప్రియులు. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిరాశకు లోనికాని ఆశావహ దృక్పథం వీరి సొంతం. వీరికి అసహనం కూడా ఎక్కువే. భావోద్వేగాలను ఏమాత్రం అదుపు చేసుకోలేరు. సవాళ్లను ఎదుర్కోవడంలో ముందంజలో ఉంటారు. త్వరగా మనుషులను ఆకట్టుకోవడంలో మేషరాశి జాతకులకు చాలా నేర్పు ఉంటుంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారి పట్ల తేలికగా కినుకబూనుతారు. కొన్నిసార్లు ప్రతీకారేచ్ఛను కూడా పెంచుకుంటారు. ఒక్కోసారి మితిమీరిన ఆత్మవిశ్వాసం కారణంగా చిక్కుల్లో పడుతుంటారు. జాతకంలో రవి, కుజుడు, చంద్రుడు అనుకూలిస్తే కార్యనిర్వహణ రంగాల్లో చక్కగా రాణిస్తారు. పోలీసు, సైనిక ఉద్యోగాల్లో, న్యాయవాదులుగా, మేనేజర్లుగా, ఇంజనీర్లుగా, శస్త్రవైద్యులుగా ప్రత్యేకతను నిలుపుకుంటారు. లోహాలకు, కలపకు సంబంధించిన వృత్తులు, వ్యాపారాలు, పరిశ్రమలలో కూడా విజయాలు సాధిస్తారు. గ్రహస్థితి ప్రతికూలిస్తే మొండితనం, ఈర్ష్య, స్వార్థం కారణంగా ఇబ్బందులు పడతారు. నోటి దురుసుతనంతో తరచు గొడవలకు దిగుతుంటారు. తేలికగా దుర్వ్యసనాలకు లోనవుతారు. (వృషభరాశి స్వభావం గురించి వచ్చేవారం...) - పన్యాల జగన్నాథ దాసు -
శ్రీ జయ నామ సంవత్సర రాశిఫలాలు
మేషం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 5.) వీరికి జూన్ 19 నుంచి చతుర్ధంలో గురుడు ఉచ్ఛస్థితి సంచారం అన్ని విధాలా ఉపకరిస్తుంది. ప్రథమార్థంలో సామాన్యంగా ఉన్నా, క్రమేపీ పరిస్థితులు కొంత చక్కబడతాయి. నవంబర్ నుంచి అష్టమ శని ప్రారంభం. సప్తమ, అష్టమ రాశుల్లో శని సంచారం అంత అనుకూలం కాదు. మొత్తం మీద వీరికి మధ్యస్థంగా ఉంటుంది. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. రావలసిన సొమ్ము ఆలస్యం కాగలదు. ఎంతగా శ్రమించినా తగిన గుర్తింపు రాక నిరాశ చెందుతారు. ఇతరులకు హామీల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు కాకుండా నిదానం పాటించడం సర్వదా శ్రేయస్కరం. జీవిత భాగస్వామితో వివాదాలు నెలకొంటాయి. తలచిన పనులు కొంత నెమ్మదిస్తాయి. అయితే జూలై నుంచి గురుని అనుకూలత వల్ల ఆర్థికంగా, సామాజికంగా ఉత్సాహవంతంగా ఉంటుంది. శ్రేయోభిలాషులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుంచి బయటపడే అవకాశం. ద్వితీయార్థంలో వాహన, గృహయోగాలు. వ్యాపార సంస్థల వారికి సామాన్య లాభాలు దక్కుతాయి. ఉద్యోగులు విధుల్లో కొంత అప్రమత్తత పాటించాలి. ద్వితీయార్థంలో పదోన్నతులతో పాటు బదిలీలు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలం. కళాకారులు, క్రీడాకారులకు అవకాశాలు దక్కినా అసంతృప్తి తప్పదు. రాజకీయవర్గాలకు మొదట్లో కొంత వ్యతిరేకత ఎదురైనా ద్వితీయార్థంలో పదవులు, సన్మానాలు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. తరచూ దూరప్రయాణాలు ఉండవచ్చు. సెప్టెంబర్, అక్టోబర్ మధ్య కుజుడు, నవంబర్ నుంచి శని అష్టమస్థితి కారణంగా వ్యవహారాలలో చిక్కులు. వ్యయప్రయాసలు. చర్మ, నరాల సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు. వైద్య సలహాలు స్వీకరిస్తారు. ఈ కాలంలో స్థానచలనాలు కలిగే అవకాశం. జ్యేష్ఠం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. వీరు సుబ్రహ్మణ్యాష్టకం పఠించడంతో పాటు, శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. అదృష్ట సంఖ్య-9. వృషభం (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం -5.) వీరికి ప్రథమార్ధంలో గురు, శని, రాహువుల అనుకూల స్థితి ఉపకరిస్తుంది. వ్యయంలో కేతువు వల్ల మానసిక క్లేశాలు, వ్యయప్రయాసలు. ద్వితీయార్థంలో గురుడు తృతీయ రాశిలో సంచారం కలిగినా శుభస్థితి వల్ల మధ్యస్థంగా ఉంటుంది. జూలై నుంచి పంచమ రాహువు, లాభస్థితిలో కేతువు అన్ని విధాలా అనుకూలురు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రథమార్థంలో రాబడి బాగుంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులు, బంధువులు చేరువ కాగలరు. ఇతరులకు సలహాలు ఇవ్వడంలో చొరవ చూపుతారు. కొన్ని వివాదాల పరిష్కారంలో మధ్యవర్తిత్వం వహిస్తారు. అయితే తొందరపాటు మాటల కారణంగా ఇంటాబయటా వివాదాలు నెలకొనే అవకాశముంది, ఆచితూచి వ్యవహరించండి. గృహ నిర్మాణాలు, శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు. చేపట్టిన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగుతాయి. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. భూసంబంధిత వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాల సాధన దిశగా ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. కొత్త పెట్టుబడులతో ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగస్తులకు పెండింగ్ బకాయిలు అందుతాయి. విధుల్లో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారికి మంచి గుర్తింపు రాగలదు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. కళాకారులు నైపుణ్యాన్ని చాటుకుని ముందుకు సాగుతారు. రాజకీయవర్గాల వారు కొత్త పదవులు చేపట్టే వీలుంది. ప్రజాదరణ పొందుతారు. వ్యవసాయదారులకు మొదటి పంట లాభదాయకం. సాంకేతిక వర్గాలవారికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొందరికి విదేశీయానం కూడా ఉండవచ్చు. అక్టోబర్ - నవంబర్ మధ్య అష్టమ కుజుడు, నవంబర్ నుంచి సప్తమ శని ప్రభావం వల్ల కొంత చికాకులు తప్పకపోవచ్చు. నరాలు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ గ్రహాలకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం పఠించండి. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-6. మిథునం (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 3, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుబలం విశేషం. ప్రథమార్థంలో శని, రాహుకేతువులు అనుకూలురు. జూలై నుంచి అర్థాష్టమ రాహువు ప్రభావం కలిగినా గురుబలం ఉపకరిస్తుంది. మొత్తం మీద వీరికి ద్వితీయార్థం అనుకూల కాలమని చెప్పాలి. స్వతంత్రభావాలు, నిర్ణయాల వల్ల కొన్ని చిక్కులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ఇతరుల అభిప్రాయాలను అంతగా పట్టించుకోకపోవడం వల్ల ఒక్కొక్కప్పుడు సమస్యలు ఎదురయ్యే అవకాశం. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. స్థిరాస్తి విషయంలో నెలకొన్న వివాదాలు జూన్ తర్వాత పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కొన్ని రుణాలు సైతం తీరుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విలాసవంత జీవనానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. శాస్త్ర, పరిశోధనారంగాల వారికి మంచి గుర్తింపు. విద్యార్థులు అనుకున్న ర్యాంకులు సాధిస్తారు. కళాకారులు చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుని విజయాలు సాధిస్తారు. రాజకీయవేత్తలకు శుభసూచకాలే. పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలం. నవంబర్ - జనవరి మధ్య కుజుని అష్టమస్థితి సంచారం వల్ల ఈతిబాధలు, మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. అయితే మకరరాశి కుజునికి ఉచ్ఛస్థితి కావడం వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. దుర్గాదేవికి కుంకుమార్చనలు, సుబ్రహ్మణ్యారాధన మంచిది. చైత్రం, శ్రావణం, ఆశ్వయుజం, మాఘమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. కర్కాటకం (ఆదాయం - 5, వ్యయం - 8, రాజపూజ్యం - 6, అవమానం - 1.) వీరికి జూన్ నుంచి గురుడు స్వక్షేత్ర సంచారమైనా ఉచ్ఛస్థితి వల్ల కొంత అనుకూలం. జూలై నుంచి అర్థాష్టమ రాహువు, నవంబర్ 1 వరకు అర్థాష్టమ శని ప్రభావం అధికం. మొత్తం మీద వీరికి ఆదాయానికి లోటు లేకున్నా వృథా ఖర్చులు ఎదురవుతుంటాయి. ఇంటాబయటా ఒత్తిళ్లు ఎదుర్కొంటారు. మంచికి వెళ్లినా అపవాదులు భరించాల్సిన పరిస్థితి. కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి. తరచూ ప్రయాణాలు ఉంటాయి. ద్వితీయార్థంలో శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు నవంబర్ నుంచి అనుకూలిస్తాయి. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే కొన్ని విజయాలు సాధించే వీలుంది. దూరమైన బంధువులు తిరిగి దగ్గరకు చేరతారు. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడే వీలుంది. అయితే, శని, రాహువుల ప్రభావంతో పాటు, జూలై -సెప్టెంబర్ మధ్య కుజుని అర్ధాష్టమ స్థితి వల్ల కుటుంబ సమస్యలు తప్పకపోవచ్చు. ఆర్థికంగా ఇబ్బందులు కలిగినా అవసరాలకు డబ్బు అందడం విశేషం. జనవరి - ఫిబ్రవరి మధ్య అష్టమ కుజుని ప్రభావం వల్ల చర్మ, ఉదర సంబంధిత రుగ్మత లు, తద్వారా ఔషధసేవనం. వ్యాపారులు స్వల్పలాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు పైస్థాయి నుంచి ఒత్తిళ్లులు ఎదురైనా సమర్థతను చాటుకుంటారు. విద్యార్థులు అనుకున్న ఫలితాల కోసం మరింతగా శ్రమించాలి. వ్యవసాయదారులకు రెండవపంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతికరంగాల వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కళాకారులు నైపుణ్యాన్ని చూపినా తగిన గుర్తింపు రావడం కష్టమే. రాజకీయవర్గాల వారు ద్వితీయార్థంలో కొంత అనుకూల ఫలితాలు సాధిస్తారు. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణమాసాలు అనుకూలం. శని, గురు, రాహువు, కుజులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అదృష్ట సంఖ్య-2. సింహం (ఆదాయం - 8, వ్యయం - 2, రాజపూజ్యం - 2, అవమానం - 4.) వీరికి జూన్ వరకూ గురుడు యోగదాయకుడు. తదుపరి వ్యయస్థితి కలిగినా ఉచ్ఛస్థితి వల్ల శుభకార్యాల నిర్వహణకు ఖర్చు చేయాల్సివస్తుంది. జూలై వరకు రాహువు, నవంబర్ వరకూ శని యోగదాయకులు. మొత్తం మీద వీరికి మిశ్రమ ఫలితాలుఉంటాయి. ఆర్థిక లావాదేవీలు అనుకూలమే. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తి వివాదాలు, కోర్టు వ్యవహారాలు సానుకూలంగా పరిష్కారం. గృహ నిర్మాణం, వాహనాల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ఆశయాల సాధనలో ముందడుగు వేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తండ్రి తరఫు నుంచి ఆస్తి లేదా ధనలాభ సూచనలు. జీవిత భాగస్వామి సలహాల ద్వారా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలకు లోటు ఉండదు. ద్వితీయార్థం నుంచి గురుబలం తగ్గడం వల్ల కార్యక్రమాలపై మరింత శ్రద్ధ చూపాలి. అనవసర వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులకు కొత్త పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు ఆశించిన విధంగా ఉంటాయి. ఉద్యోగస్తులు పదోన్నతులతో కూడిన బదిలీలు పొందుతారు. కళాకారులకు ఊహించని అవకాశాలు దగ్గరకు వస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. విద్యార్థుల శ్రమ వృథా కాదు. మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండు పంటలూ లాభిస్తాయి. పారిశ్రామిక, వైద్యరంగాల వారు జారవిడుచుకున్న అవకాశాలను తిరిగి పొందుతారు. రాజకీయవర్గాలకు ప్రత్యర్థులు సైతం సహకరిస్తారు. పదవీయోగం, సన్మానాలు. క్రీడాకారులు నైపుణ్యాన్ని ప్రదర్శించి తమ సత్తా చాటుకుంటారు. నవంబర్ నుంచి శనికి అర్థాష్టమ స్థితి, సెప్టెంబర్ - అక్టోబర్ మధ్య అర్థాష్టమ కుజుని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా నరాలు, ఉదరం, నేత్ర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. ఈ కాలంలో శని, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-1. కన్య (ఆదాయం - 11, వ్యయం - 8, రాజపూజ్యం - 5, అవమానం - 4.) వీరికి జూన్ నుంచి గురుడు లాభస్థితి విశేషమైనది. నవంబర్ వరకూ ఏల్నాటిశని ఉన్నా గురుబలం వల్ల ప్రభావం తగ్గుతుంది. నవంబర్ నుంచి ఏల్నాటి శని పూర్తికాగలదు. జన్మరాశిలో జూలై వరకూ కుజుని స్తంభన వల్ల కొంత ఆందోళన, మానసిక అశాంతి. ఒత్తిడులు ఎదుర్కొంటారు. మధ్యమధ్యలో కొంత అవరోధాలు కలిగినా దేవగురుడు మీకు అన్ని విధాలా అనుకూలించడం వల్ల అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. పెండింగ్‌లోని కోర్టు కేసులు పరిష్కారమవుతాయ. స్థిరాస్తి వృద్ధి. జీవితాశయ సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ప్రత్యర్థులను సైతం చాకచక్యంగా మీ దారికి తెచ్చుకుంటారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. నేర్పుగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పరిహసించిన వారే ప్రశంసిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఇంటి నిర్మాణాలు, ఆస్తుల కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో మొదట్లో కొంత వెనుకబడినా క్రమేపీ అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు సఫలమవుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దరిచేరి ఆశ్చర్యపరుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం, విశేష ప్రజాదరణ. వ్యవసాయదారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. క్రీడలు, శాస్త్ర, సాంకేతిక వర్గాలకు అరుదైన పురస్కారాలు అందుతాయి. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. శని, రాహు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్య మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-5. తుల (ఆదాయం - 8, వ్యయం - 11, రాజపూజ్యం - 1, అవమానం - 7) వీరికి జన్మరాశిలో శని, రాహువులు, జూలై వరకూ కుజుడు వ్యయంలోనూ, తదుపరి జన్మరాశిలో సంచారం అంత అనుకూలం కాదు. అయితే గురుని స్థితి కొంత అనుకూలం కావడం ఊరట కలిగించే విషయం. మొత్తం మీద వీరికి సామాన్యంగానే ఉంటుంది. ప్రతి పనిలోనూ నిరాసక్తత, జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. రుణబాధలు ఎదురవుతాయి. చేసే కార్యాలలో ఏకాగ్రత లోపించడం వల్ల కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం. అందువల్ల నిర్ణయాలలోనూ ఆచితూచి అడుగు వేయడం సర్వదా శ్రేయస్కరం. బంధువులు, మిత్రుల నుంచి అపవాదులు, విమర్శలు సైతం ఎదుర్కొంటారు. గృహ నిర్మాణ యత్నాలు నెమ్మదిస్తాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ప్రధమార్థంలో గురుని భాగ్యస్థితి, తదుపరి దశమస్థితి వల్ల కొంత అనుకూలత ఉంటుంది. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. శుభకార్యాలకు విరివిగా ఖర్చు చేస్తారు. ఇతరులకు సైతం సహాయపడి దాతృత్వాన్ని చాటుకుంటారు. విలాసవంతంగా గడుపుతారు. వ్యాపారులు కొద్దిపాటి లాభాలతో సరిపెట్టుకోవాలి. ఉద్యోగులు విధుల్లో అప్రమత్తత పాటించాలి, పైస్థాయి నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. కళాకారులకు ద్వితీయార్థంలో కార్యజయం, శుభవార్తలు. విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. నిరుద్యోగుల యత్నాలు కొంత ఫలించే అవకాశం. వ్యవసాయదారులకు మొదటి పంట అనుకూలం. పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారు కొంత నిదానంగా సాగడమే ఉత్తమం. రాజకీయవర్గాలకు ప్రత్యర్థుల నుంచి సమస్యలు ఎదురుకావొచ్చు, ముఖ్య నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద వీరికి సామాన్యమనే చెప్పాలి. శని, రాహు, కేతువులు, కుజునికి పరిహారాలు చేయించుకుంటే మంచిది. ఆదిత్య హృదయం, హనుమాన్ చాలీసా పఠించండి. జ్యేష్టం, శ్రావణం, మార్గశిరం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-6. వృశ్చికం (ఆదాయం - 14, వ్యయం - 2, రాజపూజ్యం - 4, అవమానం - 7) వీరికి జూన్ 18వరకు అష్టమ గురుడు, వ్యయంలో శని, రాహువుల సంచారం అనుకూలం కాదు. జూన్ నుంచి గురుడు భాగ్యస్థానంలో ఉచ్ఛస్థితి వల్ల ఏల్నాటి శని ప్రభావం ఉన్నా జన్మరాశిపై గురుదృష్టి వల్ల కొంత ఉపశమనం కలుగుతుంది. పనుల్లో జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ పుంజుకుంటాయి. ఎంతటి బాధ్యతనైనా పట్టుదలతో నెరవేరుస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు తీరతాయి. జూన్ వరకూ కొంత ఆదుర్దా, మానసిక అశాంతి. కార్యక్రమాలలో ఆవాంతరాలు, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. కొన్ని విషయాలలో మౌనం మంచిది. కోపతాపాలకు దూరంగా ఉండండి. జూన్ నుంచి శుభకార్యాల నిర్వహణ. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. సమాజంలో మంచి గుర్తింపు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరుకుంటారు. విమర్శలు గుప్పించిన వారే ప్రశంసలు కురిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ధన లేదా ఆస్తి లాభాలు ఉంటాయి. వ్యాపారులు సామాన్య లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు శ్రమ పెరిగినా తగిన గుర్తింపు రాగలదు. పారిశ్రామిక, శాస్త్ర, సాంకేతిక రంగాల వారి కృషి కొంతమేరకు సఫలమవుతుంది. విద్యార్థుల కష్టం కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. కళాకారులకు ద్వితీయార్థంలో అనుకున్న అవకాశాలు దక్కుతాయి. జూలై నుంచి అక్టోబర్ వరకు, తిరిగి జనవరి - ఫిబ్రవరి మధ్య కుజ ప్రభావం వల్ల ఒత్తిడులు, అయినవారితో విభేదాలు. ప్రయాణాలలో ఆటంకాలు ఎదుర్కొంటారు. వీరు శని, రాహు, గురు, కుజులకు పరిహారాలు చేయించుకోవాలి. సుబ్రహ్మణ్యాష్టకం, ఆదిత్య హృదయం పఠించడం మంచిది. ఆషాఢం, భాద్రపదం, పుష్యం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-9. ధనుస్సు (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 7, అవమానం - 7) వీరికి జూన్ వరకు గురుడు సప్తమంలోనూ, తదుపరి అష్టమంలోనూ సంచరిస్తాడు. నవంబర్ వరకూ శని లాభస్థానంలో సంచారం. తదుపరి వ్యయస్థానంలో సంచరిస్తాడు. నవంబర్ నుంచి వీరికి ఏల్నాటిశని ప్రారంభం. అయితే గురుడు అష్టమంలో సంచారమైనా ఉచ్ఛస్థితి కావడం, వ్యయస్థితిలోని శనిని వీక్షించడం మంచిది. మొత్తం మీద శ్రమ కలిగినా కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలిగినా అవసరాలకు తగినంత డబ్బు అందుతుంది. సమాజంలో మీకంటూ ప్రత్యేక గౌరవం పొందుతారు. బంధువులు, మిత్రులు పూర్తిగా సహకరిస్తారు. ప్రథమార్థంలో వాహనాలు, ఆభరణాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. చిరకాల ప్రత్యర్థులు కూడా అనుకూలురుగా మారతారు. వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి. పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులు కోరుకున్న బదిలీలు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాలు అధిగమిస్తారు. పారిశ్రామిక, సాంకేతికవర్గాలకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది, తరచూ విదేశీ పర్యటనలు చేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. అవార్డులు సైతం దక్కవచ్చు. రాజకీయ నాయకులకు ప్రథమార్థంలో పదవీయోగాలు, విశేష ప్రజాదరణ. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. క్రీ డాకారులు, శాస్త్రవేత్తలకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. నవంబర్ నుంచి ఏల్నాటిశని ప్రారంభం వల్ల కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. చేసే పనిలో ఏకాగ్రత లోపించడం, ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో వీరు శని, గురులకు జపాదులు నిర్వహించాలి. హనుమాన్ చాలీసా పఠనం ఉపకరిస్తుంది. చైత్ర, శ్రావణం, ఆశ్వయుజం, మాఘ మాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. మకరం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 3, అవమానం - 3.) వీరికి జూన్ నుంచి గురుడు, నవంబర్ నుంచి శని విశేష యోగకారులై ఉంటారు. మొత్తం మీద వీరికి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. తలచిన పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయ సహకారాలు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తిలాభ సూచనలు. పట్టుదలతో కార్యోన్ముఖులై ముందుకుసాగి విజయాలు సాధిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. దీర్ఘకాలిక సమస్య ఒకటి కొలిక్కి వస్తుంది. కోర్టు వివాదాలు సైతం పరిష్కారమవుతాయి. ద్వితీయార్థంలో ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగులు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు పొందుతారు. రాజకీయవర్గాల వారికి చేజారిన పదవులు తిరిగి దక్కే అవకాశం. కళాకారులు ఊహించని రీతిలో అవకాశాలు దక్కించుకుంటారు, పురస్కారాలు వంటివి పొందుతారు. విద్యార్థుల శ్రమ ఫలించి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. వ్యవసాయదారులకు రెండవ పంట విశేషంగా లాభిస్తుంది. పారిశ్రామిక, వైద్యరంగాల వారు అనుకున్నది సాధిస్తారు. క్రీడాకారులు, శాస్త్రవేత్తలకు అవకాశాలు మెరుగుపడి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ప్రథమార్థంలో షష్టమంలో గురుడు, అర్థాష్టమంలో కేతు సంచారం వల్ల మనోవ్యథ, ఆరోగ్యసమస్యలు, ప్రయాణాలలో అవరోధాలు వంటి చికాకులు ఎదురవుతాయి. వీరు గురు, కేతువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. వైశాఖం, భాద్రపదం, కార్తీకం, ఫాల్గుణ మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. కుంభం (ఆదాయం - 5, వ్యయం - 5, రాజపూజ్యం - 6, అవమానం - 3.) వీరికి జూన్ వరకూ గురుడు విశేష యోగకారకుడు. భాగ్యస్థానంలో శని, రాహువులు సామాన్యులు. ఈ రీత్యా చూస్తే వీరికి ప్రధమార్థంలో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. యత్నకార్యసిద్ధి. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మిత్రులు, బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. స్థిరాస్తి వృద్ధి. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశయాలు సాధిస్తారు. శత్రువిజయం. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. రాబడితో పాటు ఖర్చులూ పెరుగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరి ఆమోదం పొందుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిభారం పెరిగినా తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. కళాకారులకు అనుకోని అవకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. వ్యవసాయదారులకు నూతనోత్సాహం. పంటల దిగుబడి పెరిగి రుణభారాల నుంచి విముక్తి పొందుతారు. రాజకీయవర్గాలకు పద వులు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలు గతం కంటే మెరుగైన అభివృద్ధిని సాధిస్తారు. శాస్త్ర, సాంకేతిక, క్రీడారంగాల వారికి పూర్వవైభవం. అష్టమరాశిలో జూలై వరకూ కుజుడు, జూలై నుంచి రాహువు సంచారం అంత మంచిది కాదు. దీనివల్ల మానసిక ఆందోళన. చర్మ, ఉదర, నరాల సంబంధిత రుగ్మతలు. లేనిపోని వివాదాలు నెలకొంటాయి. ఈ గ్రహాలకు పరిహారం చేయించుకుంటే మంచిది. విష్ణుసహస్రనామ పారాయణం మంచిది. చైత్రం, జ్యేష్టం, ఆశ్వయుజం, మార్గశిర మాసాలు అనుకూలం. అదృష్టసంఖ్య-8. మీనం (ఆదాయం - 2, వ్యయం - 11, రాజపూజ్యం - 2, అవమానం - 6.) వీరికి జూన్ నుంచి గురుడు విశేష యోగప్రదుడు కావడంతో పాటు, స్వక్షేత్రాన్ని వీక్షించడం శుభదాయకం. అష్టమ శని, రాహు ప్రభావం ఉన్నా గురుబలం వీరికి కొండంత అండగా ఉండడం శుభసూచికం. మొత్తం మీద వీరికి అనుకూలమనే చెప్పాలి. ఆర్థికంగా కొంత పుంజుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి విజయాలు సాధిస్తారు. బంధువర్గం, జీవిత భాగస్వామి తరఫు వారితో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. సమాజంలో మంచి గుర్తింపుతో పాటు, గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరతాయి. ఆత్మీయులు మరింత దగ్గరవుతారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. భూ, వాహనయోగాలు. చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులు ద్వితీయార్థంలో మరింతగా లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉంటాయి. పనిభారం మాత్రం తప్పదు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. కళాకారులకు మిశ్రమంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాల వారు జూన్ నుంచి అభివృద్ధి పథంలో సాగుతారు. వ్యవసాయదారులకు రెండవ పంట అనుకూలిస్తుంది. రాజకీయవర్గాలకు కొంత వ్యతిరేకత ఎదురైనా క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. విజయాల కోసం శ్రమపడాలి. శాస్త్ర, న్యాయ, సాంకేతికరంగాల వారు గతం కంటే మెరుగైన ఫలితాలు చూస్తారు. క్రీడాకారులు ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సొంతం చేసుకుంటారు. జూలై -సెప్టెంబర్ మధ్య అష్టమంలో కుజ, శని కలయిక వల్ల ఈతిబాధలు, మానసిక ఆందోళన. జీవిత భాగస్వామితో విభేదాలు. చర్మ, గొంతు, ఉదర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి. శనికి తైలాబిషేకం, సుబ్రహ్మణ్యాష్టకంతో పాటు దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయించుకుంటే మేలు. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, పుష్యమాసాలు అనుకూలం. అదృష్ట సంఖ్య-3. సర్వేజనా సుఖినోభవంతు... పుష్కరాలు... గురుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. గురుడు మేష రాశిలో ప్రవేశంతో గంగానది, వృషభం-నర్మద, మిథునం-సరస్వతీ, కర్కాటకం-యమున, సింహం-గోదావరి, కన్య-కృష్ణా, తుల-కావేరి, వృశ్చికం-తామ్రపర్ణీనది, ధనుస్సు-పుష్కర వాహిని, మకరం-తుంగభద్ర, కుంభం-సింధు నది, మీనం-ప్రణీతానదులకు పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలు 12 రోజులపాటు జరుగుతాయి. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు పుణ్యఫలాన్నిస్తాయి. శూన్యమాసాలు - నిర్ణయాలు సూర్యుడు మీనరాశిలో ఉండే చైత్రం, మిథున రాశిలో ఉండే ఆషాఢం, కన్య యందు భాద్రపదం, ధనుస్సులో ఉన్నప్పుడు పుష్య మాసం శూన్య మాసములని అంటారు. ఈ శూన్య మాసాల్లో శుభకార్యాలు నిర్వర్తించరు. ఆయనములు ఆయనములు రెండు. సూర్యుడు (రవి) మకర రాశిలో ప్రవేశంతో ఉత్తరాయణం, కర్కాటక రాశిలో ప్రవేశించునప్పుడు దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం ఆరునెలల కాలం అత్యంత పవిత్రమైన దిగా భావిస్తారు. ఈ కాలంలో పుణ్యకార్యాలు శుభఫలితాలనిస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలకు కూడా ప్రశస్తమైనది. -
చంద్రబింబం మార్చి 16 నుండి 22 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులు సమర్థత చాటుకుంటారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవితాశయం నెరవేరే సమయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధు, మిత్రుల నుంచి మాట సహాయం అందుతుంది. వ్యాపారాల్లో లాభాలు. పారిశ్రామికరంగం వారికి యోగవంతం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార లావాదేవీలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో వివాదాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. ఒక ప్రకటన నిరుద్యోగులకు నిరాశ కలిగించవచ్చు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులు ఒత్తిడులకు లోనవుతారు. రాజకీయరంగం వారికి గందరగోళం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు, ఆహ్వానాలు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. వాహనయోగం. భూవివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమయం. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగయత్నాలలో నిరుద్యోగులకు విజయం. గృహ నిర్మాణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. రాజకీయరంగం వారికి ప్రజాదరణ పెరుగుతుంది. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి సలహాలతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికరంగం వారికి అనుకోని అవకాశాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఇంటాబయటా అనుకూల పరిస్థితి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా పుంజుకుంటాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. నిరుద్యోగుల యత్నాలు సానుకూలం. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చే స్తారు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయరంగం వారికి కొత్త పదవులు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించవచ్చు. అనుకోని ప్రయాణాలు. కొన్ని పనులు నిదానంగా సాగుతాయి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. హితుల నుంచి శుభవార్తలు. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు. పదోన్నతులు. రాజకీయరంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. -
చంద్రబింబం: మార్చి 9 నుండి 15 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు. పనులలో కొద్దిపాటి ఆటంకాలు. ఆరోగ్యపరమైన చికాకులు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికరంగం వారికి నిరుత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఉద్యోగయోగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. రుణయత్నాలు. బంధువులతో వివాదాలు. ఆస్తి ఒప్పందాలు వాయిదా. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. విద్యార్థులకు కొంత నిరాశ. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వ్యయప్రయాసలు. అనుకోని ప్రయాణాలు. పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యభంగం. రాజకీయరంగం వారికి నిరాశాజనకంగా ఉంటుంది. పాతబాకీలు వసూలవుతాయి. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ప్రయాణాలలో కొత్త పరిచయాలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. బంధువులతో తగాదాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) స్థిరాస్తి వృద్ధి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు ఫలిస్తాయి. సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) పనులు సకాలంలో పూర్తి. శ్రమ ఫలించే సమయం. ఒక వ్యవహారంలో విజయం. భూములు, వాహనాలు కొంటారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరం. పారిశ్రామికరంగం వారు ఆహ్వానాలు అందుకుంటారు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకం. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. మిత్రుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. లాభాలు స్వల్పం. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయరంగం వారికి నిరుత్సాహం. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివరిలో ధన, వస్తులాభాలు. వాహనయోగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. కళారంగం వారు ఆచితూచి ముందుకు సాగడం మంచిది. వారం ప్రారంభంలో శుభవార్తలు. సోదరుల నుంచి ధనలాభం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.చిరకాల కోరిక నెరవేరుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితులు, మిత్రులు చేదోడుగా నిలుస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులలో జాప్యం. బంధువులు, మిత్రులతో వైరం. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. సోదరుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వ్యాపారాలు సామాన్యం. రాజకీయరంగం వారికి చికాకులు. వారం చివరిలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం : మార్చి 2 నుండి 8 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ యత్నాలు సానుకూలం. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికరంగం వారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. కళారంగం వారు అనుకోని అవకాశాలు పొందుతారు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. భూములు, వాహనాలు కొంటారు. రహస్య విషయాలు తెలుసుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. రాజకీయరంగం వారికి పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. పారిశ్రామికరంగం వారికి ప్రభుత్వ సహాయం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత మందగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యపరమైన చికాకులు కొంత తగ్గుతాయి. ఆస్తి విషయాలలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) కొత్త కార్యక్రమాలు చేపడతారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పాతబాకీలు అందుతాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) సన్నిహితులు సహకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. అనారోగ్యం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యలు తీరి ఊరట చెందుతారు. అరుదైన ఆహ్వానాలు రాగలవు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు క్రమేపీ అనుకూలిస్తుంది. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. వారం చివరిలో విందువినోదాలు. వాహనయోగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. ఆస్తుల విషయంలో సోదరుల నుంచి ఒత్తిడులు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికరంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. కోర్టు కేసుల నుంచి బయటపడతారు. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలలో ముందడుగు. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. అనారోగ్యం. సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం: ఫిబ్రవరి 23 నుండి మార్చి 1వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. సంఘంలో గౌరవమర్యాదలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతులు. రాజకీయరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) రావలసిన సొమ్ము కొంత ఆలస్యమవుతుంది. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. వారం మధ్యలో ధనవ్యయం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు. నిరుద్యోగుల కల ఫలించే సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. రాజకీయరంగం వారికి చికాకులు తొలగుతాయి. వారం చివరిలో ప్రయాణాలు, రుణాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపార లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు, ఇంక్రిమెంట్లు. పారిశ్రామికరంగం వారికి విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యభంగం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) అవసరాలు తీరతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనయోగం. పరిశోధనల్లో ముందడుగు వేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. వారం మధ్యలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) కొన్ని పనులు వాయిదా పడతాయి. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమానంతరం కొంత ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యం మందగిస్తుంది. బంధువులతో మాటపట్టింపులు ఏర్పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారంలో అనుకూలత. స్థిరాస్తి వృద్ధి. విద్యార్థులకు కోరుకున్న ఫలితాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) కొత్త పనులు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణాలు తీరతాయి. ఇంటిలో శుభకార్యాలు. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికరంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. మీ నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. బాకీలు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ప్రయాణాలు. అనారోగ్యం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఫర్వాలేదనిపిస్తుంది. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ప్రశంసలు. వారం చివరిలో కుటుంబంలో చికాకులు, వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం ఫిబ్రవరి 2 నుండి 8 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. గౌరవం లభిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు ప్రాప్తిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులలో విజయం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలకు హాజరవుతారు. భూవివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. విద్యార్థులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణాలు చేస్తారు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి సన్మానయోగం. వారం ప్రారంభంలో అనారోగ్యం. వివాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశాజనకంగా ఉన్నా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. పలుకుబడి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. ఒక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో దూరప్రయాణాలు. ధనవ్యయం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థి కంగా బాగుంటుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది. పరిశోధకులకు గుర్తింపు రాగలరు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఇంటిలో శుభకార్యాలు. బాకీలు అంది అవసరాలు తీరతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. పనులు సమయానికి పూర్తి కాగలవు. విందువినోదాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. వారం మధ్యలో ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. శ్రమ ఫలిస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వారం ప్రారంభంలో ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. నిర్ణయాలలో తొందరపాటు తగదు. బాధ్యతలు పెరుగుతాయి. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. విద్యార్థులకు ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పనుల్లో కొద్దిపాటి అవరోధాలు. వ్యాపార, ఉద్యోగాలలో నిరుత్సాహం. విదార్థుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. రావలసిన సొమ్ము అందుతుంది. ఇంటాబయటా ప్రోత్సాహం. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వివాదాలు. ధనవ్యయం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల సాయం అందుతుంది. పనులలో విజయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో అనారోగ్యం. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం జనవరి 26 నుండి ఫిబ్రవరి 1 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాక నిరాశ చెందుతారు. శ్రమ పెరుగుతుంది. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి. ఉద్యోగులు అదనపు బాధ్యతలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశయాలు నెరవేరతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) శ్రమ ఫలిస్తుంది. చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనుల్లో విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి. విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. విద్యార్థులకు శ్రమాధిక్యం. వారం చివరిలో దూరప్రయాణాలు. బాధ్యతలు పెరుగుతాయి. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) ఉద్యోగయత్నాలు సానుకూలం. వాహనాలు, భూములు కొంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వాహన, గృహయోగాలు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పనులు సజావుగా సాగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగి ముందుకు సాగుతారు. కళారంగం వారికి సన్మానాలు, పురస్కారాలు. వారం మధ్యలో సోదరులతో వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వారం చివర్లో ప్రయాణాలు. రుణయత్నాలు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో కొద్దిపాటి విభేదాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) రుణబాధలు తొలగుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. బంధువుల నుంచి ఆస్తి లాభ సూచనలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు అనుకోని ఆహ్వానాలు. వారం చివరిలో పనులు వాయిదా. మిత్రులతో వివాదాలు. -సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష పండితులు -
చంద్రబింబం డిసెంబర్ 29నుండి జనవరి 04 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి. రుణబాధలు తొలగుతాయి. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. భూ, గృహయోగాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ఆశలు నెరవేరే సమయం. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) దూరప్రాంతాల సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొంటారు. నిరుద్యోగుల యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు ఉంటాయి. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి అనూహ్యంగా బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. నిరుద్యోగుల యత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వారం చివరిలో దూరప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. కొందరికి పదవీయోగాలు. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పనుల్లో జాప్యం తప్పదు. బంధువులు, మిత్రులతో కొద్దిపాటి వివాదాలు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి ఉంటుంది. విద్యార్థులకు గందరగోళం తొలగుతుంది. వారం ప్రారంభంలో శుభకార్యాలకు హాజరవుతారు. ధన, వస్తులాభాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త 1,2పా.,) పనులు కొంత నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగించవచ్చు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సోదరులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. ఉద్యోగులకు ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ 1,2,3పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. రావలసిన సొమ్ము అందుతుంది. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. భూములు, వాహనాలు సమకూరతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువర్గంతో వివాదాలు సమసిపోతాయి. మీ ఆశయాలు నెరవేరే సమయం. నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు పొందుతారు. వ్యాపారాలలో సమస్యలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కవచ్చు. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో అనుకోని ప్రయాణాలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. చిరకాల స్వప్నం నెరవేరతుంది. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వారం మధ్యలో ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సజావుగా పూర్తి చేస్తారు. నిరుద్యోగుల యత్నాలు అనుకూలిస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. బంధువుల నుంచి ధనలాభం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులు విధుల్లో ప్రశంసలు పొందుతారు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. వారం మధ్యలో వివాదాలు. ఆరోగ్యభంగం. ఈ వారంలో పుట్టినరోజు జరుపుకునేవారికి... మీ కృషి ఫలించే సమయం. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. భూములు, వాహనాలు, ఇళ్లు సమకూరుతాయి. కళల పట్ల ఆసక్తి పెరుగుతుంది. వివాదాల నుంచి బయటపడతారు. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు రాగలదు. ద్వితీయార్థంలో ఊహించని పురస్కారాలు. మీతో పాటు ఈ వారం పుట్టినరోజు జరుపుకుంటోన్న సెలెబ్రిటీ... విద్యాబాలన్, నటి పుట్టినరోజు: జనవరి 1